ఆల్గో ట్రేడింగ్‌కు మార్గదర్శకాలు.. రిటైల్‌ ఇన్వెస్టర్ల లావాదేవీలకు సెబీ దన్ను | Sakshi
Sakshi News home page

ఆల్గో ట్రేడింగ్‌కు మార్గదర్శకాలు.. రిటైల్‌ ఇన్వెస్టర్ల లావాదేవీలకు సెబీ దన్ను

Published Fri, Dec 10 2021 2:19 PM

SEBI New Guidelines On Algo Trading - Sakshi

న్యూఢిల్లీ: రిటైల్‌ ఇన్వెస్టర్లు చేపట్టే ఆల్గోరిథమ్‌ ట్రేడింగ్‌కు తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. తద్వారా ఆల్గో ట్రేడింగ్‌ను రక్షణాత్మకంగా మలిచేందుకు వీలు కల్పించనుంది. అంతేకాకుండా మార్కెట్‌ మ్యానిప్యులేషన్లకు చెక్‌ పెట్టనుంది. ఆటోమేటెడ్‌ విధానంలో లావాదేవీల పూర్తికి ఆల్గో ట్రేడింగ్‌ను వినియోగించే సంగతి తెలిసిందే. ఈ విధానంలో ఇన్వెస్టర్‌ జారీ చేసిన ఆదేశాలమేరకు అప్పటికప్పుడు స్టాక్‌ ధరల ఆధారంగా లావాదేవీలు నమోదవుతుంటాయి. దీంతో షేరు కదలికలను ఇన్వెస్టర్‌ లేదా ట్రేడర్‌ అనుక్షణం గమనించవలసిన అవసరం ఉండదు. వెరసి ఆర్డర్లను మాన్యువల్‌గా చేపట్టవలసిన పరిస్థితులనుంచి తప్పించుకోవచ్చు. అప్లికేషన్‌ ప్రోగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌(ఏపీఐ) యాక్సెస్, ఆటోమేషన్‌ లావాదేవీలకు సంబంధించి సెబీ నియంత్రణ పరిధిలో మార్గదర్శకాలకు తెరతీసింది.

ప్రస్తుతం బ్రోకర్లు దాఖలు చేసిన లావాదేవీలకే ఎక్సేంజీలు అనుమతులు మంజూరు చేస్తున్నాయి. ఈ అంశాలపై సెబీ కన్సల్టేషన్‌ పేపర్‌ను విడుదల చేసింది. తాజా ప్రతిపాదనలపై జనవరి 15వరకూ అభిప్రాయసేకరణ చేపట్టనుంది. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement