ఫిజిక్స్‌వాలా డిజిటల్‌ యూనివర్సిటీ | PhysicsWallah CSC Academy to set up Digital University for rural learners | Sakshi
Sakshi News home page

ఫిజిక్స్‌వాలా డిజిటల్‌ యూనివర్సిటీ

Jun 28 2025 4:34 PM | Updated on Jun 28 2025 6:38 PM

PhysicsWallah CSC Academy to set up Digital University for rural learners

గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో సీఎస్‌సీ అకాడమీతో (సీఎస్‌సీఏ)తో ఎడ్యుకేషన్‌ కంపెనీ ఫిజిక్స్‌వాలా చేతులు కలిపింది. ఈ ఒప్పందం కింద డిజిటల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇది అక్రెడిటెడ్‌ ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రోగ్రాంలు, సర్టిఫికేషన్లు అందిస్తుంది.

బోధన కోసం కేంద్ర ఐటీ శాఖలో భాగమైన కామన్‌ సర్వీసెస్‌ సెంటర్లు (సీఎస్‌సీ) డిజిటల్‌ లెర్నింగ్‌ సెంటర్లుగా పని చేస్తాయి. అలాగే, ఫిజిక్స్‌వాలా సంస్థ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్‌ విధానాల్లో కూడా అందిస్తుంది. సైబర్‌సెక్యూరిటీ, కృత్రిమ మేథ వంటి అంశాల్లో నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణనివ్వడం, సమిష్టిగా కోర్సులు .. సర్టిఫికెట్‌ ప్రోగ్రాంలను రూపొందించడం మొదలైనవి ఈ భాగస్వామ్య లక్ష్యంగా ఉంటాయి.

Advertisement
 
Advertisement
Advertisement