India To Tax Netflix On The Income Earned From India, Says Report - Sakshi
Sakshi News home page

Netflix India Income Tax: నెట్‌ఫ్లిక్స్‌ ఆదాయంపై ట్యాక్స్‌ విధించే యోచనలో కేంద్రం?

May 12 2023 1:27 PM | Updated on May 12 2023 1:39 PM

India To Tax Netflix On The Income Earned From India - Sakshi

ప్రముఖ స్ట్రీమింగ్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌కు భారత్‌ భారీ షాకివ్వనున్నట్లు సమాచారం. ఆ సంస్థ అర్జించే ఆదాయంపై ట్యాక్స్‌ వసూలు చేయనుందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.  

ట్యాక్స్‌ అధికారుల సమాచారం మేరకు 2021-2022 సంవత్సరానికి నెట్‌ఫ్లిక్స్‌ పర్మినెంట్‌ ఎస్టాబ‍్లిష్‌మెంట్‌ ప్రాతిపదికన సుమారు 6.73 మిలియన్లు ఆదాయాన్ని గడించినట్లు తెలుస్తోంది. 

అమెరికాకు చెందిన నెట్‌ఫ్లిక్స్‌ భారత్‌ రెండవ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని, ఆ సంస్థలకు ఉద్యోగులతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కలిగి ఉందని ఆదాయపు పన్ను అదికారులు చెబుతున్నారు. కాబట్టే నెట్‌ఫ్లిక్స్‌ గడించే ఆదాయంలో పన్ను వసూలు చేయాలని భావిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్‌ చేస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement