Reliance Campa Soft Drinks In Udon - Sakshi
Sakshi News home page

ఉడాన్‌లో విక్రయానికి సిద్దమైన కాంపా డ్రింక్స్ - మరో రెండు నెలల్లో..

Apr 28 2023 7:51 AM | Updated on Apr 28 2023 1:11 PM

Campa drinks in udon - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బిజినెస్‌ టు బిజినెస్‌ ఈ-కామర్స్‌ పోర్టల్‌ ఉడాన్‌ తాజాగా రిలయన్స్‌ కంజ్యూమర్‌ ప్రొడక్ట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రిలయన్స్‌ రిటైల్‌ ప్రమోట్‌ చేస్తున్న కాంపా పానీయాలను ఉడాన్‌ విక్రయించనుంది. తొలుత 50,000 పైచిలుకు రిటైలర్లు, కిరాణా స్టోర్లలో కాంపా ఉత్పత్తులు లభిస్తాయి. వచ్చే రెండు నెలల్లో ఈ కేంద్రాల సంఖ్యను 1 లక్షకు చేరుస్తారు. ప్రాజెక్ట్‌ విస్తార్‌లో భాగంగా 3,000 వరకు జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను ఉడాన్‌ చేరవేస్తోంది. 2022లో 1.5 లక్షల టన్నుల ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా సరఫరా చేసినట్టు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement