బ్యాంకు తప్పిదంతో రుణమాఫీకి దూరం | - | Sakshi
Sakshi News home page

బ్యాంకు తప్పిదంతో రుణమాఫీకి దూరం

Aug 3 2024 12:12 AM | Updated on Aug 5 2024 4:59 PM

బ్యాంకు తప్పిదంతో రుణమాఫీకి దూరం

బ్యాంకు తప్పిదంతో రుణమాఫీకి దూరం

ఇల్లెందు: మండలంలోని రాఘబోయినగూడెం పంచాయతీ పరిధి మొట్లగూడెంనకు చెందిన రైతు గడిపర్తి వెంకటరామారావు బ్యాంకర్ల తప్పిదంతో రుణమాఫీ నగదు కోల్పోయాడు. ఆయన ఇల్లెందు డీసీసీబీలో రూ.1.06 లక్షల రుణం తీసుకోగా.. మొదటి, రెండు విడతల్లోనూ మాఫీ కాలేదు. ఈ విషయమై బ్యాంక్‌కు వెళ్లి మేనేజర్‌ను ఆరా తీశాడు. అయితే, ఏటా వడ్డీ చెల్లించి రెన్యువల్‌ చేయించుకునే క్రమంలో గత మార్చిలో ఆయన ఖాతాను సిబ్బంది రద్దు చేసి కొత్త ఖాతా తెరిచినట్లు తేలింది. దీంతో కొత్తగా రుణం తీసుకున్నట్లు ఆన్‌లైన్‌లో నమోదు కాగా, పాత ఖాతా నంబర్‌తో రుణమాఫీ మొత్తం మంజూరైనా ఆ ఖాతా మనుగడలో లేకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లాయని గుర్తించారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని వెంకటరామారావు కోరాడు.

Advertisement
 
Advertisement
Advertisement