అక్రమమా.. ఫిర్యాదు చేయండి | Sakshi
Sakshi News home page

అక్రమమా.. ఫిర్యాదు చేయండి

Published Sat, Apr 20 2024 12:10 AM

- - Sakshi

డౌన్‌లోడ్‌ ఇలా..

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ ఉన్న వారెవరైనా ప్లే స్టోర్‌ నుంచి సీ–విజిల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫోన్‌ నంబర్‌ నమోదు చేస్తే ఓటీపీ వస్తుంది. అనంతరం ఫొటో, వీడియో, ఆడియో మూడు రకాల ఆప్షన్లు వస్తాయి. లైవ్‌ లొకేషన్‌ ఆన్‌ చేసి అక్కడి పరిస్థితుల ఆధారంగా ఎంపిక చేసుకుని ప్రొసీడ్‌ కొట్టాలి. ఆపై ఫిర్యాదు నేరుగా సంబంధిత అధికారులకు చేరుతుంది.

కంట్రోల్‌ రూం నుంచి..

సీ–విజిల్‌కు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది ఘటనాస్థలికి సమీపాన ఉన్న అధికారుల బృందానికి సమాచారం చేరవేస్తారు. ఆ వెంటనే అధికారుల బృందం అక్కడకు వెళ్లి ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తుంది. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి, ఇతర అధికారులకు వెల్ల డిస్తే.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారు.

అసెంబ్లీ నుంచి అధికంగా..

గత అసెంబ్లీ ఎన్నికల నుంచి సీ–విజిల్‌ యాప్‌పై అధి కారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ప్రలో భాలకు చెక్‌ పెట్టాలంటే ఈ యాప్‌ బాగా ఉపయోగపడుతుందని చెబుతూ ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారం చేశారు. అలాగే, కళాశాలల్లో విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించగా.. ఎక్కువ మంది యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేలా కృషిచేస్తున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యాన మళ్లీ యాప్‌ ద్వారా ఫిర్యాదుకు ఉన్న అవకాశాలపై అవగాహన కల్పిస్తున్న నేపథ్యాన మంచి ఫలితాలు వస్తాయనే భావన వ్యక్తమవుతోంది.

‘సీ – విజిల్‌’తో సులువు, పారదర్శకత అవగాహన కల్పిస్తున్న అధికారులు

వంద నిమిషాల్లోనే చర్యలు..

ఎక్కడైనా మద్యం, డబ్బు, ఇతర సామాగ్రి ద్వారా ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలిసినా, ఇతర అంశాలపైనా ఫిర్యాదు చేయొచ్చు. ఈ మేరకు యాప్‌ ద్వారా అధికారులకు ఫిర్యాదు అందిన 100నిమిషాల్లోగా ఘటనా స్థలికి చేరుకుని చర్యలు తీసుకుంటారు. ఆపై ఏం చర్యలు తీసుకున్నారనే అంశం కూడా ఫిర్యాదుదారుడికి చేరవేస్తారు. ఇక సీ–విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని అధికార యంత్రాంగం చెబుతోంది.

ఎన్నికల వేళ తాయిలాలు సర్వసాధారణమయ్యాయి. అయితే, వీటిపై ఇన్నాళ్లు నేరుగా మాత్రమే ఫిర్యాదు చేయడానికి అవకాశముండేది. దీంతో నాయకులు, అభ్యర్థులపై భయం కారణంగా చాలామంది ఫిర్యాదుకు ముందుకొచ్చే వారు కాదు. ఈ నేపథ్యాన ఎన్నికల సంఘం సీ–విజిల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేసినా.. ఎక్కడైనా అక్రమాలకు పాల్పడినట్లు తెలిసినా, బహుమతులు దాచినట్లు గుర్తించినా ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. ఫొటోలు, వీడియోలు ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేస్తే అధికారులు తక్షణమే రంగంలోకి దిగి బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. ఈక్రమంలో ఎక్కడ కూడా ఫిర్యాదుదారుల పేరు, వివరాలు బయటకు వచ్చే అవకాశం లేనందున నిర్భయంగా ముందుకు రావాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. – ఖమ్మం సహకారనగర్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement