కుమారుడిని చూడనివ్వలేదని.. జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కుమారుడిని చూడనివ్వలేదని.. జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య

Sep 12 2023 12:28 AM | Updated on Sep 12 2023 11:12 AM

- - Sakshi

ప్రేమ్‌కుమార్‌(ఫైల్‌)

సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కూడా నటిస్తున్నాడు. ఇతనికి హైదరాబాద్‌ బోడుప్పల్‌కు చెందిన యువతితో వివాహం కాగా, వారికి ఐదేళ్ల బాబు చెర్రీ ఉన్నాడు.

కొత్తగూడెంటౌన్‌: కుమారుడిని చూడనివ్వలేదని మనస్తాపం చెంది తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన కొత్తగూడెం టూటౌన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరం పరిధిలోని నేతాజీబస్తీకి చెందిన సింగారపు భరత్‌కుమార్‌, సుభద్రలకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు ప్రేమ్‌ కుమార్‌ (32) ప్రైవేట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. సినిమాల్లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కూడా నటిస్తున్నాడు. ఇతనికి హైదరాబాద్‌ బోడుప్పల్‌కు చెందిన యువతితో వివాహం కాగా, వారికి ఐదేళ్ల బాబు చెర్రీ ఉన్నాడు.

ప్రేమ్‌ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండగా, భార్య ఐదు నెలల క్రితం పుట్టింటికి వెళ్లి, అక్కడే ఉంటోంది. అయితే కుమారుడిని చూసేందుకు వెళ్లగా అవమానించారంటూ ప్రేమ్‌ బాధపడుతుండేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తమ్ముడు రాజ్‌కుమార్‌ అర్ధరాత్రి నిద్రలేచి చూడగా ఉరివేసుకుని మృతి చెంది ఉన్నాడు.

కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ప్రేమ్‌ కళ్లు దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

 ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement
 
Advertisement
Advertisement