పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక యువతి తీవ్ర నిర్ణయం.. | - | Sakshi
Sakshi News home page

పెళ్లి సంబంధాలు చూస్తున్న తల్లిదండ్రులు.. వద్దంటే బలవంతం చేస్తున్నారని యువతి తీవ్ర నిర్ణయం..

Jul 16 2023 12:08 AM | Updated on Jul 16 2023 9:18 AM

- - Sakshi

భద్రాద్రి: పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. ఎస్‌ఐ రమణారెడ్డి కథనం ప్రకారం.. టేకులపల్లి మండలం రాంపురం పంచాయతీ పాతతండాకు చెందిన భూక్య పావని(24) తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చేస్తోంది. తండ్రి లంబి నాయక్‌ కొంతకాలంగా ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు.

పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని పలుమార్లు చెప్పగా, తండ్రి నచ్చచెబుతున్నాడు. మళ్లీ సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపం చెంది ఈ నెల 13న ఇంట్లోనే పురుగుల మందు తాగింది. దీంతో కుటుంబీకులు కొత్తగూడెం, అక్కడి నుంచి ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి శనివారం ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement