నూతన పరిశోధనలతో రైతులకు సాంకేతికత సులభం | Sakshi
Sakshi News home page

నూతన పరిశోధనలతో రైతులకు సాంకేతికత సులభం

Published Wed, Nov 15 2023 1:50 AM

సదస్సుకు హాజరైన శాస్త్రవేత్తలు - Sakshi

డీన్‌ డాక్టర్‌ వి.శ్రీనివాసరావు

బాపట్ల: నూతన పరిశోధనలతో రైతులకు సాంకేతికతను సులభంగా అందించేందుకు ఉపయోగపడుతుందని వ్యవసాయ కళాశాల డీన్‌ డాక్టరు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని 34మంది శాస్త్రవేత్తలతో పరిశోధనల పద్ధతులపై మూడురోజుల అవగాహన కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. వ్యవసాయ విస్తరణ విభాగం అధిపతి డాక్టర్‌ బి.విజయాభినందన మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమంలో విస్తరణ సైన్స్‌లో పరిశోధనా పద్ధతి ప్రాథమిక అంశాలు, సాంప్లింగ్‌ డిజైన్స్‌, ఎక్సపీరిమెంటల్‌ డిజైన్స్‌, మెటా ఎనాలిసిస్‌, సోషల్‌ సిములేషన్‌ పద్ధతులు, స్కేలింగ్‌ పద్ధతులు, డేటా ప్రాసెసింగ్‌, స్టాటిస్టికల్‌ టూల్స్‌ వంటి అంశాలు ఉంటాయని తెలిపారు. ఈ అంశాలపై పూర్తి అవగాహన చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్‌ రత్నకుమార్‌, రాధికా, రవికుమార్‌, సుధా జాకబ్‌, రమాదేవి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement