అబ్దుల్‌ కలాం జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tribute To APJ Abdul Kalam | Sakshi
Sakshi News home page

అబ్దుల్‌ కలాం జయంతి.. వైఎస్‌ జగన్‌ నివాళి

Oct 15 2026 10:24 AM | Updated on Oct 15 2026 10:26 AM

YS Jagan Pays Tribute To APJ Abdul Kalam

సాక్షి, తాడేపల్లి: నేడు దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి. కలాం జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నివాళి అర్పించారు. దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఆయన నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శం అని ప్రశంసలు కురిపించారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్స్‌ వేదికగా..‘విద్యతోనే వ్యక్తి ఎదుగుదల, యువశక్తితోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మిన గొప్ప దార్శనికుడు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం. శాస్త్రవేత్తగా విశిష్ట సేవలందించి, దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఆయన నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శం. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపి, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. కలాం జయంతి సందర్భంగా నివాళులు’ అని పోస్టు చేశారు.

ఇదీ చదవండి: వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థులకు కూటమి నేతల బెదిరింపులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement