తాడేపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలు కుట్రలు పన్నుతూ, వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. పోటీలో దిగితే కేసులు తప్పవంటూ తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. పోలీసు స్టేషనుకు పిలిపించి బైండోవర్ పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు. చిత్తూరు, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో విచ్చలవిడిగా బైండోవర్లు జరుగుతున్నాయి. బెదిరింపులకు పోలీసులను కూటమి నేతలు ఉసిగొల్పుతున్నారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది.


