గొల్లపల్లి రిజర్వాయర్‌ ఘటన.. వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి | YS Jagan deeply shocked by the incident at Gollapalli reservoir | Sakshi
Sakshi News home page

గొల్లపల్లి రిజర్వాయర్‌ ఘటన.. వైఎస్‌ జగన్ దిగ్భ్రాంతి

Oct 16 2026 4:20 PM | Updated on Oct 16 2026 4:51 PM

YS Jagan deeply shocked by the incident at Gollapalli reservoir

సత్యసాయి జిల్లా, సాక్షి: గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి ఐదుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన మహిళలు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని బాధిత కుటుంబాలకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని వైఎస్‌ జగన్‌ కోరారు.

కాగా, శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి రిజర్వాయర్‌లో పడి ఐదుగురు మృతి చెందిన ఘటన శుక్రవారం(అక్టోబర్‌ 16వ తేదీ) మధ్యాహ్న సమయంలో చోటు చేసుకుంది. గొల్లపల్లి రిజర్వాయర్‌కు విహారయాత్రకు వెళ్లిన  క్రమంలో ఈ విషాదం జరిగింది. ఈత కొట్టడానికి రిజర్వాయర్‌లో దిగి అందులో చిక్కుకుపోయి మృత్యువాత పడ్డారు. మృతులంతా మహిళలుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: కూటమిలో ఎన్నికల కుంపట్లు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement