కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది: ఎంపీ మిథున్‌రెడ్డి | TDP Resorting to Cheap Politics in Punganur Out of Fear: MP Mithun Reddy | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది: ఎంపీ మిథున్‌రెడ్డి

Oct 16 2026 3:27 PM | Updated on Oct 16 2026 3:56 PM

TDP Resorting to Cheap Politics in Punganur Out of Fear: MP Mithun Reddy

సాక్షి,వైఎస్సార్‌ జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే బయటి వ్యక్తులతో దాడులకు తెగబడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పుంగనూరులో టీడీపీకి గెలిచే సత్తా  లేదని విమర్శించారు.

ఈ సందర్భంగా మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘పైనుంచి ఒత్తిడి ఉందని, నామినేషన్లు తీసుకోమని ఆర్వో చెప్పారు. టీడీపీకి పుంగనూరులో గెలిచే సత్తా లేదు. ఈ దాడులకు, బెదిరింపులకు మేము భయపడే ప్రసక్తి లేదు. పోలీసులు, రెవెన్యూ వ్యవస్థలను చేతుల్లో పెట్టుకుని అడ్డదారిలో గెలిచేందుకు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. దమ్ముంటే ఎన్నికల్లో నేరుగా తలపడాలి’ అని సవాల్ విసిరారు.

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్​ ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియలో ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. అన్నమయ్య జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి భారీ కాన్వాయ్‌తో పుంగనూరు పురపాలక సంఘం అధ్యక్ష పదవికి, వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులను వెంటబెట్టుకొని బయల్దేరారు. ఈ క్రమంలో ఎంపీ మిథున్‌ రెడ్డి కాన్వాయ్‌పై కొందరు టీడీపీ నాయకులు, శ్రేణులు మారణాయుధాలతో దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఎంపీ మిథున్‌రెడ్డి, గన్‌మెన్‌లకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఎంపీ మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement