breaking news
punganuru muncipal elections
-
కూటమి ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుంది: ఎంపీ మిథున్‌రెడ్డి
సాక్షి,చిత్తూరు: ఎన్నికల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచే సత్తా లేక కూటమి నాయకులు తనపై హత్యాయత్యానికి దిగారని వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి మండిపడ్డారు. దాడులు, బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఎన్నికలు జరిపాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు.స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను అడ్డుకోవడమే లక్ష్యంగా గత మూడు, నాలుగు రోజులుగా బయట ప్రాంతాల నుంచి రౌడీలు, గూండాల ముఠాలను తీసుకొచ్చి వైఎస్సార్సీపీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానికంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కున్నూరులో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారని మిథున్‌రెడ్డి తెలిపారు. చైర్మన్ అభ్యర్థిని నామినేషన్ వేయించేందుకు తీసుకెళ్తున్న సమయంలో తనపై హత్యాయత్నం చేశారని వెల్లడించారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారని, పలు వాహనాలను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలవనీయకుండా భయపెట్టే ప్రయత్నాలు సాగనివ్వబోమని ఇకపై హెచ్చరించారు.చంద్రబాబు, లోకేశ్ కుట్రే..కున్నూరు ప్రాంతంలో సాధారణంగా ప్రశాంత వాతావరణం ఉంటుంది. అయితే స్థానిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో బయట ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను సమీకరించి గొడవలు సృష్టిస్తున్నారు. సుమారు 50 మంది వరకు బయట రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దాడులకు పాల్పడ్డారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ల ప్రోద్బలంతోనే బయట ప్రాంతాల నుంచి వ్యక్తులను సమీకరించి దాడులకు ప్రణాళిక రచించారు.ప్రజాస్వామ్యంలో ఎన్నికలంటే ప్రజల తీర్పును గౌరవించడం, ప్రత్యర్థులతో రాజకీయంగా పోటీ పడడం. దాడులు చేసి భయపెట్టడం కాదు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లినప్పటికీ రిటర్నింగ్ అధికారి వాటిని స్వీకరించలేని పరిస్థితి ఏర్పడింది. తమపై పైస్థాయి నుంచి తీవ్ర ఒత్తిళ్లు ఉన్నాయని, నామినేషన్లు స్వీకరించలేమని ఆర్ఓ చెప్పారు. నామినేషన్లు తీసుకోవడంతోపాటు కనీసం స్వీకరణకు సంబంధించిన రసీదు లేదా ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వడం లేదు. దాదాపు మూడు గంటలపాటు అక్కడే వేచి ఉన్నప్పటికీ ఆరు నామినేషన్లను కూడా స్వీకరించని పరిస్థితి నెలకొంది.ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సి ఉండగా, రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నామినేషన్లు దాఖలు చేసే ప్రాథమిక హక్కును కూడా అడ్డుకుంటే ఎన్నికలు నిర్వహించడంలో అర్థం ఏముంటుంది..? ప్రజల మద్దతు ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. దానికి బదులుగా ప్రత్యర్థుల నామినేషన్లను అడ్డుకోవడం, పత్రాలు లాక్కోవడం, దాడులు చేయించడం వంటి చర్యలకు పాల్పడటం సరికాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి అభ్యర్థికి సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులపై ఉంది. నామినేషన్ల దాఖలు విషయంలో తదుపరి చర్యలు ఎలా తీసుకోవాలనే అంశంపై పార్టీ పెద్దలు, ఇతర నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలపై పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతాం. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం. ప్రజల తీర్పును గౌరవించకుండా దాడులు, బెదిరింపులతో ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించాలని చూడటం ప్రజా స్వామ్యానికే ప్రమాదకరమని చంద్రబాబు,లోకేశ్ గుర్తు పెట్టుకోవాలి.వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు బెదిరింపులకు వెనుకాడకుండా ప్రజాస్వామ్య బద్ధంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తారు.ఇదీ చదవండి : కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. తలలు పట్టుకుంటున్న నేతలు -
పుంగనూరులో టీడీపీ ఘోర పరాజయం
పుంగనూరు, న్యూస్‌లైన్: పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దెబ్బ కు వెంకటరమణరాజు కుటుంబం చతి కిలపడింది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటరమణరాజు సోదరుడు రామక్రిష్ణంరాజు, ఆయన సతీమణి చంద్రకళ కౌన్సిలర్లుగా ఓడిపోయారు. చంద్రకళను టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా నిలపాల ని వెంకటరమణరాజు కలలుకన్నారు. ఆయన ఆశలు నెరవేరకపోగా ఆమె కౌన్సిలర్‌గా కూడా విజయం సాధించలేకపోయారు. పట్టణంలోని 24వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఇబ్రహీం చేతిలో రామక్రిష్ణంరాజు 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన సతీమణి చంద్రకళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లలిత చేతిలో 266 ఓట్ల తేడాతో ఓటమి పాల య్యారు. అలాగే పట్టణంలో ప్రముఖ నేతలుగా ఉన్న మూడవ వార్డు అభ్యర్థి చనకంటి సాంబమూర్తి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎండి.రహంతుల్లా చేతిలో 334 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. 9వ వార్డులో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆవుల అమరేంద్ర చేతిలో టీడీపీ నాయకుడు కేశవమూర్తి సోదరుడు క్రిష్ణమూర్తి 198 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.


