బీటెక్‌ రవి బంధువు వీరంగం | tdp btech ravi cousin over action in Pulivendula | Sakshi
Sakshi News home page

బీటెక్‌ రవి బంధువు వీరంగం

Jun 26 2025 12:48 PM | Updated on Jun 26 2025 12:56 PM

tdp btech ravi cousin over action in Pulivendula

ట్రిపుల్‌ ఐటీ ఓల్డ్‌ క్యాంపస్‌లో క్యాంటీన్‌ మేనేజర్‌పై దాడి

ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని జైస్వాల్‌ కంపెనీ వారికి బెదిరింపులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పులివెందుల నియోజకవర్గంలో రోజురోజుకు టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు. దాడులు, బెదిరింపులతో చెలరేగిపోతున్నారు. ఏదో ఒక రకంగా భయపెట్టి పంతం నెగ్గించుకోవాలన్న ఆలోచనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారం అండగా ఉందని, తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో పెట్రేగి పోతున్నారు.

 ఎక్కడ చూసినా గొడవలు, బెదిరింపులతో ప్రత్యర్థులను బెదరగొట్టి పని కానిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. వేంపల్లె మండలం ట్రిపుల్‌ ఐటీ ఓల్డ్‌ క్యాంపస్‌ పరిధిలో ఉన్న జైస్వాల్‌ కంపెనీకి చెందిన క్యాంటీన్‌ను ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి బంధువు, వేంపల్లె మండల ఇన్‌చార్జి అయిన రఘునాథరెడ్డి రెచ్చిపోయారు. 

మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, మేము నడుపుకోవాలంటూ బెదిరింపులకు దిగడంతోపాటు ఏకంగా అక్కడ ఉన్న జైస్వాల్‌ కంపెనీ మేనేజర్‌ ఖాన్‌పై దాడులకు తెగబడ్డారు. ప్రత్యేకంగా రెండు వాహనాలతోపాటు బైకుల్లో వచ్చిన రఘునాథరెడ్డి, అతని అనుచరులు బీభత్సం సృష్టించారు. ఈ వ్యవహారంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ఘటనలతో టీడీపీ ప్రతిష్ట మరింత దిగజారుతోందని ఆ పార్టీలోని కొందరు నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement