Andhra Pradesh Finance Minister Buggana Rajendranath Reddy Visit To Vietnam - Sakshi
Sakshi News home page

వియత్నాం పర్యటనలో ఆర్థిక మంత్రి బుగ్గన

Jul 22 2023 4:46 PM | Updated on Jul 22 2023 6:01 PM

Finance Minister Buggana Rajendranath Reddy Visit To Vietnam - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వియత్నాంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వియత్నాం ప్రభుత్వ ప్రణాళిక, పరిశ్రమల డిప్యూటీ మినిస్టర్ డో తాన్హ్ ట్రంగ్ తో సమావేశమయ్యారు. ఇందులో వొకేషనల్ ట్రైనింగ్, పారిశ్రామికాభివృద్ధికి సంబంధించిన తోడ్పాటుపై ప్రధానంగా చర్చతో పాటు వియత్నాం నుంచి మరింత సహకారం దిశగా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు కోసం చర్చించినట్లు తెలుస్తోంది.

అనంతరం వియత్నాం ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ట్రాన్ కోక్ ఫుంగ్‌ను మంత్రి కలిశారు. వియత్నాంలోని అతి పెద్ద వస్త్ర తయారీ పరిశ్రమ 'గార్కో 10'ను సందర్శించారు. టెక్స్ టైల్ కంపెనీ, 'గార్కో 10' సహకారంతో వృత్తివిద్య కళాశాలల ఏర్పాటు, పెట్టుబడుల అవకాశాలపైనా చర్చించారు. వీటితో పాటు హానోయ్ టెక్స్ టైల్ అండ్ గార్మెంట్స్ యూనివర్శిటీని విజిట్‌ చేశారు.
టెక్స్ టైల్ రంగంలోని సాంకేతికత, ఫ్యాషన్ శిక్షణలో సహకారానికి గల అవకాశాలపై అధ్యయనం చేశారు. ఇందులో  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. హనోయిలోని ఇండియా హౌస్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించడంతో పాటు భారత రాయబారి సందీప్ ఆర్యాను కలిశారు.

చదవండి   నెల్లూరు ఆసుపత్రిలో మరణాలపై క్లారిటీ.. ఆక్సిజన్‌ కొరతపై దుష్ప్రచారాన్ని ఖండించిన వైద్యులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement