వాలంటీర్‌ ఆత్మహత్య! అసలేం జరిగింది?? | - | Sakshi
Sakshi News home page

వాలంటీర్‌ ఆత్మహత్య! అసలేం జరిగింది??

Sep 22 2023 12:24 AM | Updated on Sep 22 2023 1:20 PM

- - Sakshi

అనంతపురం: స్థానిక 22వ వార్డు వలంటీర్‌ రంగనాయకులు అలియాస్‌ బళ్లారి (31) గురువారం సాయంత్రం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఓల్డ్‌ సీపీఐ కాలనీలో నివాసముంటున్న ఆయనకు ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు మృతి చెందారు. అందరితో స్నేహపూర్వకంగా ఉండేవారు. బుధవారం రాత్రి జరిగిన వినాయక నిమజ్జనం సందర్భంగా అందరితో కలసి సరదాగా డ్యాన్స్‌లూ చేశారు. గురువారం సాయంత్రం తాను ఒంటరిగా నివాసముంటున్న ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ముఖ్య గమని​క: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

Advertisement
 
Advertisement
Advertisement