No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, Apr 19 2024 2:05 AM

- - Sakshi

పాయకరావుపేట : మండలంలో గల సత్యవరం గ్రామానికి చెందిన టీడీపీ జనసేన పార్టీల కార్యకర్తలు 10 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. సత్యవరం గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి కంబాల జోగులు సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు. గ్రామ సర్పంచ్‌ సకిలేటి రాము ఆధ్వర్యంలో వీరందరికీ అభ్యర్థి కంబాల జోగులు పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. గ్రామానికి చెందిన కాకాడ పవన్‌ కుమార్‌, కాకాడ నరేష్‌, కండేల నాగబాబు, తుమ్మలపల్లి గోవిందు, కాకాడ వెంకటకృష్ణ, పడిది పండు, కండేల శ్రీను, అనంతరపు చిన్నబ్బాయి, తుమ్మలపల్లి రాము, తుమ్మలపల్లి అచ్చారావు లకు ఎమ్మెల్యే అభ్యర్ధి కంబాల జోగులు సాదరంగా పార్టీ కండువాలు వేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై తామందరం పార్టీలోకి చేరినట్లు తెలిపారు.

జనసేన నుంచి వైఎస్సార్‌సీపీలోకి

అనకాపల్లి : తగరంపూడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీలోకి గురువారం రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో చేరారు. వీరికి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్‌కుమార్‌, ఎంపీ బీవీ సత్యవతి 15 మంది జనసేన నేతలకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తగరంపూడి జనసేన నేత యాదగిరి విజయ్‌ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసేవాడినని కూటమి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవడంతో జనసేన పార్టీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి చేరడం జరిగిందన్నారు. తగరంపూడి నుంచి మరో 25 మంది జనసేన వారు మూడు నాలుగు రోజుల్లో పార్టీలోకి చేరుతారని తెలిపారు. వైస్‌ ఎంపీపీ అయిత రాము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పెడిశెట్టి గోవింద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement