108లో ప్రసవం | Sakshi
Sakshi News home page

108లో ప్రసవం

Published Sat, Apr 20 2024 2:05 AM

108 వాహనంలో డెలివరీ చేసిన సిబ్బంది - Sakshi

ఎటపాక: మండల పరిధిలోని గుండాల గ్రామ సమీపంలో 108 వాహనంలో ఓ మహిళ ప్రసవించింది.ఎం.జలంతి అనే మహిళ రెండవ కాన్పుకు చింతూరు ఆస్పత్రికి వచ్చింది. అయితే అక్కడి వైద్యులు ఆమెను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్‌ చేయడంతో 108 వాహనంలో ఆమెను అక్కడికి తరలించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున మార్గ మధ్యలో ఆమెకు పురిటినొప్పులు అధికమవడంతో వాహనాన్ని గుండాల సమీపంలో నిలిపి ఆశ కార్యకర్త సాయంతో జలంతికి ప్రసవ సేవలు చేశారు. మగ బిడ్డను జన్మనిచ్చింది. పైలల్‌ రవితేజ, ఈఎంటీ లక్ష్మణ్‌ సేవలందించారు. అనంతరం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు.తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నట్టు వారు చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement