పర్యాటకులకు ‘రక్షణ’ కరువు | Sakshi
Sakshi News home page

పర్యాటకులకు ‘రక్షణ’ కరువు

Published Mon, Dec 11 2023 1:12 AM

రెయిలింగ్‌ లేని ప్రాంతంలోసెల్ఫీలు దిగుతున్న పర్యాటకులు - Sakshi

రంపచోడవరం : మారేడుమిల్లి సమీపంలోని ఘాట్‌రోడ్‌లో ఏర్పాటుచేసిన వ్యూ పాయంట్‌ ప్రమాదకరంగా మారింది. దిగువ ప్రాంతంలోని ఘాట్‌రోడ్‌లో అందాలు తిలకించేందుకు ఎత్తయిన ప్రాంతంలో ఈ వ్యూ పాయింట్‌ను ఏర్పాటుచేశారు. ఐరన్‌తో ఉన్న ఈ వ్యూ పాయింట్‌కు పర్యాటకుల భద్రత నిమిత్తం స్టీలుతో రెయిలింగ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో రెయిలింగ్‌ను దొంగలు తస్కరించగా ఇటీవల మరోమారు రెయిలింగ్‌ను బిగించారు. దానిని కూడా దొంగలు చోరీ చేయడంతో వ్యూ పాయింట్‌ వద్ద పర్యాటకులకు భద్రత లేకుండా పోయింది. పర్యాటకులు అత్యుత్సాహంతో ఐరన్‌ ప్లాట్‌ఫాం చివరివరకు వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు లోయలోకి పడిపోయే అవకాశముందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వ్యూ పాయింట్‌ వద్ద రెయిలింగ్‌ను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement