-
T20 WC: రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ క్రికెటర్
నెదర్లాండ్స్ క్రికెటర్ సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ ఆటకు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది.టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశలో శ్రీలంక చేతిలో నెదర్లాండ్స్ ఓటమి తర్వాత సిబ్రాండ్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా సౌతాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో 1988లొ జన్మించిన సిబ్రాండ్.. అక్కడే క్రికెటర్‌గా మారాడు.విరాట్ కోహ్లి క్యాచ్ అందుకునిఅండర్-19 ప్రపంచకప్-2008లో సౌతాఫ్రికా తరఫున బరిలోకి దిగిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్.. నాడు యువ భారత్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను అద్భుత రీతిలో అందుకున్నాడు.జాంటీ రోడ్స్ మాదిరి క్యాచ్ పట్టాడంటూ అప్పట్లో సిబ్రాండ్పై ప్రశంసలు కురిశాయి. ఇక తర్వాత సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్లో కేప్ కోబ్రాస్(2008/09, 2015/16), వెస్టర్న్ ప్రావిన్స్(2009/10 to 2016/17) జట్లకు మూడు ఫార్మాట్లలో ప్రాతినిథ్యం వహించాడు.చాంపియన్స్-2014 లీగ్‌లో భాగంగా కోబ్రాస్ తరఫున.. జేపీ డుమిన్ స్థానంలో బరిలోకి దిగి.. సూపర్ ఓవర్లో 11 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అయితే, ఆ తర్వాత ఉన్నత విద్యనభ్యసించడంపై దృష్టి పెట్టిన సిబ్రాండ్ క్రికెట్‌కు విరామం ఇచ్చాడు.ఉద్యోగం కోసం అక్కడికిఎంబీఏ చేసేందుకు ఆటను పక్కనపెట్టి.. చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలో ఉద్యోగ విధుల నిమిత్తం 2021లో నెదర్లాండ్స్‌కు మకాం మార్చాడు. అక్కడ క్లబ్ క్రికెట్ ఆడిన సిబ్రాండ్.. డచ్ టాప్క్లాసెస్ చాంపియన్‌షిప్-2023లో వూబర్గ్ సీసీ కెప్టెన్‌గా వ్యవహరించాడు.ఈ నేపథ్యంలో 2023లో వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్ సందర్భంగా.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2024లో టీ20లలోనూ ఎంట్రీ ఇచ్చిన సిబ్రాండ్.. ప్రపంచకప్-2024 జట్టులోనూ భాగమయ్యాడు.ఇక ఇప్పటి వరకు మొత్తంగా డచ్ జట్టు తరఫున 12 వన్డేలు, 12లు ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఆయా ఫార్మాట్లలో 385, 280 పరుగులు చేశాడు. ఇక రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ అయిన 35 ఏళ్ల సిబ్రాండ్ టీ20లలో 5 వికెట్లు కూడా పడగొట్టాడు.టీ20 వరల్డ్‌కప్-2024 - గ్రూప్-డి శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్👉వేదిక: సెయింట్ లూసియా, వెస్టిండీస్👉టాస్: నెదర్లాండ్స్.. తొలుత బౌలింగ్👉శ్రీలంక స్కోరు: 201/6 (20)👉నెదర్లాండ్స్ స్కోరు: 118 (16.4)👉ఫలితం: 83 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసిన శ్రీలంక👉ఈ మ్యాచ్‌లో సిబ్రాండ్ చేసిన పరుగులు: 11.చదవండి: అతడికి టీ20 జట్టులో ఉండే అర్హతే లేదు: సెహ్వాగ్ -
టీ20 వరల్డ్‌కప్‌లో నేడు (జూన్ 17) మరో ఆసక్తికర సమరం
పొట్టి ప్రపంచకప్ 2024లో ఇవాళ (జూన్ 17) మరో ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. సూపర్-8 బెర్త్‌లు ఖరారు కావడంతో నామమాత్రంగా సాగనున్న ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఢీకొట్టనున్నాయి. గ్రూప్-సిలో భాగంగా జరుగనున్న ఈ మ్యాచ్ సెయింట్ లూసియా వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 6 గంటలకు మొదలుకానుంది. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ జట్లు ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.గ్రూప్-సిలో భాగంగా ఇవాళే మరో మ్యాచ్ కూడా జరుగనుంది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా.. న్యూజిలాండ్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. న్యూజిలాండ్, పపువా న్యూ గినియా సూపర్-8కు అర్హత సాధించకపోవడంతో ఈ మ్యాచ్ కూడా నామమాత్రంగా సాగనుంది.కాగా, ఇవాల్టి మ్యాచ్‌లతో సంబంధం లేకుండానే సూపర్-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. సూపర్-8 గ్రూప్-1లో గ్రూప్-ఏ నుంచి భారత్ (A1).. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా (B1).. గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్ (C1).. గ్రూప్-డి నుంచి బంగ్లాదేశ్ (D2) జట్లు ఉన్నాయి.సూపర్-8లో గ్రూప్-1 మ్యాచ్‌లు..జూన్ 20- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇండియా (బార్బడోస్)జూన్ 20- ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ (ఆంటిగ్వా)జూన్ 22- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (సెయింట్ విన్సెంట్)జూన్ 24- ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా (సెయింట్ లూసియా)జూన్ 24- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ (సెయింట్ విన్సెంట్)సూపర్-8 గ్రూప్ 2లో గ్రూప్-ఏ నుంచి యూఎస్ఏ (A2).. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్ (B2).. గ్రూప్-సి నుంచి వెస్టిండీస్ (C2).. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా (D1) జట్లు ఉన్నాయి. సూపర్-8లో గ్రూప్-2 మ్యాచ్‌లు..జూన్ 19- యూఎస్ఏ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)జూన్ 19- ఇంగ్లండ్ వర్సెస్ వెస్టిండీస్ (సెయింట్ లూసియా)జూన్ 21- ఇంగ్లండ్ వర్సెస్ సౌతాఫ్రికా (సెయింట్ లూసియా)జూన్ 21- యూఎస్ఏ వర్సెస్ వెస్టిండీస్ (బార్బడోస్)జూన్ 23- యూఎస్ఏ వర్సెస్ ఇంగ్లండ్ (బార్బడోస్)జూన్ 23- వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా (ఆంటిగ్వా)గ్రూప్-1, గ్రూప్-2ల్లో అన్ని మ్యాచ్‌లు ముగిశాక మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. -
T20 World Cup 2024: న్యూజిలాండ్ స్టార్ పేసర్‌కు మందలింపు
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఐసీసీ నియమావళిని ఉల్లఘించినందుకు గానూ న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ మందలింపుకు గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో సౌథీ ఔటయ్యాక డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్తూ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సర్‌ను పగులగొట్టాడు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనల ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో గ్రౌండ్ పరికరాలను ధ్వంసం చేస్తే ఆర్టికల్ 2.2 ఉల్లంఘన కింద ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటారు. ఐసిసి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను సౌథీ స్వల్ప మందలింపుకు గురి కావడంతో పాటు ఓ డీమెరిట్ పాయింట్ పొందాడు. గడిచిన 24 నెలల్లో సౌథీకి ఇది మొదటి ఉల్లంఘణ కావడంతో ఐసీసీ మందలింపుతో వదిలి పెట్టింది. సౌథీ తన తప్పిదాన్ని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ముందు అంగీకరించాడు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో న్యూజిలాండ్ ప్రస్తానం ముగిసింది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడటంతో న్యూజిలాండ్ అధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగింది. న్యూజిలాండ్ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా..ఛేదనలో చేతులెత్తేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. -
T20 WC: గిల్‌తో పాటు అతడు ఇంటికి! వాళ్లిద్దరు అక్కడే..
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా అదరగొడుతోంది. లీగ్ దశలో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సూపర్-8కు చేరుకున్న రోహిత్ సేన.. తదుపరి కెనడాతో తలపడనుంది.ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్డేల్లో ఇరు జట్ల మధ్య జూన్ 15న మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ తెరమీదకు వచ్చింది.వరల్డ్‌కప్-2024 జట్టులో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్, యువ పేసర్ ఆవేశ్ ఖాన్ స్వదేశానికి తిరిగి రానున్నట్లు సమాచారం. అయితే, వీరితో పాటు ఇదే కేటగిరిలో ఉన్న రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మాత్రం ప్రధాన జట్టుతో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం వీరు నలుగురు టీమిండియాతో కలిసి చార్టెడ్ ఫ్లైట్‌లో ఫ్లోరిడాకు చేరుకున్నట్లు సమాచారం. అక్కడ కెనడాతో మ్యాచ్ ముగిసిన తర్వాత గిల్, ఆవేశ్ ఖాన్ భారత్‌కు తిరిగి పయనం కానున్నట్లు తెలుస్తోంది. కారణం ఏమిటి?ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ అందుబాటులో ఉన్నాడు. సంజూ శాంసన్ రూపంలో మరో ఆప్షన్ కూడా ఉంది.ఈ నేపథ్యంలో గ్రూప్ దశ ముగిసిన తర్వాత ఇక శుబ్‌మన్ గిల్‌తో అవసరం ఉండదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. గ్రూప్ దశలోని నాలుగు మ్యాచ్‌లు అమెరికాలో పూర్తి చేసుకున్న తర్వాత టీమిండియా.. మిగతా మ్యాచ్‌ల కోసం వెస్టిండీస్‌కు వెళ్లనుంది.అవసరం లేదుఇక విండీస్ పిచ్‌లు స్లోగా.. స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదనపు పేసర్‌తో అవసరం లేదు.ఇప్పటికే పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాతో పాటు అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్‌తో పాటు ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దూబే అందుబాటులో ఉన్నారు. కాబట్టి ఎక్స్ట్రాగా ఆవేశ్ ఖాన్‌ను ఇంటికి పంపించాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే, హిట్టర్ రింకూ సింగ్‌తో పాటు బ్యాకప్ పేసర్‌గా ఖలీల్ అహ్మద్‌ను మాత్రం కొనసాగించనుందని సమాచారం. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియా ఇప్పటి వరకు ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికా జట్లపై విజయాలు సాధించింది. గ్రూప్- ఏ టాపర్‌గా సూపర్-8కు అర్హత సాధించింది.చదవండి: T20 World Cup 2024: వరల్డ్‌కప్ టోర్నీ నుంచి అవుట్.. శ్రీలంకకు ఏమైంది? -
T20 World Cup 2024: పూర్వ వైభవం దిశగా వెస్టిండీస్
ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ వరుస విజయలతో దూసుకుపోతుంది. ఈ ఎడిషన్‌లో కరీబియన్ టీమ్ పపువా న్యూ గినియా, ఉగాండ, తాజాగా న్యూజిలాండ్‌పై ఘన విజయాలు సాధించి గ్రూప్-సి నుంచి సూపర్-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది.ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన విండీస్.. హ్యాట్రిక్ విజయాలు సాధించి టైటిల్ ఫేవరెట్లలో ముందు వరుసలో నిలిచింది. ఈ టోర్నీకి ముందు విండీస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. జట్టులో అందరూ విధ్వంసకర వీరులే అయినప్పటికీ, ఆ జట్టు 2023 వన్డే వరల్డ్‌కప్‌కు, 2022 టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది.ప్రస్తుత ప్రపంచకప్‌లో విండీస్ మెరుపు ప్రదర్శనల వెనక ఆ జట్టు కోచ్ డారెన్ సామీ కీలకపాత్ర పోషిస్తున్నాడు. రెండు సార్లు (2012, 2016) విండీస్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన సామీ.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో కోచ్‌గా తన మార్కును చూపిస్తున్నాడు. సామీ ఆధ్వర్యంలో విండీస్ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుంది. స్వదేశంలో ఆడుతుండటం విండీస్‌కు అదనంగా కలిసొస్తుంది.ఇదిలా ఉంటే, సూపర్-8కు ఇదివరకే అర్హత సాధించిన వెస్టిండీస్ గ్రూప్ దశలో తమ తదుపరి మ్యాచ్‌ను జూన్ 19న ఆడనుంది. సెయింట్ లూసియా వేదికగా జరిగే ఆ మ్యాచ్‌లో కరీబియన్ టీమ్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. సూపర్-8 రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్.. సౌతాఫ్రికాను ఢీకొంటుంది. -
నికోలస్ పూరన్ అరుదైన ఘనత.. గేల్ రికార్డు బ్రేక్
వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా పూరన్ రికార్డులకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులు చేసిన పూరన్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించుకున్నాడు. పూరన్ ఇప్పటివరకు విండీస్ తరపున 91 టీ20లు ఆడి 1914 పరుగులు చేశాడు. పూరన్ కెరీర్లో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. విండీస్ తరపున 79 మ్యాచ్‌లు ఆడిన గేల్ 1899 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గేల్ అల్‌టైమ్ రికార్డును పూరన్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌పై 13 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది.దీంతో సూపర్-8కు కరేబియన్ జట్టు అర్హత సాధించింది. అదే విధంగా విండీస్ చేతిలో ఓటమి చవిచూసిన కివీస్.. తమ సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. -
వెస్టిండీస్‌పై ఓటమి.. టీ20 వరల్డ్‌కప్ నుంచి న్యూజిలాండ్ ఔట్!
టీ20 వరల్డ్‌కప్-2024లో న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ట్రినిడాడ్ వేదికగా ఆతిథ్య వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో రూథర్‌ఫర్డ్(68) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా కరేబియన్ బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లతో సత్తాచాటగా.. సౌథీ, ఫెర్గూసన్ తలా రెండు వికెట్లు, నీషమ్, శాంట్నర్ చెరో వికెట్ సాధించారు.నిప్పులు చేరిగిన జోషఫ్..అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితమైంది. విండీస్ పేసర్ అల్జారీ జోషఫ్ 4 వికెట్లతో కివీస్‌ను దెబ్బతీశాడు. జోషఫ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు సాధించాడు. అతడితో పాటు స్పిన్నర్ మోటీ 3 వికెట్లతో చెలరేగాడు. ఇక బ్లాక్‌క్యాప్స్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.సూపర్-8కు విండీస్.. ఇంటికి కివీస్ఇక ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూపు-సి నుంచి సూపర్-8కు అర్హత సాధించగా.. ఓటమిపాలైన కివీస్ తమ సూపర్-8 అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. మరో విధంగా చెప్పాలంటే ఈ టోర్నీ నుంచి న్యూజిలాండ్ దాదాపుగా ఇంటిముఖం పట్టినట్లే. రెండు ఓటములతో కివీస్ పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో కొనసాగుతోంది.ఇప్పటికే గ్రూపు-సి నుంచి విండీస్ సూపర్-8కు క్వాలిఫై కాగా.. మరో బెర్త్ కోసం అఫ్గానిస్తాన్ అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయం సాధించిన అఫ్గానిస్తాన్.. గ్రూప్-సి పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో ఉంది. అఫ్గాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించినా చాలు నేరుగా సూపర్-8కు అఫ్గానిస్తాన్ నేరుగా క్వాలిఫై అవుతోంది.చదవండి: Rohit Sharma: ఇక్కడ గెలవడం అంత తేలికేమీ కాదు.. క్రెడిట్ వాళ్లకే -
రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ?
అమెరికాలోని ప్రఖ్యాత నగరంలోని స్టేడియం... నిర్మాణానికి దాదాపుగా 250 కోట్ల రూపాయల ఖర్చు... 34,000 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించేలా సీటింగ్ సామర్థ్యం..పరుగుల వరద పారుతుందని భావిస్తే టీ20 ఫార్మాట్‌కు భిన్నంగా లో స్కోరింగ్ మ్యాచ్‌లు.. బౌండరీల సంగతి దేవుడెరుగు సింగిల్స్ తీయాలన్నా కష్టంగా తోచే పిచ్. 👉తొలి మ్యాచ్‌లో శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా.. నమోదైన స్కోర్లు.. 77 (19.1), 80/4 (16.2). ఆరు వికెట్ల తేడాతో లంకపై సౌతాఫ్రికా విజయం.👉రెండో మ్యాచ్‌లో ఇండియా వర్సెస్ ఐర్లాండ్.. స్కోర్లు 96 (16), 97/2 (12.2).. ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.👉ముచ్చటగా మూడో మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడ్డ కెనడా.. స్కోర్లు 137/7 (20)- 125/7 (20). 12 పరుగుల తేడాతో కెనడా గెలుపు.👉ఇక నాలుగో మ్యాచ్ నెదర్లాండ్స్- సౌతాఫ్రికా మధ్య. ఇది కూడా లో స్కోరింగ్ మ్యాచే! నెదర్లాండ్స్ 103 రన్స్ చేస్తే.. సౌతాఫ్రికా 106 పరుగులు సాధించి.. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.👉ఐదో మ్యాచ్.. వరల్డ్‌కప్‌కే హైలైట్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. ఇండియా 119 పరుగులకు ఆలౌట్ అయితే.. పాక్ 113 పరుగుల వద్దే నిలిచి.. ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.👉ఆ తర్వాత సౌతాఫ్రికా(113/6)తో బంగ్లాదేశ్(109/7) తలపడగా.. ప్రొటిస్ జట్టు బంగ్లాపై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది.👉ఏడో మ్యాచ్‌లో కెనడా- పాకిస్తాన్ పోటీపడగా.. 106 పరుగులకే పరిమితమైన కెనడా.. 107 పరుగులు(17.3 ఓవర్లలో) చేసిన పాక్ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది.ఇదే ఆఖరు.. కూల్చేయడమే తరువాయిఇక ఆఖరిసారిగా ఇక్కడ ఆతిథ్య అమెరికా జట్టు టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. గ్రూప్-ఏ లో ఉన్న ఈ జట్ల మధ్య జరిగే మ్యాచే ఇక్కడ జరిగే చివరి మ్యాచ్. ఆ తర్వాత దీనిని కూల్చేస్తారు.అవును.. మీరు విన్నది నిజమే. ఇదంతా న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం గురించే! టీ20 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.20 జట్లు.. తొమ్మిది వేదికలువెస్టిండీస్తో కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న యూఎస్ఏలో మూడు వేదికల్లో మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.న్యూయార్క్- నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఫ్లోరిడా- లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ కౌంటీ స్టేడియం, డల్లాస్-టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రయరీ క్రికెట్ స్టేడియాలలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.అయితే, వీటిలో నసావూ కౌంటీ స్టేడియాన్ని ఈ ఈవెంట్ కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి తాత్కాలికంగా నిర్మించింది. జూన్ 3- 12 వరకు ఎనిమిది మ్యాచ్‌లు పూర్తైన తర్వాత దీనిని డిస్మాంటిల్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.పెదవి విరిచిన ప్రేక్షకులుఅయితే, డ్రాప్- ఇన్ పిచ్ ఉన్న ఈ స్టేడియం కోసం ఐసీసీ సుమారుగా రూ. 250 కోట్లు ఖర్చు చేసినా.. సదుపాయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ బిగ్ ఆపిల్ సిటీలోని నసావూ కౌంటీ స్టేడియం సంగతి!!టీ20 ప్రపంచకప్-2024లో మొత్తం 20 జట్లు భాగం కాగా.. అమెరికాలో మూడు, వెస్టిండీస్(గయానా, బార్బడోస్, ఆంటిగ్వా, ట్రినిడాడ్, సెయింట్ విన్సెంట్, సెయింట్ లూసియా)లోని ఆరు నగరాలు ఇందుకు ఆతిథ్యం ఇస్తున్నాయి. చదవండి: WC: పక్కా టీ20 టైప్.. న్యూయార్క్ పిచ్ వెనుక ఇంత కథ ఉందా? -
T20 WC 2024: నేపాల్ జట్టుకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్-2024లో నేపాల్ జట్టు ఆడే చివరి రెండు మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానే అందుబాటులోకి రానున్నాడు. గతంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని ఎనిమిదేళ్ల జైలు శిక్షకు గురై... ఆ తర్వాత ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు నుంచి విముక్తి పొందిన లమిచానేకు అమెరికా ప్రభుత్వం వీసా నిరాకరించింది.దాంతో అతను అమెరికా వేదికగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. నేపాల్ తమ చివరి రెండు మ్యాచ్‌లను వెస్టిండీస్ వేదికగా ఆడనుంది. ఈనెల 15న దక్షిణాఫ్రికాతో, 17న బంగ్లాదేశ్‌తో కింగ్స్టౌన్లో తలపడనుంది. ఈ నేపథ్యంలో సందీప్ లమిచానే ఇప్పటికే వెస్టిండీస్‌కు చేరుకున్నాడు.కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సందీప్ లమిచానే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. టీ20 ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన ఈ లెగ్ స్పిన్ బౌలర్.. నేపాల్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా 52 టీ20లు ఆడి 98 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 51 వన్డేలు ఆడి 112 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూప్-డిలో ఉన్న నేపాల్ నెదర్లాండ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడింది. ఇందులో ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తదుపరి జూన్ 12న శ్రీలంకతో ఫ్లోరిడా వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కూడా సందీప్ దూరంగా ఉండనున్నాడు.టీ20 ప్రపంచకప్-2024 కోసం నేపాల్ ప్రకటించిన జట్టురోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.సందీప్ లమిచానే -
WI Vs UGA: దటీజ్ పావెల్.. టీ20 వరల్డ్‌కప్‌లో భారీ సిక్సర్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భారీ సిక్స్ నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉగండాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ భారీ సిక్స్ కొట్టాడు. అతడు కొట్టిన షాట్‌కు బంతి 107 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయటపడింది.ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన ఫ్రాంక్ న్సుబుగా.. తొలి బంతిని ఆఫ్-స్పిన్నింగ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో ఫ్రంట్ ఫుట్కు వచ్చిన పావెల్.. లాంగ్-ఆన్ దిశగా భారీ సిక్స్ బాదాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ పేరిట ఉండేది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ 105 మీట్లర్ల సిక్స్ బాదాడు. తాజా మ్యాచ్‌తో సాల్ట్‌ను పావెల్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. 74 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా.. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
WI Vs UGA: 39 పరుగులకే ఆలౌట్.. టీ20 వరల్డ్‌కప్‌లో చెత్త రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2024లో పసికూన ఉగండా ఘోర పరాభవం మూట కట్టుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో ఉగండా ఓటమి పాలైంది.174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా విండీస్ బౌలర్ల దాటికి విల్లవిల్లాడింది. కేవలం 39 పరుగులకే ఉగండా కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా, మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.చెత్త రికార్డు..ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును ఉగండా తమ పేరిట లిఖించుకుంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన నెదర్లాండ్స్ చెత్త రికార్డును ఉగండా సమం చేసింది. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో శ్రీలంకపై నెదర్లాండ్స్ కూడా 39 పరుగులకే ఆలౌటైంది. ఇక జాబితాలో తర్వాతి స్ధానాల్లో నెదర్లాండ్స్(44), వెస్టిండీస్(55), ఉగండా(58) ఉన్నాయి.వెస్టిండీస్ అరుదైన రికార్డు..టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పరుగుల పరంగా భారీ తేడాతో గెలిచిన రెండో జట్టుగా విండీస్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో కరేబియన్ జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో అగ్రస్ధానంలో శ్రీలంక ఉంది. జోహాన్స్‌బర్గ్ వేదికగా జరిగిన 2007 వరల్డ్‌కప్‌లో కెన్యాపై శ్రీలంక ఏకంగా 172 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది -
WI Vs UGA: 5 వికెట్లతో చెలరేగిన అకిల్.. పసికూనపై విండీస్ ఘన విజయం
టీ20 వరల్డ్‌కప్-2024లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరిగిన మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది.174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా.. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు. ఉగండా బౌలర్లలో కెప్టెన్ మసాబా రెండు వికెట్లు పడగొట్టగా.. నక్రాని, కెవాటియా, రామ్‌జనీ తలా వికెట్ సాధించారు. -
WI Vs UGA: చెలరేగిన విండీస్ బ్యాటర్లు.. పసికూన ముందు భారీ టార్గెట్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు చెలరేగారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు. ఓ దశలో విండీస్ ఈజీగా 200 పరుగుల మార్క్ దాటుతుందని అంతా భావించారు. కానీ ఉగండా బౌలర్లు ఆఖరి 6 ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 200 పరుగుల మార్క్‌ను కరేబియన్లు దాటలేకపోయారు. ఉగండా బౌలర్లలో కెప్టెన్ మసాబా రెండు వికెట్లు పడగొట్టగా.. నక్రాని, కెవాటియా, రామ్‌జనీ తలా వికెట్ సాధించారు. -
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. జట్టును ప్రకటించిన వెస్టిండీస్
టీ20 వరల్డ్‌కప్-2024 ముగిసిన అనంతరం వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా విండీస్ ఆతిథ్య ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడనుంది. జులై 10న లార్డ్స్ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును విండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు క్రైగ్ బ్రాత్‌వైట్ సారథ్యం వహించనున్నాడు.అదేవిధంగా టీ20 వరల్డ్‌కప్-2024కు గాయం కారణంగా దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్.. ఇంగ్లండ్ సిరీస్‌కు మాత్రం అందుబాటులోకి వచ్చాడు. మరోవైపు దేశీవాళీ క్రికెట్లో అదరగొడుతున్న మైకిల్ లూయిస్ తొలిసారి విండీస్ సెలక్టర్లు పిలుపునిచ్చారు.వెస్టిండీస్ టెస్టు జట్టు: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా, జాసన్ హోల్డర్, కావెం హాడ్జ్, టెవిన్ ఇమ్లాచ్, అల్జారీ జోసెఫ్ (వైస్-కెప్టెన్), షమర్ జోసెఫ్, మికిల్ లూయిస్, జాచరీ మెక్‌కాస్కీ, మెక్‌కాస్కీ గుడాకేష్ మోటీ, కెమర్ రోచ్, జేడెన్ సీల్స్, కెవిన్ సింక్లైర్ -
వామ్మో.. ఇదేమి సిక్స్‌రా బాబు! దెబ్బకు స్టేడియం బయటకు బంతి
టీ20 వరల్డ్‌కప్-2024లో ఆతిథ్య వెస్టిండీస్ శుభారంభం చేసింది. ఆదివారం గయనా వేదికగా పాపువా న్యూ గినియా (PNG)తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం విండీస్ విజయం సాధించింది. అయితే పీఎన్జీ విధించిన 137 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించిడానికి వెస్టిండీస్ తీవ్రంగా శ్రమించింది. 137 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. అలై నౌ బౌలింగ్ లో జాన్సన్ చార్లెస్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత పూరన్, కింగ్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. అయితే వరుసక్రమంలో వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రోస్టన్ చేజ్ చివరివరకు క్రీజులో ఉండి అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కరేబియన్ జట్టును గెలిపించాడు. రోస్టన్ ఛేజ్ (42 నాటౌట్, 27 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ 27 పరుగులు, రోమ్ మన్ పావెల్ 15, ఆండ్రీ రస్సెల్ 15 పరుగులతో రాణించారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.పూరన్ భారీ సిక్సర్.. ఇక ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్ బాదాడు. విండీస్ ఇన్నింగ్స్ 6 ఓవర్ వేసిన పీఎన్జీ స్పిన్నర్ బౌ.. తొలి బంతిని ఓవర్‌పిచ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో పూరన్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి భారీ సిక్సర్ కొట్టాడు. పూరన్ పవర్‌కు బంతి స్టేడియం బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చదవండి: మేజర్ లీగ్ క్రికెట్లో ఆడనున్న సన్‌రైజర్స్ కెప్టెన్.. The man-in-form! 💥After patiently biding his time, #NicholasPooran unleashes with a MAXIMUM and a boundary! 💪🏻📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/A4rWKKcCk7— Star Sports (@StarSportsIndia) June 2, 2024 -
వెస్టిండీస్‌ను భయపెట్టిన పసికూన.. చెమటోడ్చి నెగ్గిన కరేబియన్లు
గయానా: టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్న రెండో దేశం వెస్టిండీస్ కూడా టోర్నిలో శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో రెండుసార్లు చాంపియన్ విండీస్ ఓటమి అంచుల్లోంచి బయటపడి 5 వికెట్ల తేడాతో పపువా న్యూగినీ జట్టుపై గెలిచి ఊపిరి పీల్చుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పపువా న్యూగినీ నిరీ్ణత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లు టోని వుర (2), అసద్ వాలా (21), లెగా సియాక (1) నిరాశ పరచడంతో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సెసె బావు (43 బంతుల్లో 50; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. చార్లెస్ అమిని (12)తో ఐదో వికెట్‌కు 44 పరుగులు జోడించాడు. జట్టు స్కోరు 98 వద్ద ఆరో వికెట్‌గా సెసె బావు నిష్క్రమించగా, కిప్లిన్ డొరిగా (18 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడటంతో పపువా ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. విండీస్ బౌలర్లలో రసెల్, జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం వెస్టిండీస్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోస్టన్ చేజ్ (27 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) విండీస్‌ను ఒడ్డున పడేసే ఆట ఆడాడు.సులువైన ప్రత్యర్థే అయినా... ఏమంత కష్టం కానీ లక్ష్యమే ఎదురైనా... వెస్టిండీస్ గెలిచేందుకు ఆపసోపాలు పడింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్, పూరన్ ఉన్నంత వరకు 8 ఓవర్లలో విండీస్ 61/1 స్కోరు చేసింది. గెలిచేందుకు 72 బంతుల్లో 76 పరుగులు చేస్తే సరిపోతుంది. కానీ తర్వాతి వరుస ఓవర్లలో పూరన్ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కింగ్ (29 బంతుల్లో 34; 7 ఫోర్లు) అవుటయ్యాక పరిస్థితి మారింది. కెప్టెన్ రొవ్మన్ పావెల్ (15), రూథర్‌ఫోర్డ్ (2) వికెట్లు పారేసుకోవడంతో సమీకరణం 24 బంతుల్లో 40 పరుగుల వద్ద కష్టంగా కనిపించింది. ఈ దశలో రసెల్ (9 బంతుల్లో 15 నాటౌట్; 1 సిక్స్) వచ్చాక చేజ్ ధాటిగా ఆడాడు. 18వ ఓవర్లో 2 బౌండరీలు, ఓ సిక్స్ బాది 18 పరుగులు పిండుకున్నాడు. మరుసటి ఓవర్లోనూ చేజ్ 2 ఫోర్లు కొట్టడంతో 19వ ఓవర్ ఆఖరి బంతికి లక్ష్యాన్ని చేరుకుంది. -
సూపర్ క్యాచ్.. జడేజాను గుర్తు చేసిన విండీస్ ఆటగాడు! వీడియో
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు రోస్టన్ ఛేజ్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్బుతమైన క్యాచ్‌తో న్యూ గినియా కెప్టెన్ ఆసద్ వాలాను ఛేజ్ పెవిలియన్‌కు పంపాడు. న్యూ గినియా ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన అల్జారీ జోసెఫ్ ఔట్‌సైడ్ ఆఫ్దిశగా లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ లెంగ్త్ డెలివరీని ఆసద్ వాలా బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న ఛేజ్ డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన న్యూ గినియా కెప్టెన్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను గుర్తు చేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా జడేజా కూడా ఈ విధంగానే పాయింట్లో ఎన్నో మెరుపు క్యాచ్‌లను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు అదుకున్నారు.వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. SCREAMER! 🥵#AlzarriJoseph strikes in his very first over and gets the #PapuaNewGuinea skipper caught at point!📺 | #WIvPNG | LIVE NOW | #T20WorldCupOnStar (Only available in India) pic.twitter.com/g0EaFdHsNb— Star Sports (@StarSportsIndia) June 2, 2024 -
పీఎన్జీ బ్యాటర్ల అద్బుత పోరాటం.. విండీస్ టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా పాపువా న్యూ గినియా, వెస్టిండీస్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూ గునియా పర్వాలేదన్పించింది. పటిష్టమైన కరేబియన్ బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొన్న న్యూ గునియా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. పీఎన్జీ బ్యాటర్లలో సెసే బౌ(50) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. బౌకు ఇది తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీ కావడం గమనార్హం. ఇక అతడితో పాటు కెప్టెన్ అసద్ వాలా(21), డొరిగా(27) పరుగులతో రాణించారు. 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పీఎన్జీని వలా, బావు ఆదుకున్నారు. వీరిద్దరూ విండీస్ బౌలర్లకు అడ్డుగా నిలవడంతో పీఎన్జీ గౌరవప్రదమైన స్కోర్ సాధించగల్గింది. ఇక వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్, జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. హోస్సేన్, షెఫెర్డ్, మోటీ తలా వికెట్ సాధించారు. -
T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు.. పూర్తి వివరాలు
అంతర్జాతీయ క్రికెట్ మండలి నేతృత్వంలో 2007లో మొదలైన టీ20 ప్రపంచకప్ టోర్నీ విజయవంతంగా ఎనిమిది ఎడిషన్లు పూర్తి చేసుకుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి తొమ్మిదో ఎడిషన్ మొదలుకానుంది.ఈ మెగా ఈవెంట్ ఆరంభం నుంచి ఇప్పటి దాకా ఇద్దరంటే ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్ మాజీ సారథి షకీబ్ అల్ హసన్‌కు మాత్రమే ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.పటిష్ట భారత జట్టును మరోసారి పొట్టి ప్రపంచకప్ టోర్నీలో ముందుకు నడిపించే క్రమంలో రోహిత్ నాయకుడిగా బరిలో దిగనుండగా.. నజ్ముల్ షాంటో సారథ్యంలో షకీబ్ ఆల్‌రౌండర్‌గా వరల్డ్‌కప్‌లో భాగం కానున్నాడు.ఇదిలా ఉంటే.. ఈసారి ఏకంగా 20 జట్లు ఈ ఐసీసీ టోర్నమెంట్లో పాల్గొననున్నాయి. నాలుగు గ్రూపులుగా వీటిని విభజించారు. మరి 20 జట్లలో భాగమైన ఆటగాళ్లు ఎవరో చూద్దామా?👉గ్రూప్- ఏ: ఇండియా, పాకిస్తాన్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా👉గ్రూప్- బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్👉గ్రూప్- సి: వెస్టిండీస్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినియా👉గ్రూప్- డి: సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.ఇండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.పాకిస్తాన్బాబర్ ఆజం(కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.యునైటెడ్ స్టేట్స్మోనాక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరె అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీష్ కుమార్, నౌష్టుష్ కెంజిగే, సౌరభ్ నెత్రాల్వాకర్, షాడ్లీ వాన్ షాల్క్విక్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్. రిజర్వ్ ప్లేయర్లు: గజానంద్ సింగ్, జువానోయ్ డ్రైస్డేల్, యాసిర్ మొహమ్మద్.ఐర్లాండ్పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బాల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెకార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.కెనడాసాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), ఆరోన్ జాన్సన్, రవీందర్‌పాల్ సింగ్, నవనీత్ ధాలివాల్, కలీమ్ సనా, దిలోన్ హెయిలీగర్, జెరెమీ గోర్డాన్, నిఖిల్ దత్తా, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, రేయాన్ ఖాన్ పఠాన్, జునైద్ సిద్ధిఖీ, దిల్‌ప్రీత్ బజ్వా, శ్రేయాస్ మొవ్వా, రిషివ్ జోషి.రిజర్వ్ ప్లేయర్లు: తజిందర్ సింగ్, ఆదిత్య వరదరాజన్, అమ్మర్ ఖలీద్, జతిందర్ మథారు, పర్వీన్ కుమార్.ఇంగ్లండ్జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్-మెగర్క్, మాట్ షార్ట్.నమీబియాగెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, మైఖేల్ వాన్ లింగెన్, డైలాన్ లీచర్, రూబెన్ ట్రంపెల్మాన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, టాంగెని లుంగామెని, నికో డావిన్, జేజే స్మిత్, జాన్ ఫ్రైలింక్, జేపీ కోట్జ్, డేవిడ్ వీస్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మలన్ క్రూగర్, పీడీ బ్లిగ్నాట్.స్కాట్లాండ్రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ క్యూరీ, క్రిస్ గ్రీవ్స్, ఓలీ హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్ ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, చార్లీ టియర్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్.ఒమన్అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషాన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే, అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ, మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్, ఖలీద్ కైల్. రిజర్వు ప్లేయర్లు: జతిందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జయ్ ఓదెరా.వెస్టిండీస్రోవ్మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయిర్, షాయీ హోప్, అకీల్ హొసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెకాయ్.న్యూజిలాండ్కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రాస్‌వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్.అఫ్గనిస్తాన్రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, కరీం జనత్, నంగ్యాల్ ఖరోతి, ముజీబ్ యువర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. రిజర్వ్ ప్లేయర్లు: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ.ఉగాండాబ్రియాన్ మసాబా (కెప్టెన్), సైమన్ సెసాజీ, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యూవుటా, దినేష్ నక్రానీ, ఫ్రెడ్ అచెలం, కెన్నెత్ వైస్వా, అల్పేశ్ రాంజానీ, ఫ్రాంక్ న్సుబుగా, హెన్రీ స్సెన్యోండో, బిలాల్ హస్సున్, రాబిన్సన్ ఓబుయా, రియాజత్ అలీ షా, జుమా మియాజీ, రోనక్ పటేల్. ట్రావెలింగ్ రిజర్వ్స్: ఇన్నోసెంట్ మ్వెబాజ్, రోనాల్డ్ లుటాయా.పపువా న్యూగినియాఅస్సాడోల్లా వాలా (కెప్టెన్), అలీ నావో, చాడ్ సోపర్, సీజే అమిని, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కరికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కామియా, సెసే బావు, టోనీ ఉరా.సౌతాఫ్రికా ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చ్యూన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.శ్రీలంకవనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక, కుశాల్ మెండిస్, పథుమ్ నిస్సాంకా, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డిసిల్వా, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీరా, నువాన్ తుషార, మతీషా పతిరణ, దిల్షాన్ మదుశంక. ట్రావెలింగ్ రిజర్వ్స్: అసితా ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, భానుకా రాజపక్స, జనిత్ లియానాగే.బంగ్లాదేశ్నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), టస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహీద్ హ్రిదోయ్, మహ్మద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మహేది హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజీమ్ హసన్ సకీబ్. ట్రావెలింగ్ రిజర్వ్స్: అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.నెదర్లాండ్స్స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, కైల్ క్లెయిన్, లోగాన్ వాన్ బీక్, మ్యాక్స్ ఓ డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, ర్యాన్ క్లెయిన్, సాకిబ్ జుల్ఫికర్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజ నిడమనూరు, టిమ్ ప్రింగిల్, విక్రమ్ సింగ్, వివ్ కింగ్మా, వెస్లీ బారేసి. ట్రావెలింగ్ రిజర్వ్: ర్యాన్ క్లెయిన్నేపాల్రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సాహ్, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌బన్షి, కరణ్ కేసీ, గుల్షన్ ఝా, సోంపాల్ కామి, ప్రతిస్ జీసీ, సందీప్ జోరా, అవినాష్ బోహరా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలుT20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. వివరాలు -
వారెవ్వా జోసెఫ్.. దెబ్బకు వార్నర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
వెస్టిండీస్ యువ పేస్ సంచలనం షామర్ జోసెఫ్ టీ20 వరల్డ్‌కప్-2024కు సన్నద్దమవుతున్నాడు. ఈ క్రమంలో ట్రినిడాడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వార్మాప్ మ్యాచ్‌లో జోసెఫ్ సంచలన బంతితో మెరిశాడు. ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను జోషఫ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. జోషఫ్ వేసిన డెలివరీకి వార్నర్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. ఆసీస్ ఇన్నింగ్స్ 2వ వేసిన జోషఫ్ తొలి మూడు బంతుల్లో ఏకంగా 14 పరుగులు సమర్పించుకున్నాడు. వార్నర్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. ఈ సమయంలో జోసెఫ్ సూపర్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. నాలుగో బంతిని జోసెఫ్.. వార్నర్‌కు బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీగా సంధించాడు. అయితే వార్నర్ ఈ డెలివరీని లెగ్ సైట్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి బ్యాట్‌కు మిస్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఏడాది ఆసీస్‌తో గబ్బా వేదికగా జరిగిన టెస్టులో సంచలన ప్రదర్శన కనబరిచిన జోసెఫ్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక వార్మాప్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్‌పై 35 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్లలో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో పూరన్ 75 పరుగులు చేశాడు. జాన్సన్ ఛార్లెస్(40), రూథర్‌ఫోర్డ్(47) పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్య చేధనలో ఆసీస్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. View this post on Instagram A post shared by ICC (@icc) -
పూరన్ సిక్సర్ల సునామీ.. ఆసీస్‌కు ఝలక్ ఇచ్చిన విండీస్
టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా ఇవాళ వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు ఊహించని ఝలక్ ఇచ్చింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. పూరన్ సిక్సర్ల సునామీనికోలస్ పూరన్ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 25 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్ల సాయంతో 75 పరుగులు చేశాడు. పూరన్ సిక్సర్ల సునామీ ధాటికి ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ మైదానం తడిసి ముద్దైంది. విండీస్ ఇన్నింగ్స్‌లో పూరన్‌తో పాటు ప్రతి ఆటగాడు చెలరేగి ఆడారు. తలో చేయి వేశారు..హోప్ 8 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 14 పరుగులు.. జాన్సన్ ఛార్లెస్ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 40 పరుగులు.. రోవ్‌మన్ పావెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 పరుగులు.. హెట్‌మైర్ 13 బంతుల్లో ఫోర్, సిక్సర్ సాయంతో 18 పరుగులు.. రూథర్‌ఫోర్డ్ 18 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. విండీస్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఆసీస్ బౌలర్లందరూ 10కిపైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నారు. జంపా 2, టిమ్ డేవిడ్, ఆస్టన్ అగర్ తలో వికెట్ పడగొట్టారు.పోరాడిన ఆసీస్అనంతరం అతి భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. గెలుపు కోసం చివరి దాకా పోటీపడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లోనూ ప్రతి ఒక్కరూ చెలరేగి ఆడారు. వార్నర్ 6 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 15 పరుగులు.. ఆస్టన్ అగర్ 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28.. మార్ష్ 4 బంతుల్లో బౌండరీ సాయంతో 4 పరుగులు.. ఇంగ్లిస్ 30 బంతుల్లో 5 బౌండరీలు, 4 సిక్సర్ల సాయంతో 55 పరుగులు.. టిమ్ డేవిడ్ 12 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 25 పరుగులు.. వేడ్ 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు.. నాథన్ ఇల్లిస్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39.. జంపా 16 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 21.. హాజిల్‌వుడ్ 3 బంతుల్లో 3 పరుగులు చేశారు. మ్యాచ్ గెలిచేందుకు ఆసీస్‌కు ఈ మెరుపులు సరిపోలేదు. విండీస్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, మోటీ చెరో 2 వికెట్లు.. అకీల్ హొసేన్, షమార్ జోసఫ్, ఓబెద్ మెక్కాయ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో కూడా ఆసీస్ తొలి వార్మప్ మ్యాచ్‌లోలా తొమ్మిది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. ఆసీస్ రెగ్యులర్ జట్టు సభ్యులు అందుబాటులోకి రాకపోవడమే ఇందుకు కారణం. -
T20 WC: మొత్తం షెడ్యూల్, సమయం, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
టీ20 ప్రపంచకప్ టోర్నీకి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తోంది. వెస్టిండీస్‌తో కలిసి ఈ ఏడాది మెగా ఈవెంట్ నిర్వహణ హక్కులు దక్కించుకుంది. తద్వారా కొత్త స్టేడియాల్లో పొట్టి ఫార్మాట్లో ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం ప్రేక్షకులకు దక్కింది.మరి టీ20 వరల్డ్‌కప్-2024 పూర్తి షెడ్యూల్, సమయం, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్ తదితర విశేషాలు తెలుసుకుందామా?!గ్రూప్ దశలో...👉జూన్ 1: అమెరికా వర్సెస్ కెనడా- టెక్సాస్(భారత కాలమానం ప్రకారం జూన్ 2 ఉదయం ఆరు గంటలకు ఆరంభం)👉జూన్ 2: వెస్టిండీస్ వర్సెస్ పపువా న్యూగినియా- గయానా(రాత్రి ఎనిమిదిన్నర గంటలకు)నమీబియా వర్సెస్ ఒమన్- బార్బడోస్(జూన్ 3 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 3: శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)అఫ్గనిస్తాన్ వర్సెస్ ఉగాండా- గయానా(జూన్ 4 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 4: ఇంగ్లండ్ వర్సెస్ స్కాట్లాండ్- బార్బడోస్(రాత్రి ఎనిమిది గంటలకు)నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్- డల్లాస్- రాత్రి తొమ్మిది గంటలకు)👉జూన్ 5: ఇండియా వర్సెస్ ఐర్లాండ్- న్యూయార్క్- (రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్- బార్బడోస్- (జూన్ 6 ఉదయం ఆరు గంటలకు)పపువా న్యూగినియా వర్సెస్ ఉగాండా- గయానా- (జూన్ 6 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 6- యూఎస్ఏ వర్సెస్ పాకిస్తాన్- డల్లాస్(రాత్రి తొమ్మిది గంటలకు)నమీబియా వర్సెస్ స్కాట్లాండ్- బార్బడోస్(జూన్ 7 అర్ధరాత్రి 12. 30కి ఆరంభం)👉జూన్ 7- కెనడా వర్సెస్ ఐర్లాండ్- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్- డల్లాస్(జూన్ 8 ఉదయం ఆరు గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ అఫ్గనిస్తాన్- గయానా(జూన్ 8 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 8- నెదర్లాండ్స్ వర్సెస్ సౌతాఫ్రికా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్- బార్బడోస్- (రాత్రి 10 30 నిమిషాలకు)వెస్టిండీస్ వర్సెస్ ఉగాండా- గయానా(జూన్ 9 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 9- ఇండియా వర్సెస్ పాకిస్తాన్- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఒమన్ వర్సెస్ స్కాట్లాండ్- అంటిగ్వా(రాత్రి 10.30 నిమిషాలకు)👉జూన్ 10- సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)👉జూన్ 11- పాకిస్తాన్ వర్సెస్ కెనడా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)ఆస్ట్రేలియా వర్సెస్ నమీబియా- అంటిగ్వా(జూన్ 12 ఉదయం ఆరు గంటలకు)శ్రీలంక వర్సెస్ నేపాల్- ఫ్లోరిడా(జూన్ 12 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 12- యూఎస్ఏ వర్సెస్ ఇండియా- న్యూయార్క్(రాత్రి ఎనిమిది గంటలకు)వెస్టిండీస్ వర్సెస్ న్యూజిలాండ్- ట్రినిడాడ్(జూన్ 13 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 13- బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్- సెయింట్ విన్సెంట్(రాత్రి ఎనిమిది గంటలకు)అఫ్గనిస్తాన్ వర్సెస్ పపువా న్యూగినియా- ట్రినిడాడ్(జూన్ 14 ఉదయం ఆరు గంటలకు)ఇంగ్లండ్ వర్సెస్ ఒమన్- అంటిగ్వా(జూన్ 14 అర్ధరాత్రి 12.30 నిమిషాలకు)👉జూన్ 14- యూఎస్ఏ వర్సెస్ ఐర్లాండ్- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)న్యూజిలాండ్ వర్సెస్ ఉగాండా-ట్రినిడాడ్(జూన్ 15 ఉదయం ఆరు గంటలకు)సౌతాఫ్రికా వర్సెస్ నేపాల్(జూన్ 15 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 15- ఇండియా వర్సెస్ కెనడా- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)నమీబియా వర్సెస్ ఇంగ్లండ్- అంటిగ్వా(రాత్రి 10.30కి)ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్- సెయింట్ లూసియా(జూన్ 16 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 16- పాకిస్తాన్ వర్సెస్ ఐర్లాండ్- ఫ్లోరిడా(రాత్రి ఎనిమిది గంటలకు)శ్రీలంక వర్సెస్ నెదర్లాండ్స్- సెయింట్ లూసియా(జూన్ 17 ఉదయం ఆరు గంటలకు)బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్- సెయింట్ విన్సెంట్(జూన్ 17 ఉదయం ఐదు గంటలకు)👉జూన్ 17- న్యూజిలాండ్ వర్సెస్ పపువా న్యూగినియా- ట్రినిడాడ్ (రాత్రి ఎనిమిది గంటలకు)వెస్టిండీస్ వర్సెస్ అఫ్గనిస్తాన్- సెయింట్ లూసియా(జూన్ 18 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 19- ఏ2 వర్సెస్ డీ1 సూపర్-8 గ్రూప్-2- అంటిగ్వా(రాత్రి ఎనిమిది గంటలకు)బీ1 వర్సెస్ సీ2- సెయింట్ లూయీస్(జూన్ 20 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 20- సీ1 వర్సెస్ ఏ1- బార్బడోస్(రాత్రి ఎనిమిది గంటలకు)బీ2 వర్సెస్ డీ2- అంటిగ్వా(జూన్ 21 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 21- బీ1 వర్సెస్ డీ1- సెయింట్ లూసియా(రాత్రి ఎనిమిది గంటలకు)ఏ2 వర్సెస్ సీ2- బార్బడోస్- (జూన్ 22 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 22- ఏ1 వర్సెస్ డీ2- అంటిగ్వా(రాత్రి ఎనిమిది గంటలకు)సీ1 వర్సెస్ బీ2- సెయింట్ విన్సెంట్(జూన్ 23 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 23- ఏ2 వర్సెస్ బీ1- బార్బడోస్(రాత్రి ఎనిమిది గంటలకు)సీ2 వర్సెస్ డీ1- అంటిగ్వా(జూన్ 24 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 24- బీ2 వర్సెస్ ఏ1- సెయింట్ లూయీస్(రాత్రి ఎనిమిది గంటలకు)సీ1 వర్సెస్ డీ2- సెయింట్ విన్సెంట్(జూన్ 25 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 26- సెమీ ఫైనల్ 1- ట్రినిడాడ్(జూన్ 27 ఉదయం ఆరు గంటలకు)👉జూన్ 27- సెమీ ఫైనల్ 2- గయానా(రాత్రి ఎనిమిది గంటలకు)👉జూన్ 29- ఫైనల్- బార్బడోస్(రాత్రి ఏడున్నర గంటలకు).లైవ్ స్ట్రీమింగ్(ఇండియాలో)👉స్టార్ స్పోర్ట్స్ షోలో ప్రత్యక్ష ప్రసారం(టీవీ)👉డిస్నీ+హాట్‌స్టార్(డిజిటల్)చదవండి: T20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలు -
T20 WC: అది బలహీనత కాకూడదు: కోహ్లి కామెంట్స్ వైరల్
టీమిండియా 2013లో చివరిసారిగా ఐసీసీ ట్రోఫీ సాధించింది. అప్పటి నుంచి మళ్లీ ఇంత వరకు మెగా టైటిల్ నెగ్గనేలేదు. గతేడాది సొంతగడ్డపై భారీ అంచనాల నడుమ వన్డే వరల్డ్‌కప్ బరిలో దిగిన రోహిత్ సేన లీగ్ దశలో దుమ్ములేపింది.ఓటమన్నదే ఎరుగక సెమీ ఫైనల్ చేరి.. ఆపై ఫైనల్లోనూ అడుగుపెట్టింది. కానీ.. అసలైన పోరులో.. అహ్మదాబాద్‌లో దాదాపు లక్ష మంది అభిమానుల నడుమ.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచిపోయింది.ఒత్తిడిలో చిత్తైఫైనల్లో ఒత్తిడికి చిత్తై కంగారూలకు ట్రోఫీని సమర్పించుకుంది. ఇక దాదాపు పదకొండేళ్ల తర్వాత మరోసారి ఐసీసీ టైటిల్ సాధించే అవకాశం ముంగిట నిలిచింది టీమిండియా. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటి విజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది.అభిమానుల అంచనాలు కూడా అదే రేంజులో ఉన్నాయి. చాలా మంది మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కూడా టైటిల్ ఫేవరెట్లలో రోహిత్ సేన ముందుంటుందనే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.మా మీద ఆశలు పెట్టుకోవద్దని నేను చెప్పనుభారీ అంచనాలు ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని.. కాబట్టి ఇలాంటి హైప్‌నకు తాము దూరంగా ఉంటేనే మంచిదని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘మా మీద ఆశలు పెట్టుకోవద్దని నేను చెప్పను.నిజానికి మన దేశంలో క్రికెట్‌కు ఉన్న స్థానం వేరు. అదే మన బలం. అయితే, ఒక్కోసారి అతిగా ఆలోచిస్తూ.. మనపై భారీ అంచనాలు ఉన్నాయనే విషయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటూ.. ఆ దిశగా దృష్టి సారిస్తే అదే బలహీనతగా మారే అవకాశం ఉంది.దానిని నుంచి స్ఫూర్తి, శక్తిని పొందేలా ఉండాలికాబట్టి మన బలాన్ని మాత్రమే నమ్ముకుని.. దానిని నుంచి స్ఫూర్తి, శక్తిని పొందేలా ఉండాలి. మాకు వెన్నుదన్నుగా ఉన్న అభిమానుల కోసం.. వారి కలలు నెరవేర్చేలా ఆడాలి అన్న ఆలోచన మాత్రమే దరికిరానివ్వాలి’’ అని స్టార్ స్పోర్ట్స్‌తో విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు.కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ జూన్ 1న మొదలుకానుంది. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలో ఆటగాళ్లంతా అమెరికా చేరుకోగా.. కోహ్లి ఇంకా భారత్‌లోనే ఉన్నాడు.చదవండి: T20 WC: ఓపెనర్‌గా రోహిత్ శర్మ వద్దు.. వాళ్లిద్దరు రావాలి! -
T20 WC: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్ ఏంటి?.. పూర్తి వివరాలు
మెగా క్రికెట్ ఈవెంట్ టీ20 ప్రపంచకప్-2024 కోసం టీమిండియా సహా ఇతర జట్లన్నీ సంసిద్ధమైపోయాయి. పొట్టి ఫార్మాట్లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఈసారి ఈ ఐసీసీ టోర్నీకి అమెరికా తొలిసారిగా వెస్టిండీస్‌తో కలిసి ఆతిథ్యం ఇస్తోంది.అదే విధంగా.. ఎన్నడూలేని విధంగా ఈసారి 20 జట్లు ఈసారి వరల్డ్‌కప్‌లో భాగం కానున్నాయి. మరి.. ప్రపంచకప్-2024 ఏ ఫార్మాట్లో జరుగనుంది? ఏ జట్లు ఏ గ్రూప్‌లో ఉన్నాయి? గ్రూప్ స్టేజీలో విజేతలను ఎలా నిర్ణయిస్తారు? సూపర్ ఓవర్ రూల్, రిజర్వ్‌డే సంగతేంటి? తదితర విషయాలు తెలుసుకుందాం.నాలుగు గ్రూపులుటీ20 ప్రపంచకప్-2024లో పాల్గొనే 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు.👉గ్రూప్- ఏ: ఇండియా, పాకిస్తాన్, యూఎస్ఏ, ఐర్లాండ్, కెనడా👉గ్రూప్- బి: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్👉గ్రూప్- సి: వెస్టిండీస్, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినియా👉గ్రూప్- డి: సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.గెలిస్తే ఎన్ని పాయింట్లు?.. గ్రూప్ స్టేజీ విజేతలను ఎలా నిర్ణయిస్తారు?👉గ్రూప్ దశలో ప్రతీ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతుంది. తమ గ్రూపులో ఉన్న నాలుగు జట్లతో ఒక్కోసారి తలపడుతుంది.👉ఇందులో అత్యధిక విజయాలు సాధించిన రెండు జట్లు సూపర్-8 దశకు అర్హత సాధిస్తాయి.👉కాగా గెలిచిన జట్టు ఖాతాలో రెండు పాయింట్లు చేరతాయి. మ్యాచ్ గనుక రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ వస్తుంది.👉గ్రూప్ దశలో రెండు జట్లకు సమానంగా పాయింట్లు వస్తే నెట్ రన్‌రేటు ఎక్కువగా ఉన్న జట్టు టోర్నీలో ముందుకు సాగుతుంది.👉అయినప్పటికీ రెండు లేదంటే అంతకంటే ఎక్కువ జట్లు గనుక సమానంగా నిలిస్తే ముఖాముఖి పోరులో ఎవరు విజయం సాధించారన్న అంశం ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు.సూపర్ ఓవర్ రూల్?ఏదేని మ్యాచ్ గనుక టై అయితే సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని తేలుస్తారు. రెండు సమానంగా నిలిస్తే గనుక ఫలితం తేలేదాకా సూపర్ ఓవర్ నిర్వహిస్తూనే ఉంటారు.సూపర్-8 దశకు చేరాలంటే అర్హతలు?గ్రూప్ దశలోని నాలుగు గ్రూపుల్లో ఒక్కో గ్రూపు నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు చేరుకుంటాయి. సూపర్-8లో ఒక గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి.సెమీ ఫైనల్ చేరాలంటే?👉సూపర్-8 దశలో రెండు గ్రూపుల్లో ఉన్న టాప్-2 జట్లు సెమీ ఫైనల్‌కు చేరతాయి.👉గ్రూప్-1లో అగ్రస్థానంలో ఉన్న జట్టు- గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న జట్టు మధ్య మొదటి సెమీ ఫైనల్ జరుగుతుంది. ఇందుకు ట్రినిడాడ్ వేదిక.👉గ్రూప్-2లో అగ్రస్థానంలో ఉన్న జట్టు- గ్రూప్-1లో రెండో స్థానంలో ఉన్న జట్టు మధ్య రెండో సెమీ ఫైనల్ జరుగుతుంది. ఇందుకు గయానా వేదిక.ఆటంకాలు ఎదురైతే..వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడితే.. సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టు కనీసం ఐదు ఓవర్ల పాటు ఆడినా ఫలితం తేల్చే వీలుంటుంది.సెమీ ఫైనల్, ఫైనల్లో మ్యాచ్‌లలో సెకండ్ బ్యాటింగ్ చేసే జట్టు కనీసం పది ఓవర్ల పాటు ఆడాలి.రిజర్వ్ డే సంగతేంటి?👉తొలి సెమీ ఫైనల్, ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. రెండో సెమీ ఫైనల్‌కు మాత్రం రిజర్వ్ డే లేదు.👉అయితే, రెండు సెమీ ఫైనల్స్‌లో ఆటంకాలు ఎదురైతే విజేతలను తేల్చే క్రమంలో అదనంగా 250 నిమిషాల సమయం ఇస్తారు.👉జూన్ 26 నాటి తొలి సెమీ ఫైనల్‌కు ఆరోజు 60 నిమిషాలు, మిగతా రోజు ఆట కొనసాగించేందుకు 190 నిమిషాలు ఇస్తారు.👉జూన్ 27 నాటి రెండో సెమీ ఫైనల్‌కు అదనంగా ఆరోజు అదనంగా 250 నిమిషాల సమయం ఇస్తారు. ఇక జూన్ 29 నాటి ఫైనల్‌కు జూన్ 30 రిజర్వ్ డే.👉రిజర్వ్ డే ఫలితం తేల్చే క్రమంలో ఇరుజట్లు కనీసం 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.ఓవర్ రేటు రూల్?ఓ జట్టు గంట వ్యవధిలో కనీసం 14.1 ఓవర్లు బౌల్ చేయాల్సి ఉంటుంది. లేదంటే స్లో ఓవర్ రేటు కింద జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది.అయితే, ఆటగాళ్లు తీవ్రమైన గాయాల బారిన పడినపుడు, వైద్య బృందం మైదానంలో చికిత్స చేసినపుడు.. లేదంటే థర్డ్ అంపైర్ రివ్యూ విషయంలో సమయం తీసుకున్నపుడు, బ్యాటింగ్ జట్టు సమయం వృథా చేసినపుడు, మన ఆధీనంలో లేని పరిస్థితుల వల్ల కొన్నిసార్లు వెసలుబాటు ఉంటుంది.చదవండి: T20 WC: నో రిజర్వ్ డే! ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే! -
టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన విండీస్.. టాప్‌లోనే భారత్
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ సత్తా చాటింది. అంతర్జాతీయ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో విండీస్ జట్టు రెండు స్ధానాలు ఎగబాకి నాలుగో స్ధానానికి చేరుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కరేబియన్లు.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాను వెనక్కి నెట్టి నాలుగో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.టీ20 వరల్డ్‌కప్-2024కు ముందు వెస్టిండీస్ జట్టు అద్బుతమైన ఫామ్‌లో ఉంది. రెగ్యూలర్ కెప్టెన్ పావెల్, ఆండ్రీ రస్సెల్, హెట్‌మైర్ వంటి ఆటగాళ్లు లేకుండానే ప్రోటీస్ జట్టును వెస్టిండీస్ చిత్తు చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో కరేబియన్లు సత్తాచాటారు.తమ సొంత గడ్డపై జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇదే జోరును కొనసాగించాలని విండీస్ జట్టు భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండగా.. టీ20 ర్యాకింగ్స్లో అగ్రస్ధానంలో భారత్(264 రేటింగ్) కొనసాగుతోంది. టీమిండియా తర్వాతి స్ధానాల్లో వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నిలిచాయి.
Pagination
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
ఈ బిచ్చగాడు ఎంత రిచ్ అంటే.. ఏకంగా రూ.కోటి ఇన్సూరెన్స్!
కారుపై పెద్దపులి దాడి..
టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా జాంటీ రోడ్స్..?
హనీరోజ్ 'రాహేలు' టీజర్ విడుదల
సీరియస్‌గా ప్రయత్నించా.. ఎవరూ ఛాన్సివ్వలేదు: సేతుపతి
ఇద్దరూ టెకీలే: క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్ భార్య గురించి తెలుసా? (ఫొటోలు)
సుమిత్ నగాల్ సంచలనం.. అత్యుత్తమ ర్యాంకు
హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా 'రా రాజా'.. టీజర్‌తోనే భయపెట్టారు!
ఆ దేశం ఇంకా 2016 లోనే ..!ఎందుకో తెలుసా..!
ఖైరతాబాద్ గణేశ్.. ఈసారి 70 అడుగుల ఎత్తు
Advertisement