-
క్రికెట్ వరల్డ్‌కప్ జట్టులో పోత్గల్ కుర్రాడు.. కేటీఆర్ హర్షం! పోస్ట్ వైరల్
U19 World Cup 2024 India Squad: యువ క్రికెటర్లు అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్‌లకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అభినందనలు తెలిపారు. వీరిద్దరు కెరీర్లో అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కాగా దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19- ఫిబ్రవరి 11 వరకు అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ ఇందులో పాల్గొనబోయే భారత యువ జట్టును మంగళవారం ప్రకటించింది. ఇదే టీమ్ సౌతాఫ్రికాతో ట్రై సిరీస్‌లోనూ పాల్గొననుంది. పోత్గల్ కుర్రాడంటూ కేటీఆర్ హర్షం ఇక మొత్తంగా పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో హైదరాబాద్‌కు చెందిన అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్‌లకు చోటు దక్కింది. ఈ విషయంపై స్పందించిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్ జట్టు, సౌతాఫ్రికాతో ట్రై సిరీస్ ఆడే జట్టు ఎంపికైనందుకు అరవెల్లి అవినాశ్ రావుకు శుభాకాంక్షలు. ఈ యువ క్రికెటర్ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం పోత్గల్ గ్రామంలో పుట్టిపెరిగాడు’’ అంటూ అవినాశ్ సక్సెస్ పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. Hearty congratulations to Aravelly Avanish Rao on getting selected for U-19 Cricket World Cup and Tri Series in South Africa. This promising cricketer hails from Pothgal village in Rajanna Sircilla Constituency. pic.twitter.com/yGMX7YYpnd — KTR (@KTRBRS) December 14, 2023 అభిషేక్‌కు కూడా కంగ్రాట్స్ కాగా ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికట్లో కేటీఆర్ రాజన్న సిరిసిల్ల నుంచి శాసన సభ్యులుగా మరోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మరో ట్వీట్లో అభిషేక్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘హైదరాబాద్ నుంచి అండర్-19 వరల్డ్‌కప్ జట్టుకు సెలక్ట్ అయిన మురుగన్ అభిషేక్‌కు కంగ్రాట్స్. అవినాశ్, అభిషేక్ ఇద్దరూ మెగా టోర్నీలో రాణించాలని కోరుకుంటున్నా’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ జట్టుకు ఆడుతున్న అవినాశ్ వికెట్ కీపర్‌గా.. అభిషేక్ ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణిస్తున్నాడు. ఇక వీరిద్దరు దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ క్రమంలో అండర్-19 ఆసియా కప్-2023 టోర్నీలో ఆడుతున్నారన్న సంగతి తెలిసిందే. Would also like to Congratulate another bright lad from Hyderabad, Murugan Abhishek, who made it to the U-19 squad. Best wishes to both these youngsters 👍 pic.twitter.com/SGqaA2Tr23 — KTR (@KTRBRS) December 14, 2023 అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్ ఖాన్, అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్, ఇనేశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి. -
హైదరాబాదీ క్రికెటర్లకు గోల్డెన్ ఛాన్స్.. ప్రపంచకప్ జట్టులో చోటు
U19 World Cup 2024 India Squad: అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో ఇద్దరు తెలుగు క్రికెటర్లు చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అరవెల్లి అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్ ఐసీసీ ఈవెంట్లో భాగమయ్యే ఛాన్స్ కొట్టేవారు. కాగా వికెట్ కీపర్ అవినాశ్, ఆఫ్‌స్పిన్ ఆల్‌రౌండర్ అభిషేక్.. ఈ ఇద్దరూ కూడా ఆసియా కప్‌లో భారత్ ఆడిన 3 మ్యాచ్‌లలోనూ బరిలోకి దిగారు. కాగా అండర్–19 వరల్డ్‌కప్ టోర్నమెంట్లో పాల్గొనే యువ ఆటగాళ్ల పేర్లను బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం దుబాయ్‌లో అండర్–19 ఆసియా కప్‌లో పాల్గొంటున్న జట్టునే.. ఒక్క మార్పూ లేకుండా ఈ మెగా టోర్నీ కోసం కూడా ఎంపిక చేయడం విశేషం. ఇక 15 మంది సభ్యుల ఈ ప్రపంచకప్ జట్టుకు పంజాబ్‌కు చెందిన ఉదయ్ సహరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడికి డిప్యూటీగా సౌమీ కుమార్ పాండే వైస్ కెప్టెన్‌గా అవకాశం దక్కించుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 19 నుంచి ఫిబ్రవరి 11 వరకు వరల్డ్‌కప్‌ను నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ (వైస్ కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్, రుద్రమయూర్ పటేల్, సచిన్, ప్రియాన్షు, ముషీర్ ఖాన్, అవినాశ్ రావు, మురుగన్ అభిషేక్, ఇనేశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి. చదవండి: U19 Asia Cup 2023: ఏడు వికెట్లతో చెలరేగిన పేసర్.. భారత్ ఘన విజయం
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మా ఇంట్లోనే ఉన్నా.. దయచేసి ఎవరూ నమ్మొద్దు: హీరో శ్రీకాంత్
2014-22 మధ్య ఆప్ రూ. 7.08 కోట్ల విదేశీ నిధులను పొందింది: ఈడీ
ఆనంద్ దేవరకొండ 'గం గం గణేశా' ట్రైలర్ చూశారా?
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది: సమంత
శివమ్ దూబేపై వేటు.. వరల్డ్‌కప్ జట్టులో ఫినిషర్‌కు చోటు!
కేజ్రీవాల్‌కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
ఇరాన్ అధ్యక్షుడి మృతి.. ఎగిసిన చమురు, బంగారం ధరలు!
జూన్ 4 తరువాత చూసుకుందాం: పెద్దిరెడ్డి
సస్పెండ్ అయి స్థానంలో కొత్త అధికారులు
తప్పక చదవండి
- ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్‌కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- AP: పలువురు డీఎస్పీలు, సీఐలను నియమించిన ఈసీ
- యాక్షన్ ఎంటర్టైనర్గా బిగ్‌బ్రదర్.. రిలీజ్ ఎప్పుడంటే?
- హైదరాబాద్‌లో మళ్లీ దంచికొడుతున్న వాన
- ‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- అతడొక క్లాస్ ప్లేయర్.. ఎంత చెప్పుకున్న తక్కువే: ప్యాట్ కమ్మిన్స్
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement