-
పెళ్లి చేసుకున్న నటుడు.. వధువుపై ట్రోలింగ్
పెళ్లి అనేది రెండు మనసులను ఒక్కటి చేసే తంతు. రెండు కుటుంబాలను కలిపే గొప్ప ప్రక్రియ. ఎవరి ఇష్టాయిష్టాలను బట్టి వారు తమ భాగస్వాములను ఎంచుకుంటారు. జీవితాంతం వారితో కలిసి ఉండేందుకు ఇష్టపడతారు. అయితే పెళ్లి చేసుకునేవాళ్లు బాగానే ఉన్నా జనాలు మాత్రం కొన్నిసార్లు ఆ జంటను విమర్శిస్తూ ఉంటారు. దంపతుల్లో ఒకరి ఎత్తు తక్కువైందనో, లావుగా ఉన్నారనో, రంగు లేదనో.. జోడీ బాలేదంటూ నోటికొచ్చింది అనేస్తుంటారు. ప్రియురాలి మెడలో తాళి కట్టిన నటుడు కన్నడ నటుడు విరాట్ విషయంలోనూ అదే జరిగింది. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసిన ఇతడు తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయ్యాడు. తమిళంలో పలు సీరియల్స్ చేశాడు. అలాగే రియాలిటీ షోలలో పాల్గొంటున్నాడు. ఏప్రిల్ 18న అతడు తన ప్రేయసి నవీన మెడలో మూడుముళ్లు వేశాడు. ఈమె సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. పలువురు నటీనటుల దగ్గర మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసింది. గురువారంనాడు తమిళనాడులోని మహాబలిపురంలో వీరి వివాహం జరిగింది. పుట్టినింటికి దూరమవుతానన్న బాధతో పెళ్లిపీటలపైనే నూతన వధువు కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో ఆమెను ఓదార్చుతూ నటుడు తనకు ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. పెళ్లికూతురిపై ట్రోలింగ్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు విరాట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి బాగోలేదని, ఆంటీలా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇద్దరూ అబ్బాయిల్లాగే ఉన్నారు.. ఆమె గుండమ్మలా ఉందని బాడీ షేమింగ్ చేస్తున్నారు. శుభమా అని పెళ్లి చేసుకున్న కొత్త జంటను ఆశీర్వదించాల్సింది పోయి ఇలా ఎందుకు తిడుతున్నారని నటుడి అభిమానులు మండిపడుతున్నారు. చదవండి: సినిమా కోసం తిరిగి పర్సు ఖాళీ.. అప్పుడు భార్యే..! -
ఆ కోరిక తీరకుండానే కన్నుమూసిన నటుడు
కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదంటారు. కానీ చాలామంది పబ్లిసిటీ చేసుకోవడానికి ఇష్టపడతారు. కొందరు మాత్రమే గుప్తదానాలు చేస్తుంటారు. అలాంటివారిలో నటుడు డేనియల్ ఒకరు. ఆపదలో ఉన్నామంటూ ఎవరైనా చేయి చాచి అడిగితే చాలు క్షణం ఆలోచించకుండా సాయం చేసేవారు. తను కూడబెట్టిన డబ్బునంతా ఓ గుడి కట్టేందుకు ఉపయోగించారు. తనకంటూ పెద్దగా ఆస్తులు వెనకేసుకోలేదు. రియల్ హీరో.. సినిమాల్లో విలన్‌గా నటించినా నిజ జీవితంలో మాత్రం హీరోగా బతికారు. ఇంకా ఎంతో జీవితం చూడాల్సిన వ్యక్తి శుక్రవారం (మార్చి 29) గుండెపోటుతో కన్నుమూశారు. అతడి మరణం తమిళ చిత్రపరిశ్రమను కుదిపేసింది. నటుడి కెరీర్ విషయానికి వస్తే.. చిట్టి అనే సీరియల్‌తో తన నటప్రస్థానం మొదలైంది. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు. స్క్రీన్‌పై విలనిజం పండించే ఈయనకు మనసులో ఎప్పుడూ ఓ కోరిక మెదులుతూ ఉండేది. తనకు డైరెక్షన్ అంటే ఇష్టం. ఆ కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చాడని అంటుంటారు. 2014లో తమిళంలో ఓ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. ఆ కోరిక తీరకుండానే.. ఈ విషయాన్నే ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. 'స్క్రిప్ట్ రెడీ అయింది. దీన్ని డైరెక్ట్ చేయడంతోపాటు ఓ ముఖ్య పాత్రలో నేను నటించాలనుకుంటున్నాను. వీలు కుదిరితే తమిళంతోపాటు కన్నడ భాషలోనూ ఒకేసారి రూపొందించాలని చూస్తున్నాను. ఈ మూవీకి నా స్నేహితుడు ఎమ్ఆర్ గణేశ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు' అని చెప్పారు. ఎందుకోగానీ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు. డైరెక్టర్ అవ్వాలన్న కోరిక తీరకుండానే ఆయన ప్రాణాలు విడిచారు. డేనియల్.. సాంబ, ఘర్షణ,చిరుత, టక్ జగదీష్, సాహసం శ్వాసగా సాగిపో వంటి చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. చదవండి: ప్రముఖ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత -
కొత్త బిజినెస్.. ఫ్రెండ్‌కు అప్పజెప్పిన నటుడు.. అంతేకాదు!
సినిమా రంగంలో నిజమైన మిత్రులు కొందరే ఉంటారు. నటుడు గంజాకరుప్పు, గీత రచయిత జయంకొండాన్ ఆ కోవలోకే వస్తారు. గంజాకరుప్పు ఎన్నో చిత్రాల్లో హాస్యపాత్రల్లో ప్రేక్షకులను నవ్వించడంతోపాటు, కథానాయకుడిగా, నిర్మాతగానూ చిత్రాలు చేశారు. ప్రస్తుతం నటనపైనే దృష్టి సారిస్తున్న ఈయన కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. 20 ఏళ్లుగా మంచి ఫ్రెండ్స్ గీత రచయిత జయంకొండాన్.. వేటప్పన్, ఇంద్రసేనా, ఓడుం మేఘంగళ్, ఒరు సంధిప్పిల్, సొక్కు సుందరం తదితర చిత్రాలకు పాటలను రాసి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలకు గేయరచయితగా పని చేస్తున్న ఈయన స్థానిక కేకే.నగర్లో కవింజర్ కిచెన్ పేరుతో హోటల్ నడుపుతున్నారు. గంజాకరుప్పు, జయంకొండాన్లు 20 ఏళ్లుగా మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. ఫ్రెండ్‌కు పెళ్లి చేసే బాధ్యత కూడా! తాజాగా గంజాకరుప్పు త్వరలో ఊరంపాక్కమ్లో ప్రారంభించనున్న హోటల్ నిర్వహణ బాధ్యతలను గీత రచయిత జయంకొండాన్కు అప్పగించనున్నారు. అంతేకాదు ఇంకా అవివాహితుడిగా ఉన్న తన మిత్రుడికి పెళ్లి చేసే బాధ్యతలను తీసుకున్నారు. ఇందుకోసం డాక్టర్ చదివిన యువతిని వెతికే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. దీంతో స్నేహమంటే వీరిదే.. అని కోలీవుడ్ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. కాగా నటుడు గంజాకరుప్పు భార్య కూడా వైద్యురాలు అన్న విషయం తెలిసిందే. చదవండి: ముగ్గురు కుమార్తెలతో భారమైన జీవితం.. లారెన్స్ సాయం.. వీడియో వైరల్ -
Daniel Balaji Photos: గుండెపోటుతో నటుడి హఠాన్మరణం.. డేనియల్ బాలాజీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
-
హీరో అజిత్ కుమార్ బాధపడుతోంది ఈ వ్యాధితోనే..!
ఇటీవల తమిళ హీరో అజిత్ కుమార్ చెకప్ కోసం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏమైందంటూ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై అజిత్ పీఏ సురేశ్‌చంద్ర స్పందించి వివరణ ఇచ్చారు. సాధారణ వైద్య పరీక్షల కోసం అజిత్ ఆస్పత్రిలో చేరారని, ఆయనకు చెవి వెనుక ఉన్న నరాలు బలహీనంగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పుకొచ్చారు. అయితే వైద్య నటుడు అజిత్ కుమార్ సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్తో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అసలేంటీ ఈ వ్యాధి? ఎందువల్ల వస్తుందంటే.. ఈ సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్ని వైద్యపరంగా ఇస్కీమిక్గా స్ట్రోక్ అని పిలుస్తారు. తగినంత ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల మెదడు కణజాలం దెబ్బతినండంతో ఈ స్ట్రోక్ సంభవిస్తుంది. మెదడులోని ధమని బ్లాక్ అయినప్పుడు లేదా చిట్లినప్పుడూ ఈ సమస్య తలెత్తుంది. ఇది మెదడుకు సక్రమంగా ఆక్సిజన్ అందకపోవడంతో మెదడులోని నరాలు వాపుకి దారితీయడంతో ఇదంతా జరుగుతుంది. దీంతో రోగికి పక్షవాతం రావడం లేదా కొన్ని సమయాల్లో సీరియస్ అయ్యి మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ సమయంలో రోగికి తక్షణమే చికిత్స అందడం అనేది అత్యంత ముఖ్యం. ఈ వ్యాధి లక్షణాలు.. వికారం లేదా వాంతులు కంటి కదలికలో సమస్యలు, సరిగా కనిపించకపోవడం తలనొప్పి మాట్లాడడంలో ఇబ్బంది చేతులు, పాదాలు లేదా ముఖంలో తిమ్మిరి అనుభూతి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మూర్ఛ లేదా కోమాలోకి వెళ్లిపోవడం కారణాలు అధిక రక్తపోటు మధుమేహం, ధూమపానం, ఊబకాయం, కొలస్ట్రాల్, డయాబెటిస్, లేదా సడెన్‌గా చక్కెర స్థాయలు పెరగడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. నివారణ ఈ ప్రమాదకరమైన వ్యాధిని నివారించడానికి బరువును అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ఆదిలోనే గుర్తించగలుగుతాం. అలాగే స్ట్రోక్ వచ్చిన రోగులకు థ్రోంబోలిటిక్ మందులతో నయం చేయడం జరుగుతుంది. అలాగే ఇంట్రావీనస్ ఆర్‌టీపీఏ థెరపీని అందిస్తే రోగిని సుమారు 3 గంటల్లో మాములు మనిషిగా చెయ్యొచ్చు. (చదవండి: కేన్సర్‌పై యువతి పోరు..ఆమె ధైర్యానికి సాక్షి ఈ వీడియో!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్‌కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
తప్పక చదవండి
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement