breaking news
sahadev
-
విష్ణు సహస్ర నామాలు ఎలా లభించాయంటే..?
అంపశయ్యపై ఉన్న భీష్ముడు విష్ణు సహస్ర నామాలను ఉపదేశిస్తున్నప్పుడు శ్రీ కృష్ణుడు, వ్యాసమహర్షి, పాండవులు శ్రద్ధగా విన్నారే కానీ ఎవరూ వ్రాసుకోలేదు. ఎంతో మహిమాన్వితమైన సహస్రనామాలను అందరికీ చేరేందుకు లిఖించబడాలి... కానీ ఇప్పుడు ఎలా? అని ధర్మరాజు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణ పరమాత్మను అడుగగా శ్రీకృష్ణుడు మాట్లాడుతూ పాండవుల్లో కనిష్టుడైన సహదేవుడు వల్లే సాధ్య అవుతుంది. అంతేకాకుండా వ్యాస మహర్షి లిఖిస్తే అందరికీ అందేలా గ్రంథస్థం చేయించవచ్చునని సమాధానమిచ్చాడు. అందుకు ధర్మరాజు అదెలా సాధ్యమనగా శ్రీకృష్ణుడు మాట్లాడుతూ మనందరిలో ఒక సహదేవుడు మాత్రమే సూతస్పటికం వేసుకున్నాడు. దానివల్లే సాధ్యమవుతుందన్నాడు.సూత స్ఫటికం అంటే.....వాతావరణంలో ప్రయాణించే శబ్ద తరంగాలను గ్రహించి తనలో నిల్వ చేసుకోగల ఒక అద్భుతమైన స్పటికం. హిందూ పురాణాల ప్రకారం సూతస్ఫటికాన్ని పరమేశ్వర స్వరూపంగా భావిస్తారు. నేటి ఆధునిక టేప్ రికార్డర్‌లా పనిచేస్తుంది. గాలిలో కలిసిపోయిన శబ్ద తరంగాలను రికార్డు చేసుకుని అవసరమైనప్పుడు మళ్ళీ వినిపించ గల శక్తి దీనికుంది.సాంకేతికంగా చెప్పాలంటే ప్రస్తుతం మనమందరం పిలుస్తున్న క్లౌడ్ స్టోరేజ్ లాంటిది.అంత మహిమాన్వితమైన సూతస్పటికాన్ని ధరించిన సహదేవుడు పరమేశ్వరుని ప్రార్థిస్తే స్పటికంలో నమోదుకాబడిన శబ్ద తరంగాలు వెనకకు వస్తాయని (రీప్లే)వాటిని వ్యాస మహర్షి తో వ్రాయించాలని శ్రీ కృష్ణుడు సలహా ఇవ్వడంతో సహదేవుడు పరమేశ్వరుని ప్రార్థించడం, వ్యాసమహర్షి విష్ణు సహస్రనామాలను లిఖించడంతో, అవి మనందరికీ గ్రంథస్వరూపంలో అందాయి. వాటినే మనం ప్రతిరోజు పఠనం చేసుకుంటున్నాము.ఇదంతా ఎలా తెలిసిందంటే... బహుశా... 1940లో అనుకుంటా... అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామీజీని ఇంటర్వ్యూ చేయడానికి ఒక వ్యక్తి టేప్ రికార్డుతో వచ్చాడు. ఆ సందర్భంగా స్వామీజీ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏదని అడిగితే ఎవరినుండీ....ఏ మాత్రం సమాధానం రాలేదు. అప్పుడు స్వామీజీ మనకు విష్ణు సహస్రనామాలు ఎలా వచ్చాయి ?.... ఎలా లిఖించబడింది.... ఎవరు వ్రాసారు... అని ప్రశ్నించారు. మరలా మౌనమే సమాధానం కావడంతో స్వామీజీ పైన చెప్పుకున్న కథనంతా చెప్పారన్నమాట. – సి. ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
సహదేవుడు.. ఖడ్గ యుద్ధ ప్రవీణుడు
పాండవులలో కనిష్టుడు సహదేవుడు... పాండురాజు రెండో భార్య మాద్రికి అశ్వినీ దేవతల అనుగ్రహంతో జన్మించినవాడు. ద్రోణాచార్యుని శిక్షణ లో ఖడ్గయుద్ధంలో ఎంతో ప్రవీణుడిగా ఆరితేరాడు. అజ్ఞాతవాస సమయంలో విరాటరాజు కొలువులో ‘తంత్రీపాలుడు’ అనే పేరుతో గోపాలకుడిగా పశు సంరక్షణ చేపట్టాడు.సహదేవునికి భవిష్యత్తులో జరిగే విషయాలు ముందే తెలిసినప్పటికీ, జగన్నాటక సూత్రధారి కృష్ణ పరమాత్మ సూచనలతోపాటు చెబితే ఏం జరుగుతుందో అన్న భయం, వ్యక్తిగత భద్రత పట్ల సందేహాలు ఉండడంతో ఏ విషయం చెప్పేవాడు కాదు. బృహస్పతిలా గొప్ప వివేకం కలవాడైనా తనకు తానుగా ఎవరి భవిష్యత్తు చెప్పలేదు. గొప్ప భవిష్యద్దార్శనికుడు అయినా ఇతరులతో పంచుకోలేడు. దీనినే ‘సహదేవ నీతి’ అంటారు.సహదేవుడు అత్యంత తెలివైనవాడు. ధర్మరాజుకు సలహాదారు, ఖడ్గయుద్ధంతోపాటు ఆయుర్వేదం, పశు సంరక్షణలో ప్రవీణుడు. మంచి జ్యోతిష్యవేత్త. అతిముఖ్యంగా కురుక్షేత్ర మహాసంగ్రామానికి ముహూర్తం పెట్టినవాడు సహదేవుడేనంటారు. అత్యంత సాధుశీలుడు, ధర్మవర్తనుడు, ఓర్పు, సహన స్వభావం కలిగిన వ్యక్తి.కౌరవుల నాశనానికి కారకుడైన శకునిని తాను అంతం చేస్తానని ప్రతిజ్ఞ చేసిన సహదేవుడు మహాభారత యుద్ధంలో 17వ రోజున శకునిని హతమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు.– సి ఎన్. మూర్తి, సీనియర్ పాత్రికేయులు -
ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్‌గా బుడ్డోడు.. ఇప్పుడు
సోషల్ మీడియా రాకతో కుగ్రామాల్లో ఉన్న ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తున్నాయి. తమలోని కళలు, ప్రతిభను ప్రదర్శించడానికి సోషల్ మీడియా మంచి వేదికగా మారింది. సామాజిక మాధ్యమాలతో ఓవర్‌నైట్ స్టార్లుగా మారుతున్న వారిని చూస్తున్నాం. తాజాగా ఓ బుడతడు కూడా ఒక పాట పాడి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ ఒక్క పాటతో ఇప్పుడు ఏకంగా ప్రఖ్యాత పాటల షోలో ప్రత్యక్షమయ్యాడు. (చదవండి: ఆ పాట నన్ను నిద్రపోనివ్వడం లేదు.. అనుష్క శర్మ) ఆ బుడ్డోడే చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్ డిర్డో. పాఠశాలలో ‘బచ్ పన్ కా ప్యార్ హై’ పాట సరదాగా పాడుతుండగా కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు చేరింది. ఆ బుడతడి గొంతు విని అందరూ ఫిదా అయ్యారు. జూలై 3వ తేదీన విడుదలైన ఆ వీడియో ఇప్పటివరకు 9 మిలియన్లకు పైగా వ్యూవ్స్ పొందింది. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ ఆ బాలుడు హసదేవ్ని ప్రశంసలతో ముంచెత్తారు. తన వద్దకు పిలిచి మరీ ‘బచ్ పన్ కా ప్యార్’ అంటూ పాట పాడించుకుని దీవించారు. అనంతరం ఆ వీడియోను సీఎం నెటిజన్లతో పంచుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా ఫిదా అయిపోయారు. ఇప్పుడు హసదేవ్ సోనీ టీవీ నిర్వహించే ఇండియన్ ఐడల్ పాటల -12 పోటీల్లో ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయాన్ని ప్రముఖ నేపథ్య గాయకుడు ఆదిత్య నారాయణ్ తెలిపాడు. సహదేవ్ ఇండియన్ ఐడల్ షోలో సందడి చేస్తున్న వీడియోను ఆదిత్య షేర్ చేశాడు. ఈ సమయంలో సహదేవ్ మళ్లీ బచ్పన్ కా ప్యార్ పాట పాడుతూ కనిపించాడు. బుడ్డోడు పాట పాడుతుంటే జడ్జిలు అను మాలిక్, సోనూ కక్కర్తో పాటు పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన గాయనీగాయకులు చిందేస్తున్నారు. సహదేవ్ రాకతో సందడిగా మారింది. ప్రస్తుతం ఇండియన్ ఐడల్ పోటీలు సెమీ ఫైనల్‌కు చేరాయి. ఆగస్టు 15వ తేదీన ఫైనల్ పోటీలు జరగనున్నాయి. View this post on Instagram A post shared by Aditya Narayan (@adityanarayanofficial) View this post on Instagram A post shared by vishnu_singh91 (@only_mod031zzz) -
వివాదంలో మరో తెలుగు సినిమా
హైదరాబాద్: అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాపై వివాదం సద్దుమణకముందే మరో చిత్రం చిక్కుల్లో పడింది. గోపీచంద్ హీరోగా నటించిన ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాపై వివాదం రాజుకుంది. ఈ సినిమా కోసం నిర్మాత సి. కళ్యాణ్ రూ. 6 కోట్లు తీసుకుని మోసం చేశారని సహదేవ్ అనే ఎన్నారై ఆరోపించారు. ఈ మేరకు కళ్యాణ్, తాండ్ర రమేశ్‌పై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వివాదం నెలకొనడం గమనార్హం. జయబాలాజీ రియల్ మీడియా పతాకంపై బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో గోపీచంద్ సరసన నయనతార హీరోయిన్గా నటించింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.


