breaking news
Rain Dance
-
ప్లకార్డ్‌లో పంచ్‌లైన్... నిరసనలో రీల్ వైబ్
లాఠీలతో కొడితే థ్యాంక్యూలు చెప్తున్నారు. చెదరగొట్టడానికి వాటర్ కానన్ వాడితే రెయిన్ డాన్స్ చేస్తున్నారు. వాళ్ల పాటే నినాదం. వాళ్ల వ్యంగ్యమే ప్రశ్న. సెల్‌ఫోన్ పట్టుకున్న సైన్యంలా ఉంటున్నారు. జెన్ జి నిరసనకు ఫార్మాట్ మారింది. సీరియస్ ఇష్యూ + సినిమా పంచ్ + సోషల్ మీడియా... అదే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’.ఢిల్లీ జంతర్ మంతర్‌లో ‘నీట్’ ప్రశ్నాపత్రానికి సంబంధించి తాజా నిరసనలో టియర్ గ్యాస్ గుప్పుమంది. అది చూసిన ఒక కుర్రాడు వెంటనే ప్లకార్డ్ మీద ఇలా రాశాడు. ‘గురూ... నేను యమునకు ఆ వైపున ఉంటా. ఇంతకన్నా కంపు రోజూ తెలుసు. ఇదసలు లెక్కే కాదు’....అక్కడే ఉన్న మరో కుర్రాడు ఇంకో ప్లకార్డ్ పట్టుకున్నాడు. దాని మీద గాంధీగారి బొమ్మ ఉంది. కింద కామెంట్– ‘ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే సీజన్1 హీరోని రంగంలో దించాల్సి వచ్చింది’... అంటే అహింసామార్గ ప్రదాతనే రంగంలోకి దించాల్సి వచ్చిందని అర్థం.మరో ప్లకార్డ్ ఒకమ్మాయి పట్టుకుంది. దాని మీద కామెంట్– ‘నాకు ఎవరూ ఫండింగ్ చేయలేదు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఉచితానికే అసహ్యించుకుంటున్నా’...తమ నిరసనకు స్పందించని పెద్దలకు చురక వేస్తూ మరో పోస్టర్. దానిపై మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్‌లోని సర్క్యూట్ పాత్ర. కింద కామెంట్– ఓయ్ సర్క్యూట్. రాంగ్ పర్సన్‌ని ఎత్తుకొచ్చావ్ స్వామీ.మామూలుగా నిరసనల్లో లాఠీచార్జీ జరిగితే పారిపోతారు. కాని నిరసనకు దిగిన జెన్ జి తరం వెనక్కి తగ్గలేదు. వాటర్ కానన్ కొట్టినా బదులుగా ‘రెయిన్ డాన్స్’ చేశారు. ‘Fitness plan: Running from police’ అని బోర్డు పట్టుకున్నారు.జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్ఒకప్పుడు నిరసన అంటే నల్ల జెండాలు, గొంతు చించుకునే నినాదాలు. కానీ 2026లో జెన్ జి ఆ డెఫినిషన్ను చెరిపేసింది. వాళ్లకు ఆగ్రహం ఉంది. కానీ ఆ ఆగ్రహాన్ని మీమ్‌గా, రీల్‌గా, పాటగా మారుస్తున్నారు. పేపర్ లీక్, నిరుద్యోగం, అవినీతి– సీరియస్ ఇష్యూలే. కానీ చెప్పే తీరు మాత్రం క్రియేటివ్. ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, జైపూర్ కావచ్చు... జెన్ జికి కోపం వస్తే స్టయిల్ ఇదే. స్పందించని వ్యవస్థను ఎద్దేవా చేస్తూ ‘నా ఎక్స్ (బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్) కూడా నన్ను ఇంతగా బాధించ లేదు’ అని ప్లకార్డు పట్టుకొని నిలబడుతున్నారు. ఇలా డిజిటల్ కల్చర్‌ను, మీమ్స్ భాషను నిరసనకు వాడుకోవడాన్నే ‘జెన్ జి కోడెడ్ ప్రొటెస్ట్’ అంటున్నారు. బాలీవుడ్ పాటలు పాడటం, సంగీత కచ్చేరీలు, ప్రబోధ గీతాల ఆలాపన.. అన్నీ అలౌడ్.గెట్ రెడీ విత్ మీ (G-RWM)జెన్ జి యువతీ యువకులు ఒక దగ్గరకు కూడటానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీ ‘చలో సంసద్’ నిరసన కోసం ప్రిపరేషన్ అంతా సోషల్ మీడియా రీల్స్ నుంచే ప్లాన్ అయింది. ‘గెట్ రెడీ విత్ మీ’ అంటూ రీల్స్ చేస్తూ యువతను సమీకరించారు. టియర్ గ్యాస్‌ను తట్టుకోవడానికి స్విమ్మింగ్ గాగుల్స్, ఢిల్లీ ఉక్కపోతను తట్టుకోవడానికి మినీ యూఎస్బీ ఫ్యాన్లు, విసనకర్రలు దగ్గర పెట్టుకుని బయలుదేరి వచ్చారు. ఎయిర్‌పోర్టుల నుంచి, రైలు కంపార్ట్మెంట్లలో నుంచి స్టోరీలు పెడుతూ ఏదో మ్యూజిక్ కాన్సెర్ట్‌కు వెళ్తున్నంత ఊపుతో దేశ రాజధానికి తరలివచ్చారు. ‘మా గుండెల్లో ఇంక్విలాబ్.. మా చేతుల్లో ఇన్ స్టాగ్రామ్!’ అనే వన్–లైనర్ ఈ తరం నిరసన తత్వం. ధర్మాగ్రహం కలిగి, శాంతియుతంగా మార్పు తేవాలని ప్రయత్నిస్తున్న ఈ తరాన్ని, వ్యంగ్యమనే బాణాలతో ప్రత్యర్థి మనసు మార్చాలని చూస్తున్న ఈ భావితరం స్వరాన్ని ‘నో’ అని నొక్కేస్తే రేపు వాళ్లు మాట్లాడటమే మానేస్తారు. ‘మేమున్నాం’ అని భుజం తడితే ఈ దేశానికి క్రియేటివ్, కరేజియస్ లీడర్స్ దొరుకుతారు. పంచ్‌లైన్ తో మొదలైన ఈ నిరసన రేపు పాలసీతో అంతం కావాలి. అప్పుడే ఈ ‘సెల్‌ఫోన్ సైన్యం’ నిజమైన దేశభక్తి సైన్యంగా మారుతుంది. వారి దారి వినూత్నంఢిల్లీలో పోలీసుల లాఠీచార్జి జరిగి, సాయంత్రం వాళ్లు డ్యూటీ దిగుతుంటే లాఠీ దెబ్బలు తిన్న యువతీ యువకులంతా ‘థ్యాంక్యూ సర్... చాలా బాగా డ్యూటీ చేశారు’ అని రోడ్డు పొడుగునా నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారు. ఇలా చేయడం తిట్టడం కంటే చాలా ఎక్కువ. ‘ఇంటికెళ్లి గర్వంగా ముఖం చూపించండి’ అని కూడా అన్నారు. తమను కొట్టిన వారికే మంచి నీళ్లు అందించడం, గులాబీపూలు ఇవ్వడం జెన్ జి ప్రొటెస్ట్ స్టయిల్. పోలీసులు కొడుతుంటే జాతీయ జెండాను చుట్టుకుని నిలబడటం, సారే జహాసే అచ్ఛా పాడటం.... జనగణమన ఆలపించడం.... కచ్చితంగా గాంధీ మార్గం.– కె -
న్యూ ట్రెండ్.. ఆక్వా వర్కౌట్స్ : ప్రయోజనాలెన్నో!
పొద్దున్నే లేచి వ్యాయామం కోసం జిమ్‌కి వెళదామని ట్రాక్ సూట్, షూ ధరించేలోగానే చెమట్లతో తడిపేసే సీజన్ ఇది. అందుకే నగరవాసులు నీటి అడుగునే జిమ్దగీకి జై కొడుతున్నారు. చల్లని నీటిలో ఓ వైపు శరీరాన్ని చల్లబరుస్తూ.. మరోవైపు వ్యాయామాలు చేస్తూ సేదతీరుతున్నారు. ముంబై, బెంగళూర్ తదితర నగరాలతో పాటు భాగ్యనగరిలో కూడా ఆక్వా వర్కవుట్స్‌కి ఫిదా అవుతోంది నగర యువత. – సాక్షి, సిటీబ్యూరోపింగ్ జాక్‌లు, ఆర్మ్ లిఫ్ట్‌లు, లెగ్ కిక్స్, లెగ్ షూట్స్ ఇవన్నీ.. రోజూ జిమ్‌లో చేసేవే కదా అనుకోవచ్చు. అయితే అవన్నీ ఇప్పుడు నీటిలోనూ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు అనుసరిస్తున్న ఆక్వా వర్కౌట్లు/హైడ్రో ఎక్సర్సైజ్లు నగరంలోనూ ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. సిటీలో ఏప్రిల్, మే నెలల్లో ఆక్వా సంబంధిత వ్యాయామాలకు డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అనేక కొత్తఎత్తయిన భవనాల్లోనూ, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ అందుబాటులో ఉన్న పూల్స్‌లో ఈ వ్యాయామాల సందడి కనిపిస్తోంది. ‘ఇది సాధారణ వ్యాయామాల మాదిరిగానే ఉంటుంది. కాకపోతే నీటిలో ఉన్నప్పుడు కాళ్లూ, చేతుల కదలికలకు పరికరాల కదలికను జోడించడం సరదాగా ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో క్యాలరీలను బాగా ఖర్చు చేయడంలో ఇది సహాయపడుతుంది. నీటిలో సౌకర్యవంతంగా ఉన్నంత వరకూ (ఇది పూల్స్‌లో ఎక్కువ లోతులేని వైపు ఉంటుంది) ఈ ఫార్మాట్ అన్ని వయసుల వారికీ పని చేస్తుంది అని చెబుతున్నారు ఆక్వా ఫిట్ ఇన్స్ట్రక్టర్ కవితారెడ్డి. చదవండి : 25 ఏళ్ల క్రితం చెత్తకుప్పలో వదిలేస్తే.. ఓ అంధురాలి సక్సెస్ స్టోరీవ్యాయామాలెన్నో.. ఆక్వా ఎరోబిక్స్ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇప్పుడు సిటీలో క్యాలరీలను బర్న్ చేసి రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడే అనేక నీటి ఆధారిత వ్యాయామాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఆక్వాటిక్ వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఆక్వా జుంబా, హెచ్ఐఐటీ, తబాటా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఆక్వా యోగా, కిక్–బాక్సింగ్ వంటి అనేక రకాలైన వర్కవుట్స్ చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘డంబెల్స్, నూడుల్స్, ఆక్వా బాక్సింగ్ గ్లోవ్స్, రెసిస్టెన్స్ ట్యూబింగ్, వాటర్ వాకింగ్, ఆక్వా థ్రెడ్మిల్స్, వాటర్ బైక్‌లు ఇంకా ఎన్నో.. పరికరాలతో చేసేందుకు ఆక్వా వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. ప్రయోజనాలెన్నో.. నీటి అడుగున వ్యాయామాలు బరువు తగ్గడానికి, కండరాలను టోన్ చేయడానికి, శక్తిని పెంచడానికీ సహాయపడతాయని అధ్యయనాలు నిరూపించాయి. తక్కువ అలసటతో ఎక్కువ ప్రయోజనాలు అందిస్తాయి. ఆర్థరైటిస్ రోగులకు ఇవి ఉత్తమమైనవి. అంతేకాదు ఒత్తిడిని కూడా తగ్గిస్తాయి. ఆక్వా వర్కౌట్లు గర్భిణులకు కూడా మంచిదని చెబుతున్నారు కవిత. ఈ వ్యాయామం వల్ల కీళ్లకు కూడా మేలైన రక్షణ ఉంటుంది. అందుకే సాధారణంగా గాయం నుంచి కోలుకునే క్రమంలో తరచూ హైడ్రో థెరపీని ఉపయోగిస్తారు. కార్డియో–ఇన్‌టెన్సివ్‌గా ఉంటాయి, గాలి కంటే నీరు 13 రెట్లు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి నీటి వ్యాయామాలు మరింత పటిష్టంగా ఉంటాయి. నేలమీది వ్యాయామం కంటే ఎక్కువ నిరోధకతను అందిస్తాయి. ఇది ఒక గంటలో 500–1,200 క్యాలరీలు బర్న్ చేయగలదు. నీటిలో ఉన్నప్పుడు శరీర బరువులో 10 శాతం మాత్రమే బరువు కలిగి ఉంటారు. కాబట్టి కీళ్ళు అన్లోడ్ చేయబడినట్లు అనిపిస్తుంది. నేల మీద మనం చేసే వ్యాయామాల్లో తప్పుడు కదలికల వల్ల లిగ్మెంట్స్ చిరిగిపోవడానికి /ఒత్తిడికి / బెణుకు లేదా పగుళ్లకు కారణమవుతుంది. నీటిలో వ్యాయామాల వల్ల గాయం అయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. చికిత్స కోసం నీటి వ్యాయామాలు సిఫార్సు చేస్తారు. ఇది చురుకుదనం, వెయిట్‌లాస్ కోసం ప్రభావవంతంగా ఉంటాయి. కాలుతో త్రిభుజం ఆకారంలో ఉండే డెగేజ్ పాస్ వంటివి ఇందులో ఉన్నాయి. పూల్‌లో నీటి సాంద్రత కాలుని ఎక్కువ దూరం కదపడానికి సహాయపడుతుంది. చదవండి : వాడికి భయపడి పబ్లిక్ టాయ్లెట్లో దాక్కుంది..కట్ చేస్తే ఆర్మీ మేజర్!కొన్ని సూచనలు మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం స్విమ్మింగ్ క్యాప్ ధరించడం ద్వారా చర్మం, జుట్టుకు క్లోరిన్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే కళ్లను రక్షించడానికి నీళ్లు కంట్లో కలిగించే చికాకును నివారించడానికి గాగుల్స్ ధరించాలి.నిదానంగా వ్యాయామం ప్రారంభించి కొంచెం కొంచెంగా తీవ్రతను పెంచాలి. శ్వాసను ఎక్కువసేపు బిగబట్టుకోవద్దు. నీటి అడుగున కఠినమైన విన్యాసాలు చేయవద్దు. నైపుణ్యం, స్థాయి, సామర్థ్యానికి తగిన వ్యాయామాలు మాత్రమే చేయాలి.సరైన శిక్షణ పర్యవేక్షణలో ఉంటే తప్ప అధునాతన వర్కవుట్స్ ఎప్పుడూ ప్రయత్నించవద్దు. అనుభవం లేకుంటే డైవింగ్ లేదా ఫ్లిప్ చేయడం మంచిదికాదు. అన్ని సీజన్స్‌లోనూ ఆరోగ్యకరమే.. ఈ వర్కవుట్ కేవలం వేసవిలో మాత్రమే కాదు అన్ని కాలాల్లోనూ ప్రయోజనకరం. బెంగళూరులో ఉన్నప్పుడు వ్యక్తిగత సమస్యల నుంచి పరిష్కారంగా ఎంచుకున్న ఈ వ్యాయామం నగరానికి వచి్చన తర్వాత నాకు పూర్తి స్థాయి ప్రొఫెషన్‌గా మారింది. దీని కోసం సింగపూర్‌లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్, ఏరోబిక్ అండ్ ఫిట్నెస్ (ఫిసా) కోర్సును చేశాను. ప్రస్తుతం నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఉన్న స్ట్రోక్స్‌తో పార్ట్నర్గా ఆక్వా వర్కవుట్స్‌లో సిటిజనులకు శిక్షణ అందిస్తున్నాను. ఈ వ్యాయామాల లాభాలపై అవగాహన మరింత పెరిగితే అది మరింతమందికి మేలు కలిగిస్తుంది. – కవితారెడ్డి, ఆక్వా ఫిట్ శిక్షకురాలు -
పిడుగు ముద్దాడ బోయింది
వానలో తడవాలని పిల్లలకు ఉంటుంది. జల్లుల్లో వాళ్లు కేరింతలు కొడితే ముద్దొస్తారు. మరి పిడుగుకు ముద్దొస్తే? తృటిలో ప్రాణాలు తప్పిపోయాయి. వానలో పిల్లలు జాగ్రత్త.బిహార్‌లోని సీతామర్హిలో ఒకమ్మాయి వానలో టెర్రస్ మీద సరదాగా కేరింతలు కొడుకుతుంటే తల్లి అది ఫోన్లో వీడియో తీయసాగింది. మనం అనుకుంటాం వాతావరణం ఆహ్లాదంగా ఉందని. కాని మెరుపులు, పిడుగులు ఎలా మెరిసి ఉరుముతాయో తెలియదు కదా. ఇక్కడ ఆ అమ్మాయికి కొద్ది దూరంలోనే పిడుగు పడింది. క్షణాల్లో ఆ అమ్మాయి లోపలికి పరిగెత్తింది. అమ్మాయి, తల్లి క్షేమమేగాని గురి సూటిగా ఉండి ఉంటే? అందుకే జాగ్రత్త. ఇకపై వానలు... ఉరుములు... పిడుగులు.. -
విశాఖలో హోలీ రెయిన్ డ్యాన్స్
-
Viral Video: వర్షంలో ఆదమరచి డాన్స్ చేసిన ప్రేమజంట
భోపాల్: రద్దీ రహదారిపై ఎవరి పనులు వారు చేసుకుంటుంటే ఒక లవ్ కపుల్ మాత్రం హాయిగా జోరువానలో తడుస్తూ రొమాంటిక్ గా డాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీనిపై కామెంట్ల వెల్లువ వెల్లువెత్తింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. దైనందిన జీవితంలో దినవారి పనులు చేసుకునేవారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగులకి, విద్యార్ధులకి ఇలా కొన్ని వర్గాల వారికి వర్షాలు పెద్ద అడ్డంకనే చెప్పాలి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడే అనిపిస్తుంది ప్రేమికులకు మాత్రమే వర్షాకాలం అనుకూలమని కవులు ఎందుకు చెప్పారోనని. భోపాల్‌లో హోరున వర్షం పడుతుండగా ప్రధాన రహదారి మీద ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డు మీద దూసుకుపోతుంటే ఓ ప్రేమ జంట మాత్రం పరిసరాలను అసలేమాత్రం పట్టించుకోకుండా తన్మయత్వంతో ఒకరి చేయి ఒకరు పట్టుకుని హాయిగా డాన్స్ చేస్తూ కనిపించారు. పరిసరాలు కూడా వీరి రొమాన్స్ ని పట్టించుకోకపోవడం విశేషం. వీరు డాన్స్ చేస్తుంటే వెనుక విక్కీ కౌశల్, సారా ఆలీ ఖాన్ కలిసి నటించిన "జరా హట్కే జరా బచ్కే" చిత్రంలోని తూ హై తో ముఝే పాట వినిపిస్తోంది. ఈ సన్నివేశాన్నివీడియో తీసి సొషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇంటర్నెట్లో దీనిపై కామెంట్ల రూపంలో విశేష స్పందన లభిస్తోంది. A beautiful couple enjoying this #mansoon in #Bhopal.#IamPureVegetarian #Karba #BusAccident #Beast #ModiAgainin2024 pic.twitter.com/GveBVp815C — Aisha Bhat (@aishabhat02) July 29, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
బిగ్‌బాస్: రెయిన్ డ్యాన్స్‌తో అదరగొట్టారు
అక్టోబర్ 3న అంగరంగ వైభవంగా ప్రారంభమైన హిందీ బిగ్‌బాస్ 14 సీజన్ గడిచిన సీజన్ల కంటే భిన్నమైనది. కండల వీరుడుసల్మాన్ ఖాన్ హోస్ట్‌గా చేస్తున్న ఈ సీజన్లో స్వల్ప మార్పులు చేశారు. కలర్స్ ఛానల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ 14లో గత సీజన్లలో పాల్గొన్న, గెలిచిన ప్రముఖ వ్యక్తులను తీసుకొచ్చారు. బిగ్‌బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా, బిగ్ బాస్ 7 గౌహర్ ఖాన్, హీనా ఖాన్ బిగ్ బాస్ 11 రన్నరప్ వారు ఈ సీజన్లో అడుగు పెట్టారు. వీరంతా ఇప్పటికే బిగ్‌బాస్‌లో పాపులర్ అయిన వారు కాట్టి హౌజ్‌లో ఎక్కువ రోజులు కొనసాగడానికి వీరికి అవకాశం ఉంటుందని జనాలు అభిప్రాయపడుతున్నారు. చదవండి: ‘దూరమైనా.. స్నేహంగానే ఉన్నాం’ బుధవారం జరగిన ఎపిసోడ్లో సింగర్ రాహుల్ వైద్య, పవిత్ర పునియా మధ్య దూరం మరింత పెరిగింది. కొత్తగా విడుదల చేసిన ప్రోమోలో ఆహార విషయంలో ఇద్దరు తీవ్ర వాదనకు దిగినట్లు కనిపిస్తోంది. రాహుల్ పవిత్రతో మాట్లాడుతూ తను ఇష్టపడే అమ్మాయి కోసం వంట చేయడం కంటే మధురమైనది మరొకటి లేదని భావిస్తున్నట్లు తెలిపాడు. అందుకే తను పవిత్రను వంట చేయడం నేర్పించాలని కోరినట్లు తెలిపాడు. పవిత్ర ఆహారం సరిగా వండటం లేదని ఆమెపై ఆరోపణలు చేశాడు. దీనిపై కోపానికి వచ్చిన పవిత్ర నీ ఫుడ్ నువ్వే వండుకోవాలని అతనిపై అరిచింది. చదవండి: నేను నోరు విప్పితే.. ఆమెకే నష్టం’ మరోవైపు నామినేషన్లో వచ్చిన ఇంట్లోని మహిళా కంటెస్టెంట్లు రెయిన్ డ్యాన్స్ చేస్తూ సిద్ధార్థ్ శుక్లాను మెప్పించాల్సి ఉంటుంది. నిక్కి తంబోలి,సిధార్థ్ శుక్లా చేసిన రెయిన్ డ్యాన్స్ హైలెట్‌గా నిలిచింది. ముగ్గురు అమ్మాయిలు సిద్దార్థ్ చుట్టూ డ్యాన్స్ చేస్తుండగా, మిగతావారు పక్కనుంచి వారిని ఉత్సాహపరిచారు. ఎవరైతే సిద్ధార్థ్‌ను తమ డ్యాన్స్‌తో ఆకట్టుకుంటారో వారు నామినేషన్నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా సిద్ధార్థ్ నిక్కి భుజంపై పచ్చబొట్టు వేయడం కూడా జరుగుతోంది. ఇక ప్రోమెలు, ఎపిసోడ్లతో బిగ్‌బాస్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుండటంతోపాటు ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ బోలేడు గాసిప్స్ కూడా పుట్టుకొస్తున్నాయి. View this post on Instagram 👉Follow Fast for biggboss14 updates FOLLOW ME FOR BIGGBOSS14 DAILY UPDATES 👉Follow @biggboss14jasoos 👉Follow @biggboss14jasoos 👉Follow @biggboss14jasoos Follow this page 👉Like 👉Comment 👉Share ➖➖➖➖➖➖➖➖➖➖➖ Exclusively on . @biggboss14jasoos Stay tuned for more updates #BiggBoss #BB14 #biggboss14 #devoleenabhattacharjee #sidharthshukla #dipikakakar #rashmidesai #hinakhan #gauharkhan #salmankhan #shehnazgill #asimriaz #KhatronKeKhiladi #rodiesrevolution #rodies #EijazKhan #JasminBhasin #NishantSinghMalkani #abhinavshukla #NikkiTamboli #ShehzadDeol #rubinadilaik #RahulVaidya #pavitraPunia #SaraGurpal #shardulpandit #shardulpandit #JaanSanu ➖➖➖➖➖➖➖➖➖➖➖ . . . . **FAIR USE** Copyright Disclaimer under section 107 of the Copyright Act 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair Use. A post shared by BIGGBOSS 14 JASOOS (@biggboss14jasoos) on Oct 7, 2020 at 11:41am PDT -
హోలీ సంబరాలకు నీళ్లివ్వం
ముంబై: రంగుల పండుగ హోలీ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తీవ్రంగా నెలకొన్న నీటి కొరత కారణంగా హోలీ సందర్భంగా నిర్వహించే రెయిన్ డాన్స్ లకు నీటిని సరఫరా చేసేది లేదని తెగేసి చెప్పింది. అలాగే స్విమ్మింగ్ పూల్స్ కు నీరు అందించకూడదని నిర్ణయించింది. నీటి ఎద్దడిని తట్టుకునేందుకు వీలుగా ఈ చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి అన్ని మున్సిపల్ కార్పొరేషనన్లకు ఆదేశాలు జారీచేయనున్నామని పేర్కొంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల పవిత్ర పండుగ హోలీ సంబరాలపై 'నీళ్లు' చల్లడం అన్యాయమని కొందరు, మంచి నిర్ణయమని కొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. -
హోలీ రంగుల వాన
నగరాన ....రంగుల వాన.. హోలీ సంబరం అంబరమంటింది. యువత ఉరిమే ఉత్సాహంతో చిందేసింది.. ఆనందం హరివిల్లు గా విరిసింది. మరోవైపు సాయం వేళ నింగి నుంచి జాలువారిన చిటపట చినుకులు పలుకరించాయి. మరింత ఆహ్లాదాన్ని పంచాయి. కొస మెరుపుగా ప్రపంచ క్రికెట్ సమరంలో టీమ్ఇండియా గెలుపు సంబరాలను చక్కటి మలుపు తిప్పింది. కుర్రకారు జోరుకు అడ్డులేదు. చిన్నారుల సరదాకు చినుకులు సై అన్నాయి. నగరంలో శుక్రవారం రంగుల వాన కురిసింది. ఆనందాల పండుగ హోలీని ఉత్సాహంగా జరుపుకొన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు చల్లుకున్నారు. రెయిన్ డ్యాన్స్‌లతో హంగామా చేశారు. ఐటీ ఉద్యోగులు వేడుకల్లో పాల్గొని నృత్యాలు చేశారు. - సాక్షి, సిటీబ్యూరో -
రెయిన్ డాన్స్ ఎంజాయ్ చేస్తున్న హైదరాబాదీలు


