హోలీ రంగుల వాన | Holi Special | Sakshi
Sakshi News home page

హోలీ రంగుల వాన

Mar 6 2015 11:29 PM | Updated on Sep 2 2017 10:24 PM

హోలీ  రంగుల వాన

హోలీ రంగుల వాన

నగరాన ....రంగుల వాన.. హోలీ సంబరం అంబరమంటింది.

నగరాన ....రంగుల వాన..  హోలీ సంబరం అంబరమంటింది.   యువత ఉరిమే  ఉత్సాహంతో  చిందేసింది..  ఆనందం హరివిల్లు గా  విరిసింది.  మరోవైపు సాయం వేళ  నింగి నుంచి జాలువారిన  చిటపట చినుకులు  పలుకరించాయి. మరింత  ఆహ్లాదాన్ని పంచాయి.  కొస మెరుపుగా ప్రపంచ క్రికెట్ సమరంలో  టీమ్‌ఇండియా  గెలుపు సంబరాలను చక్కటి మలుపు తిప్పింది.
 
 కుర్రకారు జోరుకు అడ్డులేదు.  చిన్నారుల సరదాకు చినుకులు సై అన్నాయి. నగరంలో శుక్రవారం రంగుల వాన కురిసింది. ఆనందాల పండుగ హోలీని ఉత్సాహంగా  జరుపుకొన్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా రంగులు  చల్లుకున్నారు. రెయిన్ డ్యాన్స్‌లతో హంగామా చేశారు.  ఐటీ ఉద్యోగులు    వేడుకల్లో పాల్గొని నృత్యాలు చేశారు.
 - సాక్షి, సిటీబ్యూరో  
 

Advertisement
 
Advertisement
Advertisement