-
పెట్రోల్, డీజిల్ @ రూ.125
-
శిలాజ ఇంధనాలకు రాయితీలు తగ్గితేనే...
శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరుగుతున్నందు వల్ల కాలుష్యం మరింత పెరుగుతోంది. అందుకే ప్రపంచ దేశాలు ఆ ఇంధనాలపై ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని వివిధ అంతర్జాతీయ సంస్థలూ, సదస్సులూ దశాబ్దాలుగా పిలుపునిచ్చాయి. ఉదాహరణకు కాప్– 21 సదస్సులో 40 కంటే ఎక్కువ దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను తొలగించడానికి ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. అయినా కూడా పారిశ్రామిక దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు శిలాజ ఇంధనాల ఉత్పత్తి, వినియో గానికి బడ్జెట్ బదిలీలు, పన్ను మినహాయింపులు, ఆర్థిక హామీలు అందజేస్తూనే ఉన్నాయి. ఈ సబ్సిడీల వలన వాతావరణానికి ప్రాథమికంగా హాని చేస్తున్న శిలాజ ఇంధనాల ఉపయోగం పెరుగుతూనే ఉన్నది. అభివృద్ధి చెందిన దేశాల నుంచి తగిన చర్యలు లేకపోవడంతో వర్ధమాన దేశాలు కూడా ముందడుగు వేయడానికి సిద్ధంగా లేవు. 2023లో భారతదేశంలో మొత్తం ఇంధన సబ్సిడీలు రూ. 3.2 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్’ చేసిన కొత్త పరిశోధన ప్రకారం ఇవి గత తొమ్మిదేళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. దేశంలో ఇంధన వనరుల డిమాండ్ పెరగడంతో పాటు, 2022లో ప్రపంచ ఇంధన సంక్షోభం నేపథ్యంలో, ప్రభుత్వం 2023లో అన్ని రకాల ఇంధన వనరుల లభ్యతను విస్తరిస్తూ హైబ్రిడ్ విధా నాన్ని అవలంభించింది. పెరుగుతున్న ఇంధన వినియోగం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత అంతర్జాతీయ ఇంధన ధరల సంక్షోభం ప్రభావం, అనేక దేశాలు అనుకున్న లక్ష్యాలకు వ్యతిరేకంగా శిలాజ ఇంధనాలకు మద్దతును గణనీయంగా పెంచాయి. భారతదేశం కూడా ఈ దిశ గానే అనేక చర్యలు అమలులోకి తెచ్చింది. 2022– 2023లో గరిష్ఠ స్థాయికి చేరుకున్న శిలాజ ఇంధన ధరల ప్రభావం నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ రిటైల్ ధరలను పరిమితం చేసింది. పన్నులను తగ్గించింది. వ్యాపారులు, వినియోగ దారులకు ప్రత్యక్ష నగదు బదిలీలు చేసింది. ఆయా చర్యల ఫలితంగా చమురు, గ్యాస్ సబ్సిడీలు 2022తో పోలిస్తే 2023లో 63 శాతం పెరిగాయి. అయితే, 2023లో మొత్తం ఇంధన సబ్సిడీలలో బొగ్గు, చమురు, గ్యాస్ సబ్సిడీలు దాదాపు 40 శాతం కాగా, కాలుష్య రహిత ఇంధన వనరుల (క్లీన్ ఎనర్జీ)కు సబ్సిడీలు 10 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. మిగిలిన సబ్సిడీలలో ఎక్కువ భాగం విద్యుత్ వినియోగానికీ, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినవీ ఉన్నాయి. ఇదే కాలంలో బొగ్గు సబ్సిడీలు కూడా 17 శాతం పెరిగాయి. మొత్తంగా క్లీన్ ఎనర్జీ సబ్సిడీల కంటే శిలాజ ఇంధన సబ్సిడీలు ఐదు రెట్లు ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రత్యక్ష బడ్జెట్ బదిలీల ద్వారా చమురు, గ్యాస్ రంగానికి గణనీయమైన మద్దతును అందించింది. ఈ కాలంలో, మొత్తం చమురు – గ్యాస్ సబ్సిడీలు కనీసం రూ.70,692 కోట్లకు పెరి గాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ సబ్సిడీల కారణంగా వరి, గోధుమలు, మక్కలు, చెరుకు వంటి ఆహార సంబంధిత ఉత్పత్తుల నుంచి ఇంధనాన్ని ఉత్పత్తి చేయ డానికి చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఒకవైపు ఆహార భద్రత సాధించటానికీ, ఆకలి తగ్గించడానికీ వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం... ఇంకొక వైపు సబ్సిడీలు ఇచ్చి అదే ఆహార పంటలను ఇతరత్రా ఉపయోగాలకు మళ్ళిస్తోంది. ఇందువల్ల కలిగే దీర్ఘకాలిక దుష్ప్రభావం ఊహించలేని విధంగా ఉండవచ్చు. 2020 ఆర్థిక సంవత్సరంలో, కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి మొత్తం ఇంధన ఆదాయం రూ. 6,99,565 కోట్లుగా అంచనా. ఇది మొత్తం ప్రభుత్వ ఆదాయంలో దాదాపు 17 శాతం. ఇంధన వనరుల నుంచి వచ్చే ఆదా యంలో ఎక్కువ భాగం (83శాతం) చమురు, గ్యాస్ నుండి వస్తోంది. పునరుత్పాదక ఇంధనం నుంచి 1 శాతం కంటే తక్కువే వస్తోంది. ఈ ఆదాయం కూడా ఎక్కువగా కేవలం రెండు పన్నుల నుండి వస్తోంది: కేంద్ర ఇంధన ఎక్సైజ్, రాష్ట్ర స్థాయి వ్యాట్. శిలాజ ఇంధన శక్తి వనరుల వల్ల ఆదాయం 2030 నాటికి అదనంగా రూ. 30 వేల కోట్ల నుంచి రూ. 3,40,000 కోట్లకు పెరగవచ్చు అని అంచనా వేస్తున్నారు. ఈ ఆదాయం కోల్పోవటానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. క్రమంగా ఈ ఆదాయం మీద ఆధార పడటం తగ్గించడానికి కూడా సుముఖంగా లేవు. అయితే శిలాజ ఇంధనాల వల్ల ఆదాయం మాత్రమే కాదు భారం కూడా ఉంటుంది. ఇంధనాల ధరలో ప్రతిబింబించని ఖర్చుల భారం చాల ఎక్కువ. ఒక అంచనా ప్రకారం ఈ భారం ప్రభుత్వ ఆదాయానికి ఐదు రెట్లు ఎక్కువ. ఈ భారం రకరకాలుగా ఉంటుంది. ప్రధానంగా నీరు, గాలి, ఇతర ప్రకృతి వనరుల కాలుష్యం వల్ల కలిగే మరణాలు, అనారోగ్య సమస్యలు, వాటిని అధిగమించడానికి కల్పించవలసిన మౌలిక సదుపాయాల రూపంలో ఈ భారాన్ని చూడవచ్చు. అందుకే కాలుష్య రహిత ఇంధన (క్లీన్ ఎనర్జీ) ఉత్పత్తులు పెంచడానికి చర్యలు తీసుకోవాలని అనేక అంతర్జాతీయ సంస్థలు అంటున్నాయి. ప్రపంచ వాతా వరణ సదస్సులలో కాలుష్య రహిత ఇంధనాల వైపు ఉత్పత్తి, వినియోగ రంగాలు మారాలని ఎప్పటి నుంచో ఒత్తిడి ఉంది. ‘గ్లాస్గో కాప్ 26’ సదస్సులో బొగ్గు ఆధా రిత విద్యుత్, ఇతర ఇంధన ఉపయోగాలను క్రమంగా తగ్గించాలని పెట్టిన ముసాయిదా తీర్మానాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. కేవలం బొగ్గు కాకుండా అన్ని రకాల శిలాజ ఇంధనాల ఉపయోగం క్రమంగా తగ్గించాలని వాదించింది. దుబాయి కాప్ 28 సదస్సులో ఈ దిశగా అన్ని రకాల శిలాజ ఇంధనాలను దశల వారీగా తగ్గించాలనే తీర్మానం దాదాపు ఖరారు అయినా సర్వామోదం పొందలేదు. పెరుగుతున్న కర్బన కాలుష్యం కారణంగా భూమి ఉష్ణోగ్రతలు పెరిగి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తు న్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకర శిలాజ ఇంధ నాలపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా వాటికి రాయితీలు తగ్గించాలి. అది సాధ్యం కావాలంటే సమూల ఆర్థిక పరివర్తనం అవసరం. ఈ దిశగా చర్యలు తీసుకోవాలి. క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తే ఆర్థిక వృద్ధి సుస్థిరం అవుతుంది. శిలాజ ఇంధన దిగుమతుల మీద ఆధారపడిన ఆర్థిక అభివృద్ధి సుస్థిరం ఎప్పటికీ కాలేదు. ప్రకృతిని కలుషితం చేస్తూ అభివృద్ధి దిశగా పయనించడం దుర్భరంగా ఉంటుంది. అందుకే కర్బన కాలుష్యాన్ని తగ్గించడం ద్వారా అవసరమైన వాతా వరణ లక్ష్యాలను చేరుకోవడం కోసం ఒక ఆచరణాత్మక దృష్టి అవసరం. ప్రభుత్వం శిలాజ ఇంధన పన్ను ఆదా యంలో కొంత భాగాన్ని కొత్త కాలుష్య రహిత శక్తి వనరుల వైపు మళ్ళించాలి. సుస్థిర అభివృద్ధికీ, సమాన ఫలాలు అందరికీ అందించే ఆర్థిక వ్యవస్థకూ ఇంధనాల కూర్పు చాల కీలకం. డా‘‘ దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
పెట్రోల్, డీజిల్‌పై రూ.2 తగ్గింపు
న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రానుండగా పెట్రోల్, డీజిల్ ధర లీటరుకు రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ సంస్థలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి రానున్నాయని కేంద్ర చమురు శాఖ గురువారం సాయంత్రం తెలిపింది. ధర తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.96.72 నుంచి రూ.94.72కు, డీజిల్ ధర రూ.89.62 నుంచి 87.62కు రానుంది. వారం క్రితమే కేంద్రం వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.100 మేర తగ్గించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇలా.. స్థానిక, అమ్మకం పన్నులు కలిపి రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.2.70, డీజిల్ ధర రూ. 2.54 మేర తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో రూ.109.66గా ఉన్న పెట్రోల్ ధర రూ.106.96కు తగ్గనుండగా, డీజిల్ ధర రూ.97.82 నుంచి రూ. 95.28కు తగ్గనుంది. -
వాహనదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
లోక్‌సభ 2024 ఎన్నికల వేళ వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల మీద ఏకంగా రూ. 2 తగ్గింపు ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. కొత్త ధరలు మార్చి 15, ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తుంది. పెట్రోలు, డీజిల్ ధరలను రూ. 2 తగ్గించడం ద్వారా దేశంలోని కోట్లాది మంది భారతీయుల సంక్షేమం, సౌలభ్యమే తన లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించుకున్నారని మంత్రి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో తగ్గింపు నగరాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రస్తుతం 89.62 రూపాయలున్న లీటరు డీజిల్ రేపటి నుంచి రూ. 87.62లకు విక్రయిస్తారని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశ రాజధానిలో 96.72 రూపాయలుగా ఉన్న లీటరు పెట్రోల్ రేపటి నుంచి రూ. 94.72 కి లభిస్తుంది. पेट्रोल और डीज़ल के दाम ₹2 रुपये कम करके देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi जी ने एक बार फिर साबित कर दिया कि करोड़ों भारतीयों के अपने परिवार का हित और सुविधा सदैव उनका लक्ष्य है। वसुधा का नेता कौन हुआ? भूखण्ड-विजेता कौन हुआ? अतुलित यश क्रेता कौन हुआ? नव-धर्म… https://t.co/WFqoTFnntd pic.twitter.com/vOh9QcY26C — Hardeep Singh Puri (मोदी का परिवार) (@HardeepSPuri) March 14, 2024 -
కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనే తగ్గిన పెట్రో ధరలు
ముడిచమురు ధరలు పెరుగుతున్నప్పటికీ నేడు(సోమవారం)బీహార్, యూపీలలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర 84 డాలర్లను దాటేసింది. సోమవారం ఉదయం దేశీయ ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేసిన పెట్రోల్, డీజిల్ ధరల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఈరోజు యూపీ, బీహార్లలో చమురు చౌకగా మారింది. ప్రభుత్వ చమురు సంస్థలు అందించిన వివరాల ప్రకారం నోయిడాలో పెట్రోల్ ధర 17 పైసలు తగ్గి లీటరు రూ. 96.59కు చేరింది. డీజిల్ కూడా 17 పైసలు తగ్గి రూ. 89.76కి చేరుకుంది. బీహార్ రాజధాని పాట్నాలో పెట్రోల్ ధర తగ్గింది. ఇక్కడ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గి, లీటరు రూ. 107.48కి విక్రయిస్తున్నారు. డీజిల్ కూడా లీటరుకు 10 పైసలు తగ్గి రూ.94.26కి చేరుకుంది. హర్యానా రాజధాని గురుగ్రామ్‌లో ఈరోజు పెట్రోలు ధర 29 పైసలు పెరిగి లీటరుకు రూ. 97.10కి చేరగా, డీజిల్ ధర 27 పైసలు పెరిగి రూ. 89.96కి చేరింది. గ్లోబల్ మార్కెట్లో సోమవారం ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 84.18 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యుటిఐ రేటు బ్యారెల్‌కు 78.60 డాలర్లకు చేరింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలు మారుతుంటాయి. కొత్త రేట్లు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ మొదలైనవి జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపవుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా మారడానికి ఇదే కారణంగా నిలుస్తోంది. కాగా బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడగానే చమురు ధరలు తగ్గడం శుభపరిణామంగా ఆ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!
Medigadda Barrage: గత సర్కారే కారణం!
మనసున్న ముఖ్యమంత్రి జగన్
ప్రచార వాహనాల అడ్డగింత
ఈవీఎంల కమిషనింగ్ కీలకం
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
తప్పక చదవండి
- కాంగ్రెస్, ఎస్పీ రామ ద్రోహ పార్టీలు: యోగి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement