-
కొడుక్కు తుపాకీ అందుబాటులో ఉంచారని... తల్లిదండ్రులకు 15 ఏళ్ల జైలు
వాషింగ్టన్: కొడుకు చేసిన నేరానికి తల్లిదండ్రులకు శిక్ష విధించిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. స్కూల్లో తుపాకీతో కాల్పులు జరిపిన నలుగురు పిల్లలను బలి తీసుకోవడంతో పాటు ఏడుగురిని గాయపర్చిన బాలుడి తల్లిదండ్రులకు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇంట్లో బాలుడికి తుపాకీ అందుబాటులో ఉండేలా పెట్టడమే వారి నేరమని నిర్ధారించింది. 2021 నవంబర్ 30న మిషిగన్ రాష్ట్రంలోని ఆక్స్ఫర్డ్ హైసూ్కల్లో ఎథాన్ క్రంబ్లీ అనే పిల్లాడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అతని మానసిక ఆరోగ్యం సరిగా లేదని తేలింది. అలాంటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సింది పోయి తుపాకీ అందుబాటులో ఉంచడం తల్లిదండ్రులు జేమ్స్, జెన్నిఫర్ తప్పేనని కోర్టు తేల్చింది. -
'వాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకోను'.. విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్!
ఫ్యామిలీ స్టార్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం తన మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ దేవరకొండ తన పెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'పెళ్లి విషయంలో ఎప్పటి నుంచో క్లారిటీ ఉంది. అమ్మా, నాన్నకు నచ్చకుండా ఏం చేయను. వాళ్లకు నచ్చాలి. అలాగే వాళ్లకు నచ్చేటట్లు ఒప్పించాలి. ఆ బాధ్యత అంతా మనమే చూసుకోవాలి. మొత్తం అలా వదిలేయలేం కదా. పెళ్లి చేసుకున్న తర్వాత రాబోయే 30 ఏళ్లు మనం బతకాలి కదా. అన్ని కేర్‌ఫుల్‌గా చేసుకుని వాళ్లకు నచ్చేటట్టు చేసుకోవాల్సింది మనమే. సో దానికి ఇంకా చాలా టైముంది. అని అన్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన పెళ్లి గురించి చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. కాగా.. చాలాసార్లు నేషనల్ క్రష్ రష్మిక, విజయ్ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. -
ఆలోచించండి ఓ అమ్మానాన్న.. ఈసీ వినూత్న ప్రయత్నం
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల గురించి ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థులు త్వరలో తమ తల్లిదండ్రులకు లేఖలు రాయబోతున్నారు. "నా భవిష్యత్తు దేశంలోని బలమైన ప్రజాస్వామ్యంతో ముడిపడి ఉంది. దీని కోసం ఓటరు జాబితాలో మీ పేర్లను తప్పకుండా చూసుకుని రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసే ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరుకుంటున్నాను" అని పిల్లలు తమ తల్లిదండ్రులను కోరనున్నారు. జాతీయ సగటుతో సమానంగా రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం చొరవతో ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా జిల్లా యంత్రాంగం, విద్యా శాఖల సహకారంతో కృషి చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) చొరవలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఉత్తరప్రదేశ్‌లోని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు లేఖలు రాయడంలో సహాయం కోరుతూ డైరెక్టర్ జనరల్ (పాఠశాల విద్య)కి లేఖ రాసింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో కుటుంబంలోని అర్హులైన సభ్యులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని పిల్లలు ఇచ్చే "ప్రతిజ్ఞ లేఖ"పై తల్లిదండ్రులు సంతకం చేయాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ సగటు జాతీయ సగటు కంటే చాలా తక్కువగా నమోదవుతూ వస్తోంది. 2019లో జాతీయ సగటు 67.4 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 59.21 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 2014లో దేశ సగటు 66.44 శాతం ఉండగా ఉత్తరప్రదేశ్‌లో 58.44 శాతం ఓటింగ్ నమోదైంది. -
అమ్మా, నాన్న ఆనంద విహారం
ఇన్స్టాగ్రామ్ యూజర్ వివేక్ వాఘ్ సర్ప్రైజ్ ట్రావెల్ ప్లాన్‌తో తల్లిదండ్రులను ఆశ్చర్యానందాలకు గురి చేశాడు. ‘ఫ్లైయిట్‌లో మనం జైపూర్‌కు వెళుతున్నాం’ అని చెప్పి తల్లిదండ్రులను ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లాడు. పాస్‌పోర్ట్‌లను వారి చేతికి అందిస్తూ ఆఖరులో అసలు విషయం చెప్పాడు. తాము వెళుతున్నది జైపూర్ కాదని సింగపూర్‌కు అని తెలుసుకున్న వివేక్ తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఇది వారికి తొలి అంతర్జాతీయ ప్రయాణం. ‘సీ దెయిర్ రియాక్షన్... సర్ప్రైజ్ ట్రిప్’ కాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియో మూడు లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. సోషల్ మీడియా యూజర్లు, సెలబ్రిటీలు ఈ వీడియోను చూసి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యాక్టర్ జై భానుశాలి ‘ప్రౌడ్ సన్. విషయం తెలిసిన తరువాత మీ తండ్రి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాకు ఎంతగానో నచ్చింది. మా అబ్బాయి మమ్మల్ని సింగపూర్ తీసుకువెళ్లాడు అని ఆయన గర్వంగా స్నేహితులతో చెప్పుకోవచ్చు’ అని కామెంట్ పెట్టారు. -
హ్యాపీ... హ్యాపీ
‘పేరెంట్స్‌గా ఎప్పుడు ప్రమోట్ అవుతారు?’ అనే ప్రశ్నకు పెళ్లయినప్పట్నుంచి చిరునవ్వే సమాధానంగా ఇస్తూ వచ్చారు రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్. ఫైనల్‌గా తాము తల్లిదండ్రులు కానున్నట్లు ఈ భార్యాభర్తలు గురువారం ఇన్‌స్టా వేదికగా వెల్లడించారు. సెప్టెం బర్లో డెలివరీ డేట్ ఇచ్చినట్లు దీపిక పేర్కొన్నారు. ఈ హ్యాపీ న్యూస్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగానే పలువురు ప్రముఖులు రణ్వీర్–దీపికలకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు షేర్ చేశారు. ఇక 2013లో ‘రామ్‌లీల’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు రణ్వీర్, దీపిక. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందట. ఆ తర్వాత ‘పద్మావత్’ కోసం రణ్వీర్–దీపిక కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో విడుదల కాగా, అదే ఏడాది నవంబరులో రణ్వీర్, దీపిక ఇటలీలో పెళ్లి చేసుకున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్‌కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement