breaking news
obstructing the field
-
ఏమిటీ ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’.. ఎంతమంది ఔటయ్యారంటే?
క్రికెట్ చరిత్రలో ‘అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్’ అనేది చాలా పాత రూల్. ఈ నిబంధన ఎప్పటి నుంచో అమల్లో ఉంది. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో కేకేఆర్, లక్నో సూపర్‌జెయింట్స్ మధ్య మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔట్ కావడంతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. మరి అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ అంటే ఏమిటీ? అంతర్జాతీయ క్రికెట్లో దీనికున్న రూల్ ఏంటి? ఇప్పటివరకు ఎంతమంది క్రికెటర్లు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యారనేది ఇప్పుడు తెలుసుకుందాం.అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ అంటే?క్రికెట్ చట్టాలను రూపొందించే ఎంసీసీ చట్టాల్లో అబ్‌స్ట్రాకింగ్ ది ఫీల్డ్ అనే నిబంధన ఉంది. 37.2 నిబంధన ప్రకారం ఓ బ్యాటర్ ఉద్దేశపూర్వంగా తన వికెట్ కాపాడుకోవడానికి బంతిని చేతితో అడ్డుకున్నట్లయితే దాన్ని అబ్‌స్ట్రాకింగ్ ది ఫీల్డ్ గా కింద పరిగణిస్తూ బ్యాటర్‌ను ఔట్‌గా ప్రకటిస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు ఇలా 11 మంది ఆటగాళ్లు ఔట్ అయ్యారు. ఈ జాబితాలో ముష్ఫీకర్ రహీం 11వ ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. టెస్టు క్రికెట్లో మాత్రం ఇద్దరే ఇలా పెవిలియన్‌కు చేరుకున్నారు. వీరిలో రహీం రెండవ ఆటగాడు కాగా.. 1951లో ఇంగ్లాండ్‌కు చెందిన లియోనార్డ్ హటన్ మొదటి ప్లేయర్. భారత క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్క ఆటగాడు అబ్‌స్ట్రాకింగ్ ది ఫీల్డ్ కింద ఔట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మొహిందర్ అమర్నాథ్ ఇలా ఔట్ అయ్యాడు.అంతర్జాతీయ క్రికెట్లో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ గా ఔటైన ఆటగాళ్లు..రస్సెల్ ఎండీన్, ఆండ్రూ హిల్డిచ్, మొహ్సిన్ ఖాన్, డెస్మండ్ హేన్స్, మొహిందర్ అమర్నాథ్, గ్రాహం గూచ్, డారిల్ కల్లినన్, స్టీవ్ వా, మైఖేల్ వాఘన్, చము చిభాభా, ముష్ఫికర్ రహీమ్.ఐపీఎల్లో నాలుగుసార్లు..ఇక ఐపీఎల్ విషయానికొస్తే ఇప్పటివరకు జరిగిన 19 సీజన్లలో నలుగురు ఆటగాళ్లు అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యారు. ఈ జాబితాలో యూసఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా ఉండగా.. తాజాగా అంగ్క్రిష్ రఘువంశీ చేరాడు.యూసఫ్ పఠాన్ఐపీఎల్లో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వెనుదిరిగిన తొలి ఆటగాడిగా ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్ నిలిచాడు. 2013 సీజన్లో రైజింగ్ పుణే వారియర్స్‌తో కేకేఆర్ తలపడింది. కేకేఆర్ ఇన్నింగ్స్ సమయంలో 72 పరుగులతో ఆడుతున్న యూసఫ్ పఠాన్ బౌలర్ స్ట్రైకింగ్ ఎండ్‌వైపు విసిరిన బంతికి అడ్డువచ్చాడు. దీంతో ఉద్దేశపూర్వకంగానే బంతికి అడ్డువచ్చినట్లు పుణే ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో అంపైర్ ఔటిచ్చాడు.అమిత్ మిశ్రా2019 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ షా ఎస్ఆర్హెచ్తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద వెనుదిరిగాడు. బౌలర్ వేసిన బంతిని ఎడ్జ్ తీసుకొని సింగిల్ కోసం పిచ్ మధ్యలో పరిగెత్తాడు. అయితే బంతిని తీసుకున్న కీపర్ నాన్‌స్ట్రైక్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు.కానీ అమిత్ మిశ్రా బంతికి అడ్డంగా వెళ్లడంతో అంపైర్ ఔట్ ఇవ్వక తప్పలేదు.రవీంద్ర జడేజా2024 సీజన్లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సీఎస్కే బ్యాటర్ రవీంద్ర జడేజా రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పరుగు వద్దని వారించడంతో జడేజా వెనక్కి పరిగెత్తే క్రమంలో తన దిశను మార్చుకున్నాడు. అప్పటికే బంతిని అందుకున్న కీపర్ శాంసన్ బంతిని విసరడం, అదే సమయంలో జడేజా అడ్డు రావడంతో అంపైర్ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటిచ్చాడు.అంగ్క్రిష్ రఘువంశీతాజాగా 2026 సీజన్లో కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ ఇదే తరహాలో ఔటయ్యాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 5వ ఓవర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి రఘువంశీ మిడ్-ఆన్ వైపు షాట్ ఆడి సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే మిడ్ ఆన్‌లో ఉన్న మహ్మద్ షమీ బంతిని వేగంగా అందుకోవడంతో.. రఘువంశీ సగం దూరం వెళ్ళాక మళ్ళీ వెనక్కి వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే వెనక్కి వెళ్లే క్రమంలో షమీ త్రో చేసిన బంతి రఘువంశీ కాలికి తగిలి వికెట్ కీపర్ పంత్ చేతికి వెళ్లలేదు. అయితే రఘువంశీ కావాలనే తన దారిని మార్చుకుని వెనక్కి పరిగెత్తాడని పంత్ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్‌కు అప్పీల్ చేశాడు. దీంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. చాలా సేపు రీప్లేలను పరిశీలించిన టీవీ అంపైర్.. రఘువంశీ కావాలనే ఫీల్డర్ విసిరిన బంతికి అడ్డుపడ్డాడని నిర్ధారించారు. దీంతో ఆర్టికల్ 37 ప్రకారం అతడిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద అవుట్‌గా ప్రకటించారు.𝗜.𝗖.𝗬.𝗠.𝗜A rare dismissal as Angkrish Raghuvanshi was given out 𝗼𝗯𝘀𝘁𝗿𝘂𝗰𝘁𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗳𝗶𝗲𝗹𝗱 😮WATCH how it all unfolded ▶️ https://t.co/uNqNFhXhoL#TATAIPL | #KhelBindaas | #LSGvKKR pic.twitter.com/tvKuRe4x5S— IndianPremierLeague (@IPL) April 26, 2026చదవండి: ‘నేను చాలా మారాను.. మునుపటి పాండ్యాను కాను’ -
అంగ్క్రిష్ రఘువంశీపై కఠిన చర్యలు
కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీపై ఐపీఎల్ పాలక మండలి కఠిన చర్యలు తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో మ్యాచ్ ఫీజులో కోత విధించింది. ఐపీఎల్-2026లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఏకనా స్టేడియంలో లక్నో- కోల్‌కతా జట్లు తలపడ్డాయి. అనూహ్య రనౌట్ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య లక్నో తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కోల్‌కతా బ్యాటింగ్‌కు దిగింది. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) ఆదిలోనే చెలరేగి ఓపెనర్లు టిమ్ సీఫర్ట్ (0), అజింక్య రహానే (10) వికెట్లు కూల్చాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన అంగ్క్రిష్ రఘువంశీ అనూహ్యంగా రనౌటయ్యాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతిని మిడాఫ్ దిశగా ఆడిన రఘువంశీ సింగిల్ కోసం ముందుకొచ్చాడు.అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్అయితే మరో ఎండ్‌లో ఉన్న కామెరాన్ గ్రీన్ నిరాకరించడంతో వెనుదిరిగాడు. ఈ క్రమంలో మిడాఫ్ దగ్గర బంతి అందుకున్న మహ్మద్ షమీ వికెట్ల వైపు విసిరాడు. ఆ బాల్ కాస్త రఘువంశీకి తాకగా... లక్నో జట్టు ‘అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’ కోసం అప్పీల్ చేసింది.KKR ತಂಡಕ್ಕಂತೂ ಇದು ನಿಜಕ್ಕೂ ನುಂಗಲಾರದ ತುತ್ತು! 'Obstruction of Field' ಅಂತ Raghuvanshi ಗೆ ಔಟ್ ಕೊಡಲಾಗಿದೆ.☝️ ನಿಮ್ಮ ಪ್ರಕಾರ ಇದು Out? ಅಥವಾ Not Out? 👀 ವೀಕ್ಷಿಸಿ | #TATAIPL2026 👉 #LSGvsKKR | LIVE NOW | ನಿಮ್ಮ Star Sports ಕನ್ನಡ & JioHotstar ನಲ್ಲಿ.#TATAIPL #AngkrishRaghuvanshi pic.twitter.com/cPsuy1J2p7— Star Sports Kannada (@StarSportsKan) April 26, 2026తీవ్ర అసంతృప్తిదీంతో పలుమార్లు రీప్లేను పరిశీలించిన థర్డ్ అంపైర్... రఘువంశీ దిశ మార్చుకున్నాడని నిర్ధారించి అతడిని అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై రఘువంశీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోపంగా మైదానాన్ని వీడాడు. హెల్మెట్‌ను విసిరేసి అసంతృప్తి వెళ్లగక్కాడు.జరిమానాతో పాటు..ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలక మండలి చర్యలకు దిగింది. ‘‘ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ పరికరాలు, క్లాతింగ్ తదితర వస్తువులకు హాని కలిగించకూడదు. లక్నోతో మ్యాచ్ సందర్భంగా రఘువంశీ ఈ నిబంధనను ఉల్లంఘించాడు.అందుకే అతడి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డిమెరిట్ పాయింట్ కూడా జత చేస్తున్నాం’’ అని ప్రకటన విడుదల చేసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా- లక్నో జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సరిసమానంగా చెరో 155 పరుగులు చేశాయి. ఈ క్రమంలో సూపర్ ఓవర్ నిర్వహించగా.. కోల్‌కతా విజయం సాధించింది.చదవండి: LSG Vs KKR: నరాలు తెగే ఉత్కంఠ!.. ఫామ్‌లో లేకున్నా అందుకే అతడిని పంపించాం


