దేశ భక్తి, సంస్కతి పరిరక్షణలో యువత ముందుండాలి..
దేశ భక్తి, సంస్కతి పరిరక్షణ, జాతీయ చైతన్యం అంశాల్లో యువత ముందుండాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. భారతీయ సంస్కతిని, దేశ భక్తి విలువలను ప్రతిభింభించే విధంగా శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ ఆధ్వర్యంలో రూపొందించిన లఘు చిత్రం అభినవ్ పలువురి మన్ననలు అందుకున్న నేపథ్యంలో సంస్థ ప్రతినిధి భీమగాని సుధాకర్‌గౌడ్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.ఫిలింనగర్‌లోని ఫిలించాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్‌గౌడ్ దేశ భక్తిపై రూపొందించిన అభినవ్ లఘు చిత్రాన్ని వీక్షించారు. జాతీయ లఘు చిత్ర పోటీల్లో ఈ లఘు చిత్రం జాతీయ లఘు చిత్ర పోటీల్లో పాల్గొని పలువురి ప్రశంసలు అందుకున్నది. ఇటువంటి చిత్రాలు సమాజానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ నిర్వాహకులను కొనియాడారు.