-
సెలూన్ వ్యాపారంలోకి రిలయన్స్!
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లోకి వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇప్పుడు సెలూన్ వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తోంది. గ్రూప్ సంస్థ, దేశీయంగా అతి పెద్ద రిటైలింగ్ కంపెనీ అయిన రిలయన్స్ రిటైల్ తాజాగా చెన్నైకి చెందిన నేచురల్స్ సెలూన్ అండ్ స్పాలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయడంపై దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి నేచురల్స్ ప్రమోటర్లతో చర్చలు జరుపుతోంది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించబోతున్నది మాత్రం వెల్లడి కాలేదు. తమ కంపెనీ చరిత్రలోనే ఇది ‘అతి పెద్ద మలుపు‘ అంటూ నేచురల్స్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సీకే కుమరవేల్ .. లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు. ‘ఒక బహుళజాతి దిగ్గజం సెలూన్ పరిశ్రమలోకి ప్రవేశించబోతోంది’ అని పేర్కొన్నారు. ‘నేచురల్స్‌లో రిలయన్స్ రిటైల్ 49 శాతం వాటా కొనబోతోంది. దీనితో సెలూన్ల సంఖ్య మొత్తం 700 నుండి 4–5 రెట్లు వృద్ధి చెందనుంది. రాబోయే రోజుల్లో నేచురల్స్‌లో గణనీయమైన మార్పులు చూడబోతున్నాం’ అని కుమరవేల్ పోస్ట్ చేశారు. నేచురల్స్ కార్యకలాపాల విస్తరణలో సహాయపడిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, నేచురల్స్‌లో వాటాల కొనుగోలు వార్తలపై స్పందించిన రిలయన్స్ ప్రతినిధి .. తాము ఎప్పటికప్పుడు వివిధ అవకాశాలను పరిశీలిస్తూ ఉంటామని పేర్కొన్నారు. ఈ డీల్ పూర్తయితే లాక్మే బ్రాండ్ పేరిట సెలూన్ సెగ్మెంట్లో కార్యకలాపాలు సాగిస్తున్న హిందుస్తాన్ యూనిలీవర్ వంటి దిగ్గజాలతో రిలయన్స్ రిటైల్ పోటీపడనుంది. 2000ల తొలినాళ్లలో కార్యకలాపాలు ప్రారంభించిన నేచురల్స్‌కు దేశవ్యాప్తంగా 700 సెలూన్లు ఉన్నాయి. 2025 నాటికి వీటి సంఖ్యను 3,000కు పెంచుకోవాలని యోచిస్తోంది. ఇక రిలయన్స్ గ్రూప్‌లో అన్ని రిటైల్ కంపెనీలకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) హోల్డింగ్ కంపెనీగా ఉంది. దీనికి రిలయన్స్ రిటైల్ అనుబంధ సంస్థ. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్ఆర్వీఎల్ రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్ (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) నమోదు చేసింది. రిలయన్స్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కేవీ కామత్ ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్‌ను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం ప్రకటించింది. 74 సంవత్సరాల కామత్‌ను ఐదేళ్ల కాలానికి నియమించినట్లు సంస్థ స్టాక్ ఎక్సే్ఛంజ్‌కి సమర్పించిన ఫైలింగ్‌లో తెలిపింది. 1971లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్, పద్మభూషణ్ కామత్‌కు బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల పదవీ విరమణ చేసిన రిలయన్స్ బోర్డులోని ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లలో ఒకరి స్థానంలో కామత్ నియమితులయ్యారు. -
నేచురల్ బ్యూటీ
అందానికే అందంలా... ముద్దుకే ముద్దొచ్చేలా... లంగా ఓణీలో పుత్తడి బొమ్మలా మురిపించింది ముద్దుగుమ్మ శ్రద్ధాదాస్. బంజారాహిల్స్‌లో ఆదివారం నేచురల్స్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభోత్సవంలో వయ్యారాల సింగారాలతో మతిపోగొట్టింది. ఓర చూపులు విసురుతూ... చిరునవ్వులు రువ్వుతూ... చుట్టూ ఉన్నవారిని ఇదిగో... ఇలా కళ్లు తిప్పుకోలేనంతగా మెస్మరైజ్ చేసేసింది. అందానికి మెరుగులద్దేది మగువలు మాత్రమే కాదని.. మగవారిలోనూ బ్యూటీ కేర్ పెరిగిందని చెప్పిందీ చిలిపి కళ్ల చిన్నది! సాక్షి, సిటీప్లస్, ఫొటో: ఠాకూర్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు
ఫ్రీగా సినిమా టికెట్లు.. ఓటేసినందుకు కాదు! మరి...
'ప్రసన్నవదనం' బ్యూటీ చాలా ఘాటు గురూ.. రాశి సింగ్ (ఫొటోలు)
ఈ సమ్మర్ సీజన్లో.. నేరుగా 'చల్లని పెరుగుతోనే వెరైటీ కర్రీలు'!
వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్
ఆ విషయం తెలిశాక ఖుష్బు తట్టుకోలేకపోయింది: సుందర్
బిగ్ క్వశ్చన్: వాలంటీర్లపై కక్ష..అవ్వాతాతలకు శిక్ష
శంషాబాద్: ఆపరేషన్ చిరుత సక్సెస్
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్‌లో మాత్రం..
‘శబరి’ మూవీ రివ్యూ
తప్పక చదవండి
- Hari Prasad: పట్టుదలతో 'క్లైమెట్ యాక్షన్' వైపు పచ్చటి అడుగు..
- నాకు నేనే సవాల్‌గా మారా: స్టార్ హీరోయిన్
- సెలబ్రిటీలతో ఎయిర్‌బీఎన్‌బీ జట్టు..
- మోసాల బాబు మరో అబద్ధం..
- మోసాల బాబు మరో అబద్ధం..
- Israel-Hamas war: కాలిఫోర్నియా వర్సిటీలోకి పోలీసులు
- ఉద్యోగుల ఫ్రెండ్లీ సీఎం
- ‘పంపుసెట్ల’నూ కాపీ కొట్టేసిన బాబు!
- Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
- భువనగిరి ఖిలాపై ఏ జెండా ఎగిరేనో?
Advertisement