Monkey baby
-
అమ్మ కావాలి...
అమ్మ కావాలి... ఎప్పుడూ కావాలి... ఎల్లప్పుడూ కావాలి... పగలు ఆకలేసినా... నిద్ర నిద్ర కమ్ముకున్నా అమ్మ కావాలి. అమ్మ ఎత్తుకొని తిప్పాలి. తల నిమరాలి. బువ్వ పెట్టాలి. ముద్దు చేయాలి. దిష్టి తియాలి. మురిసిపోవాలి. ‘నా బంగారు కన్నా’... ‘చిన్ని నాన్నా’ అని గారాలు చేయాలి. అమ్మ ఆయువు పోయాలి. ఊపిరులూదాలి. పెంచాలి. గుండెకు హత్తుకుని నేనున్నా అని భరోసా ఇవ్వాలి.మరి అమ్మ లేకపోతే. కనపడకుండా పోతే. ఎక్కడికి వెళ్లిందో తెలియకపోతే.పసిబిడ్డకే కాదు... నోరు లేని జీవికి కూడా ఆ బాధ చాలా పెద్ద బాధ.ఇక్కడ చూడండి. ఈ కోతి పిల్ల పేరు పుంచ్. ఈ పిల్ల తల్లి ఇది పుట్టిన వెంటనే వదిలేసి పోయింది. ఆ తల్లి బంధాన్ని తెంపుకుని పోయింది గానీ పిల్లకు తల్లి మరపుకు రాదే. పదే పదే తల్లి కావాలనిపిస్తుంది. తల్లిని తలుచుకుని ఉలికులికి పడి నిద్ర లేస్తూనే ఉంటుందే.పుంచ్కు ఇప్పుడు ఏడు నెలల వయసు. జపాన్లోని ఇచికావా సిటీ జూలో ఉంటోంది. అమ్మ కోసం అది పడే బాధను చూసి జూ అధికారులు దానికో ఉరాంగుటాన్ బొమ్మను ఇచ్చారు.దానికి ఆ బొమ్మే అమ్మ. దాని కన్నీరు ఆ బొమ్మకు తెలియదు. అమ్మకే తెలియనప్పుడు... బొమ్మకేం తెలుస్తుంది? -
ఒడిలో పడుకోబెట్టుకుని తల్లిలా ఓదార్చిన ‘కోతి’.. నెటిజన్లు ఫిదా!
బాధలో ఉన్న వ్యక్తిని ఎవరైనా దగ్గరకు తీసుకుని ఓదార్చితే మనసుకు ఎంతో హాయినిస్తుంది. మనకుంటూ ఒకరు ఉన్నారనే భావన కలుగుతుంది. అలాంటిది ఓ మనిషిని మూగజీవాలు అక్కున చేర్చుకుంటే ఆ దృశ్యం హృదయాన్ని కదిలిస్తుంది. అలాంటి పనే చేసి ఔరా అనిపించింది ఓ వానరం. బాధతో తలపట్టుకున్న ఓ వ్యక్తిని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఓదార్చింది. హృదయాన్ని కదిలించే ఈ సంఘటనకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కోతి వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా.. వైరల్గా మారింది. అందులో.. లాగు, చొక్క ధరించిన ఓ కోతి సోఫాలో కూర్చుని ఉంటుంది. అక్కడికి ఓ వ్యక్తి ఒత్తిడిలో చికాకుపడుతూ తలపట్టుకుని వచ్చి వానరం పక్కన కూర్చున్నాడు. అది గమనించిన ఆ కోతి.. ఆ వ్యక్తిని పిలిచి తన ఒడిలో పడుకోవాలని సైగ చేస్తుంది. అతడు కోతి ఒడిలో తల వాల్చగా జోకొడుతూ చిన్న పిల్లలను నిద్రపుచ్చిన మాదిరిగా చేసింది. ఈ వీడియోను 30 లక్షల మందికిపైగా వీక్షించారు. కొందరు నెటిజన్లు ఆ వానరం తమకు కావాలంటూ కామెట్లు చేశారు. ‘ప్రస్తుతం నేను ఉన్న పరిస్థితులకు ఆ తెలివైన వానరం నాకు అవసరం’ అని రాసుకొచ్చారు ఓ నెటిజన్. 452- Ağlayan arkadaşını dizine yatırıp teselli eden maymun pic.twitter.com/gezl0NKX8g— 59.748 farklı hayvan (@59748hayvan) July 30, 2022 ఇదీ చదవండి: ఏంది బ్రో అది: మొసలిని దగ్గరికి తీశాడు, ఆపై ఊహించని రీతిలో.. -
ఎలా చెప్పం ‘తల్లీ’... నీ బిడ్డను తిరిగివ్వలేమని!!


