చైతూ మంచోడు
... సినిమా ఇండస్ట్రీలో ఈ మాట చాలామంది అంటారు. నిజమే.. తానో పెద్ద స్టార్ కొడుకుని అని, పెద్ద హీరోని అనే ఫీలింగ్ నాగచైతన్యకు ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటారు. ఇప్పుడు చైతూ మంచితనం గురించి చెప్పడానికి ఓ కారణం ఉంది. మారుతి దర్శకత్వంలో చైతూ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి ‘మంచోడు’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది డిసెంబరులో మొదలుపెట్టనున్నారట. ఈ సినిమాలో నాగచైతన్య సరసన ‘లై’ ఫేమ్ మేఘా ఆకాశ్‌ని కథానాయికగా తీసుకున్నారనే రూమర్లూ వినిపిస్తున్నాయి. ఈ వదంతుల్లో ఎంత నిజం ఉందో నిలకడగా తెలుస్తుంది.