breaking news
Graphic designing
-
‘సూపర్ హీరో’ సిసోడియా.. విద్యాశాఖ ముసుగులో లిక్కర్ మంత్రి!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణకు సోమవారం హాజరయ్యారు ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. ఈ క్రమంలో ఆయనకు మద్దతు తెలుపుతూ సిసోడియాను సూపర్ హీరోగా గ్రాఫిక్ చిత్రాన్ని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఎలాంటి క్యాప్షన్ లేనప్పటికీ.. తాను చెప్పాలనుకున్న అంశాన్ని గ్రాఫిక్ చిత్రంలో వివరించే ప్రయత్నం చేశారు. ఈ ఫోటోలో ‘ఢిల్లీ ఎడ్యుకేషనల్ మోడల్’ పేరుతో ఉన్న షీల్డ్‌ను పట్టుకున్నారు సిసోడియా. ఈడీ, సీబీఐ పేరుతో వచ్చే బాణాల నుంచి చదవుకుంటున్న ఓ చిన్నారిని రక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం కేజ్రీవాల్ ట్వీట్ వైరల్‌గా మారింది. pic.twitter.com/sPA4PwMllK — Arvind Kejriwal (@ArvindKejriwal) October 17, 2022 మరోవైపు.. కేజ్రీవాల్ ట్వీట్‌పై అదే స్టైల్లో గ్రాఫిక్ చిత్రంతో విమర్శలు గుప్పించింది బీజేపీ. మద్యం బాటిళ్లు, నగదు కట్టలను కాపాడేందుకు సిసోడియా తెరిచిన పుస్తకాన్ని షీల్డ్‌లా పట్టుకున్నట్లు అందులో చూపించింది బీజేపీ. ఈ ఫోటోను ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు సునీల్ యాదవ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో కేజ్రీవాల్ సైతం ఓ చేతిలో మద్యం బాటిల్, మరో చేతిలో ఎన్నికల గుర్తు చీపురు పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ‘విద్యాశాఖ ముసుగులో ఉన్న లిక్కర్ మంత్రి’ అంటూ రాసుకొచ్చారు సునీల్ యాదవ్. शराब मंत्री शिक्षा मंत्री की आड़ में https://t.co/pGDScU64zz pic.twitter.com/8CTOFvuU5S — Sunil Yadav (@SunilYadavBJP) October 17, 2022 ఇదీ చదవండి: తల్లి పాదాలను తాకి...సీబీఐ కార్యాలయానికి సిసోడియా! -
Adipurush: గ్రాఫిక్స్ ఓ రేంజ్లో ఉంటాయట!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. అంతర్జాతీయ చిత్రాల్లో వినియోగించే మోషన్ క్యాప్చర్ సాంకేతికతను ‘ఆదిపురుష్’ సినిమాలో ఉపయోగిస్తున్నట్లు ఆల్రెడీ ఈ చిత్రదర్శకుడు ఓం రౌత్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారట ఓం రౌత్. స్క్రీన్‌పై విజువల్ వండర్లా ఉండేలా గ్రాఫిక్స్‌ను డిజైన్ చేయించుకుంటున్నారట. ఈ సినిమాకు దాదాపు 6వేలకు పైగా సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) షాట్స్ అవసరమవుతున్నాయని బీ టౌన్ టాక్. సినిమా కనువిందుగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ‘ఆదిపురుష్’ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెల చివర్లో ముంబైలో తిరిగి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా, రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, సీత పాత్రలో కృతీ సనన్ కనిపించనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. -
వెలుగులీనే కెరీర్‌కు.. గ్రాఫిక్ డిజైనింగ్
అప్‌కమింగ్ కెరీర్: సృజనాత్మకత, కష్టపడే తత్వం ఉన్నవారికి సరిగ్గా సరిపోయే కెరీర్.. గ్రాఫిక్ డిజైనింగ్. నేటి ఆధునిక యుగంలో ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఏదైనా వస్తువు వినియోగదారుడిని ఆకట్టుకోవాలంటే.. అది ఆకర్షణీయంగా ఉండాలి. అందుకు ఏకైక మార్గం.. గ్రాఫిక్ డిజైనింగ్. నేడు అన్ని రంగాల్లో గ్రాఫిక్స్ అనివార్యంగా మారాయి. దీంతో నైపుణ్యం కలిగిన డిజైనర్లకు అధిక డిమాండ్ ఏర్పడింది. దేశ విదేశాల్లో వీరికి మంచి వేతనాలు అందుతున్నాయి. ఇందులోకి ప్రవేశించే యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అవసరానికి సరిపడ గ్రాఫిక్ డిజైనర్లు ప్రస్తుతం మనదేశంలో లేరని నిపుణులు చెబుతున్నారు. సృజనాత్మకతే ఏకైక సాధనం డిజైనర్లకు ప్రస్తుతం ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ సంస్థలు వీరిని నియమిస్తు న్నాయి. అడ్వర్టైజింగ్, ప్రొడక్ట్ డిజైన్, లోగో డిజైన్, వార్తా పత్రికలు, వెబ్సైట్లు, పోర్టళ్ల డిజైనింగ్ వంటి వాటిలో అవకాశాలున్నాయి. ప్యాకేజింగ్ సంస్థలు, డిజైన్ స్టూడియోల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. నగరాలతోపాటు ద్వితీయశ్రేణి పట్టణాల్లోనూ డిజైన్ స్టూడియోలు ఏర్పాటవుతున్నాయి. ఆసక్తి ఉంటే సొంతంగా ఒక స్టూడియోను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక సినిమాలు, టీవీ సీరియళ్లలో కూడా వీరికి సంతృప్తికరమైన వేతనాలతో ఆఫర్లు అందుతున్నాయి. గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలో కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే.. సృజనాత్మకతే ఏకైక సాధనం. క్లయింట్లకు సంతృప్తిని కలిగించే ఔట్పుట్ ఇస్తే అవకాశాలకు, ఆదాయానికి లోటుండదు. వినియోగదారుల అభిరుచులను తెలుసుకొనే నేర్పు ఉండాలి. మార్కెట్లో ఎక్కడ అవకాశాలు లభిస్తాయో తెలుసుకోవాలి. ప్రారంభంలో మంచి గుర్తింపును తెచ్చుకుంటే కెరీర్లో త్వరగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంటర్నేషనల్ డిజైన్ ట్రెండ్స్‌ను నిశితంగా పరిశీలిస్తూ స్కిల్స్ పెంచుకోవాలి. ఈ రంగంలో ఫ్రీలాన్స్ డిజైనర్‌గా కూడా పనిచేసుకోవచ్చు. అర్హతలు: గ్రాఫిక్ డిజైనింగ్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమాలో చేరాలంటే ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తిచేయొచ్చు. పీజీలో చేరడానికి గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణత సాధించాలి. వేతనాలు: గ్రాఫిక్ డిజైనర్లకు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. కనీసం ఐదేళ్లపాటు పనిచేసి నైపుణ్యాలు, అనుభవాన్ని పెంచుకుంటే నెలకు రూ.50 వేలకు పైగానే అందుకోవచ్చు. మనదేశంలో నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే డిజైనర్లు ఎందరో ఉన్నారు. గ్రాఫిక్ డిజైనింగ్ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వెబ్సైట్: www.jnafau.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వెబ్సైట్: www.nid.edu ఎంఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ వెబ్సైట్: www.mitid.edu.in ఆర్క్ ఆకాడమీ ఆఫ్ డిజైన్ వెబ్సైట్: www.archedu.org ఎవర్గ్రీన్.. గ్రాఫిక్ డిజైనింగ్ శ్రీఅప్లయిడ్ ఆర్ట్స్/ గ్రాఫిక్ డిజైన్ కోర్సులు ఎవర్గ్రీన్. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న కొద్దీ వీటికి డిమాండ్ ఏర్పడుతోంది. గ్లోబలైజేషన్‌తో రిటైల్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. వస్తువుల విక్రయానికి ప్రకటనలే కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఉత్పత్తులను ఎంత ఆకర్షణీయంగా రూపొందించి, వినియోగదారుల్లోకి తీసుకెళ్లగలిగితే అంతగా మార్కెట్ పెరుగుతుంది. ప్రకటనల నుంచి సినిమాల వరకూ అన్నిచోట్లా సృజనాత్మకతకే అగ్రస్థానం. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నారంటే వారిలో ఎంతోకొంత క్రియేటివిటీ ఉందనే అర్థం. అకడమిక్‌గా ఎన్ని అర్హతులున్నా నైపుణ్యం లేకుంటే తమ రంగంలో రాణించలేరు. గ్రాఫిక్ డిజైనర్లకు ప్రకటనలు, మీడియా, ఇన్ఫర్మేషన్, ఎన్విరాన్మెంట్ డిజైన్, ప్రింట్, పబ్లికేషన్ ఇండస్ట్రీ, మల్టీమీడియా, సోషల్ మీడియా రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఆర్థికంగా వెసులుబాటు ఉంటే ఇంటరాక్టివ్ మీడియా డిజైనర్స్, అడ్వర్టైజింగ్- కమ్యూనికేషన్, ప్యాకేజింగ్ డిజైనర్, క్రియేటివ్ ప్రొడక్ట్ వంటి విభాగాల్లో సొంతంగా పనిచేసుకోవడంతోపాటు మరికొంతమందికి ఉపాధి చూపించవచ్చ్ణు - ప్రొఫెసర్ బి.శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్, జవహర్లాల్ నెహ్రూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్