-
గోపీచంద్ 'విశ్వం' టీజర్ రిలీజ్.. కామెడీ కాదు ఈసారి యాక్షనే!
శ్రీనువైట్ల.. ఈ పేరు చెప్పగానే ఢీ, వెంకీ, దుబాయ్ శీను లాంటి క్రేజీ సినిమాలు గుర్తొస్తాయి. ప్రస్తుతం మీమ్స్ లో ఉండే సగం సినిమాలు ఈయన తీసినవే. కానీ తర్వాత తర్వత ట్రెండ్ కి తగ్గ మూవీస్ చేయలేక సైడ్ అయిపోయాడు. ఇప్పుడు దాదాపు ఆరేళ్ల తర్వాత సినిమా చేశాడు. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజైంది. (ఇదీ చదవండి: సమంత గ్లామర్ ట్రీట్.. 'టాప్' లేపేసిందిగా!) అప్పుడెప్పుడో 'బాద్ షా'తో ఓ మాదిరి హిట్ కొట్టిన శ్రీనువైట్ల.. ఆగడు, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి చిత్రాలతో వరస ఫ్లాప్స్ దెబ్బకు సైడ్ అయిపోయాడు. ఇంకా చెప్పాలంటే ఇతడు ఇక సినిమాలు చేయడేమో అని అందరూ అనుకున్నారు. కానీ గోపీచంద్ తో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్టుకి 'విశ్వం' అని టైటిల్ ఫిక్స్ చేసి, టీజర్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే శ్రీనువైట్ల ఈసారి కామెడీని కాకుండాయాక్షన్ ని నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో హిట్ కొట్టడం అటు శ్రీనువైట్లతో పాటు గోపీచంద్ కి కూడా చాలా అవసరం. మరి ఏం చేస్తారో చూడాలి? బహుశా ఈ ఏడాదే ఈ మూవీ రిలీజ్ ఉండొచ్చు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ పై వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?) -
ఎట్టకేలకు ఓటీటీకి గోపిచంద్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. అయితే ఇటీవల ఈ చిత్రం ఓటీటీలోకి వస్తుందని అభిమానులు అంతా భావించారు. గతవారమే ఏప్రిల్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ అలా జరగలేదు. దీంతో భీమా ఓటీటీ కొత్త తేదీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఉగాది సందర్భంగా అఫీషియల్ డేట్‌ను రివీల్ చేసింది. ఈనెల 25 నుంచి భీమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. Surprise surprise! Bringing the action-packed, thrilling entertainer, #Bhimaa to your screens on April 25th!#BhimaaonHotstar@YoursGopichand @priya_Bshankar @ImMalvikaSharma @NimmaAHarsha@KKRadhamohan @RaviBasrur@SriSathyaSaiArt pic.twitter.com/9wIjhzLigr — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 9, 2024 -
కొత్త పాయింట్‌తో...
గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి చిత్రాలయం స్టూడియోస్‌పై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్ బుధవారం ్రపారంభమైంది. ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశాం. దాంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఒక కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారు. శ్రీను వైట్ల తీసిన బ్లాక్‌బస్టర్స్ చిత్రాలకు రచయితగా చేసిన గోపీ మోహన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్. -
ఓటీటీలో గోపీచంద్ 'భీమా'.. రిలీజ్ ఆ రోజేనా..?
భారీ అంచనాలతో విడుదలైన గోపీచంద్ 'భీమా' సినిమా విడుదలైన తొలిరోజే బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ తెచ్చుకుంది. దంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ఎ.హర్హ డైరెక్ట్ చేశారు. ఇందులో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఇందులో గోపీచంద్ పోలీసు పాత్రలో మరోసారి తన అభిమానులను మెప్పించారు. మార్చి 8న థియేటర్లలో విడుదలైన భీమా డిజిటల్ రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ప్రారంభం కావాడంతో సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. కానీ తర్వాత ఔట్‌డేటెడ్ స్టోరీతో కథను నడిపించడం వల్ల సినిమాకు పెద్ద మైనస్ అయిందని ఆడియన్స్ చెప్పుకొచ్చారు. భీమా తర్వాత దర్శకుడు శ్రీనువైట్లతో గోపీచంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాకు విశ్వం అనే పేరును ఖరారు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ రాధాకృష్ణ కాంబోలో కూడా గోపీచంద్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. జిల్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. -
భీమాని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్
‘‘భీమా’ సినిమా బాగుంది. యాక్షన్, కామెడీ అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో రెండు క్యారెక్టర్స్‌లో మంచి వేరియేషన్స్ చూపించారని మంచి అప్లాజ్ వస్తోంది. ఇంత మంచి విజయాన్నిచ్చిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 8న విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం జరిగిన థ్యాంక్స్ మీట్లో దర్శకులు మారుతి, సంపత్ నంది అతిథులుగా పాల్గొని, ఈ సినిమా విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘భీమా’ వంటి సినిమాను తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన దర్శకుడు హర్షకు, నిర్మాత రాధామోహన్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘భీమా’కు ఆడియన్స్ నుంచి లభిస్తోన్న స్పందన సంతోషాన్నిస్తోంది’’ అన్నారు హర్ష. ‘‘రోజు రోజుకీ మా సినిమా వసూళ్లు పెరుగుతున్నాయి. విద్యార్థుల పరీక్షలు పూర్త య్యాయి. చూడనివారు మా సినిమాను చూడండి’’ అన్నారు రాధామోహన్. మాళవికా శర్మ మాట్లాడారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement