breaking news
Earache
-
షాకింగ్ ఘటన: చెవిలో గూడు కట్టుకుని, పిల్లలతో సహా కాపురమున్న సాలీడు
షాంఘై: చైనాలో ఓ మహిళ చెవి నొప్పితో ఆస్పత్రికెళ్లింది. పరీక్షించిన వైద్యులు చెవిలోపలి భాగంలో ఓ సాలీడు గూడు కట్టుకుని సంతానంతో సహా కాపురం ఉన్నట్లు తేల్చారు. సిచువాన్ ప్రావిన్స్ హుయిడాంగ్ కౌంటీ ఆస్పత్రికి సుమారు పది రోజుల క్రితం ఓ మహిళ వచ్చింది. కుడి చెవి నొప్పితోపాటు లోపలి నుంచి బెల్ కొడుతున్నట్లుగా శబ్ధం వస్తోందంటూ వైద్యులకు తెలిపింది. ఎండోస్కోపీ పరీక్ష చేసిన వైద్యులు కర్ణభేరిలాంటి నిర్మాణాన్ని గుర్తించారు. కెమెరా అమర్చిన ప్రత్యేక పరికరాలను లోపలికి పంపించి చూడగా దాని వెనుక ఒక సాలీడు గూడు కనిపించింది. దీంతో,ఆశ్చర్యపోవడం వైద్యుల వంతైంది. వైద్య నిపుణులు ఆ గూడును బయటకు లాగగా దాంతోపాటు అందులోని సాలీడు, దాని పిల్లలు బయటకు వచ్చాయి. అయితే, ఈ సాలీడు విషపూరితమైంది కాకపోవడం సంతోషించాల్సి విషయమని వైద్యులు తెలిపారు. (లేటు వయసులో ఘాటు ప్రేమ.. 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్!) -
పీసీఓడీ పూర్తిగా నయమవుతుందా?
హోమియో కౌన్సెలింగ్స్ నా భార్య వయసు 35 ఏళ్లు. ఇటీవల ఆమె ఒంటిపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. హోమియోలో పూర్తిగా నయమయ్యేలా పీసీఓడీకి మంచి చికిత్స ఉందా? – జె. సాగర్, సిద్దిపేట రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీఓడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు:నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానంకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ చాలాకాలంగా పాపకు చెవి నొప్పి... తగ్గుతుందా? మా పాపకు తొమ్మిది. గత మూడేళ్ల నుంచి చెవినొప్పితో వస్తోంది. చెవిలో చీము, వాపు కూడా కనపడుతున్నాయి. ఏడాదిగా ఈ సమస్య దాదాపు రోజూ కనిపిస్తోంది. ఇంతకుముందు ఒక చెవిలోనే చీము కనిపించేది. ఇప్పుడు రెండు చెవుల్లోనూ చీము వస్తోంది. ఈఎన్టీ నిపుణులను సంప్రదిస్తే ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. దీనికి హోమియోలో చికిత్స చెప్పండి. – సాయి ప్రతాప్, విశాఖపట్నం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాప దీర్ఘకాలిక చెవి వాపు (క్రానిక్ ఒటైటిస్ మీడియా)తో బాధపడుతోందని తెలుస్తోంది. చెవిని మనం మూడు భాగాలుగా చెప్పవచ్చు. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి. మీరు వివరించే సమస్య మధ్య చెవిలో వస్తుంది. ఇది చిన్నపిల్లలకు, మధ్యవయసువారికి, వృద్ధులకు సైతం వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ వయసు వారిలోనైనా ఇది రావచ్చు. అయితే ఎక్కువగా చిన్న పిల్లలు దీని బారినపడతారు. కారణాలు: ∙ కర్ణభేరి (ఇయర్ డ్రమ్)కు రంధ్రం ఏర్పడటం ∙ మధ్య చెవి ఎముకల్లో మచ్చలు ఏర్పడటం ∙ చెవి నుంచి దీర్ఘకాలం పాటు చీము రావడం ∙ ముఖానికి సంబంధించిన నరాలు, సంతులనం కాల్వలు, కాక్లియా, మధ్య చెవిలో తరుగు రావడం వల్ల ∙ ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్య రావచ్చు. లక్షణాలు : ∙ తీవ్రమైన జ్వరం ∙ వినికిడి లోపం ∙ శరీరం సంతులనం కోల్పోవడం ∙ చెవి నుంచి చీము కారడం ∙ ముఖం బలహీన పడటం ∙ తీవ్రమైన చెవి/తలనొప్పి ∙ చెవి వెనకాల వాపు రావడం. నిర్ధారణ: ఆడియోమెట్రీ, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్–రే చికిత్స : దీర్ఘకాలిక చెవి వాపు సమస్య పరిష్కారానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో ఎపిస్, బెల్లడోనా, కాస్టికమ్, ఫెర్రమ్‌ఫాస్, హెపార్‌సల్ఫ్, మెర్క్‌సాల్, నేట్రమ్ మ్యూర్, పల్సటిల్లా, సైలీషియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మూత్ర విసర్జన సమయంలో భరించలేని మంట! నా వయసు 32 ఏళ్లు. ఇటీవల మూత్రం వెంటవెంటనే వస్తోంది. అంతేకాదు విసర్జన సమయంలో చాలా మంటగానూ ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం సూచించండి. – ఒక సోదరి, నకిరేకల్ మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. ఇవి మహిళల్లో చాలా ఎక్కువే. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ : ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లోని దాదాపు 90 శాతం కేసుల్లో ఈ సమస్యకు ప్రధానంగా కారణం ఈ–కొలై అనే బ్యాక్టీరియా. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. లక్షణాలు మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం చికిత్స హోమియోలో వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి మందులను సూచిస్తారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
పిల్లలు అదేపనిగా ఏడుస్తుంటే...?
మా పాప వయసు మూడు నెలలు. ఈ మధ్య ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటోంది. డాక్టర్గారికి చూపిస్తే ‘ఈ వయసు పిల్లల్లో కడుపు నొప్పి వస్తుంటుంది, మరేం భయం లేదు’ అని కొన్ని మందులు రాశారు. మందులు వాడినప్పుడు కొద్దిరోజులు తగ్గినా ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి. దయచేసి మా పాప సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - ఎస్. దిల్షాద్ బేగం, కర్నూలు పిల్లలు ఇలా అదేపనిగా ఏడవడానికి అనేక కారణాలు ఉంటాయి. సాధారణంగా ఎలాంటి ప్రమాదం లేని చిన్న సమస్య మొదలుకొని, చాలా ప్రమాదకరమైన సమస్య వరకూ అన్నింటినీ వారు ఏడుపు ద్వారానే తెలియజేస్తారు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు తేలిగ్గా తీసుకోకూడదు. పిల్లలు అదేపనిగా ఏడ్వటానికి కొన్ని కారణాలు: ఆకలి వేయడం, భయపడటం, దాహం, మూత్ర విసర్జన తర్వాత డయాపర్ తడి కావడం, బయటి వాతావరణం మరీ చల్లగా లేదా మరీ వేడిగా ఉండి వారికి అసౌకర్యంగా ఉండటం, భయపెట్టే పెద్ద పెద్ద శబ్దాలు వినిపించడం (దీపావళి లేదా ఏదైనా సెలబ్రేషన్ సందర్భంగా బాణాసంచా కాల్చినప్పుడు పిల్లలు ఉలిక్కిపడి ఏడ్వటం సాధారణం), వారున్న గదిలో కాంతి మరీ ఎక్కువగా ఉండటం, పొగ వస్తూ ఊపిరి తీసుకోడానికి ఇబ్బందిగా పరిణమించడం, వారికి ఏవైనా నొప్పులు ఉండటం, దంతాలు వస్తుండటం, ఇన్ఫెక్షన్లు ఉండటం, కడుపునొప్పి (ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్) రావడం, జ్వరం, జలుబు, చెవినొప్పి, మెదడువాపు జ్వరం, గుండె సమస్యలు, కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలను పిల్లలు ఏడుపు ద్వారానే తెలియచేస్తారు. ఒకటి నుంచి ఆర్నెల్ల వయసులో ఉన్న పిల్లలు అదేపనిగా ఏడుస్తున్నారంటే దానికి కారణం ముఖ్యంగా కడుపుకు సంబంధించిన రుగ్మతలు, చెవి నొప్పి, జలుబు వంటి సమస్యలు ఉండటం. మీ పాప విషయంలోనూ ఏడుపునకు మీ డాక్టర్‌గారు చెప్పినట్లుగా బహుశా కడుపునొప్పి (ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్) కారణం కావచ్చని అనిపిస్తోంది. ఈ సమస్య సాధారణంగా ఆరువారాల నుంచి మూడు నెలలలోపు పిల్లల్లో వస్తుంటుంది. ఈ వయసు పిల్లలు ఎక్కువగా కడుపునొప్పితో ఏడుస్తుండటం తరచూ చూస్తుంటాం. ఇది ముఖ్యంగా పేగులకు సంబంధించిన నొప్పి. ఇలాంటి పిల్లల్లో ఏడుపు నిర్దిష్టంగా ఇదీ కారణం అని చెప్పలేక పోయినప్పటికీ... ఆకలి, గాలి ఎక్కువగా మింగడం, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను సరిగా ఎత్తుకోవడం (అప్ రైట్ పొజిషన్), కొద్దిసేపటి కోసం వాళ్ల పొట్టమీద వాళ్లను పడుకోబెట్టడం (ప్రోన్ పొజిషన్), తేన్పు వచ్చేలా చేయడం (ఎఫెక్టివ్ బర్పింగ్)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్‌తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే తప్పకుండా మీ పిల్లల డాక్టర్‌కు చూపించి తగిన చికిత్స తీసుకోవడం అవసరం. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి, పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్