breaking news
duvvada Plant
-
డా.రెడ్డీస్‌కు మరో షాక్
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కి మరోసారి షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్, విశాఖ దగ్గర్లోని దువ్వాడ ప్లాంటుకి సంబంధించి యూఎస్ఎఫ్డీఏ ఓఏఐతో కూడిన ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్(ఈఐఆర్)ను జారీ చేసింది. దీంతో బుధవారం నాటి ట్రేడింగ్‌లో డా.రెడ్డీస్ టాప్ లూజర్‌గా నిలిచింది. ట్రేడర్ల అమ్మకాలతో 4.5 శాతం పతనమైంది. ఫార్మా సెక్టార్లో ఓఏఐ అంటే నియంత్రణా సంబంధిత చర్యలకు ఉపక్రమించినట్టేనని ఎనలిస్టులు చెబుతున్నారు.. 2017 ఫిబ్రవరి-మార్చి తనిఖీలలో యూఎస్ఎఫ్డీఏ దువ్వాడ ప్లాంటుపై 13 అబ్జర్వేషన్స్‌ను నమోదు చేసింది. ఈ ప్లాంటు నుంచి రెడ్డీస్ ఇంజక్టబుల్స్‌ను రూపొందిస్తోంది. దాదాపు 2015 నుంచి వెలిబుచ్చుతున్న అభ్యంతరాల నివారణకు కంపెనీ తగిన చర్యలు చేపట్టలేదంటూ యూఎస్ఎఫ్డీఏ పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై డా.రెడ్డీస్‌ను వివరణకోరామని మార్కెట్ రెగ్యులేటరీ తెలిపింది. తాజా రిపోర్ట్‌పై కంపెనీ ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే నవంబర్ 21, 2017న విశాఖపట్నంలోని దువ్వాడలోని ఉత్పాదక కేంద్రానికి సంబంధించి యూఎస్ఎఫ్డీఏ నుంచి ఈఐఆర్ అందినట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రెడ్డీస్ తెలిపింది. కానీ సంస్థ తనిఖీ ప్రక్రియ ఇంకా లేదని చెప్పింది. కాగా అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ కంపెనీకి మూడు హెచ్చరిక లేఖను జారీ చేసింది. దువ్వాడ ప్లాంట్ సహా దాని తనిఖీ బృందాలు ఆమోదయోగ్యమైన సమస్యలను ఉన్నట్టు గుర్తించిన సంగతి తెలిసిందే. మరోవైపు జనవరి 25న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. గత నెలగా రెడ్డీస్ కౌంటర్ 8శాతానికిపైగా లాభపడింది. -
డా.రెడ్డీస్‌కు మరో వెనకడుగు
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ లాబరేటరీస్‌కు భారీ వెనకడుగు. జర్మన్ రెగ్యులేటరీ ఈ కంపెనీకి మరోసారి భారీ షాక్ ఇచ్చింది. 6 మేజర్ అబ్జర్వేషన్లను జారీ చేసింది. విశాఖ పట్టణంలోని దువ్వాడ ప్లాంట్‌కు సంబంధించి వీటిని జారీ చేసింది. జర్మనీ రెగ్యులేటరి అథారిటీ ఆడిట్లో విశాఖపట్నంలోని దువ్వాడకేంద్రంలో ఆరు అతిపెద్ద పరిశీలనలను నిర్ధారించిందని బీఎస్సీ ఫైలింగ్‌లో డా.రెడ్డీస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈయు-ఈఎంపీ సర్టిఫికెట్ జారీ చేయనున్నట్టు రెగ్యులేటరీ హెచ్చరించిందని త్వరలో సీఏపీఏ (కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్ ప్లాన్)ను సంబంధిత అధికారులకు అందించనున్నట్టు తెలిపింది. అయితే సదుపాయంలో తయారైన ఉత్పత్తులను ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌కు ఎగుమతి చేయడంలేదని ఫైలింగ్‌లో పేర్కొంది. క్రిటికల్ అబ్జర్వేషన్ ఏమీ లేకపోయినప్పటికీ 6 ప్రధాన అబ్జర్వేషన్లను జారీ చేయడంతో డా.రెడ్డీస్ నష్టాల్లోకి జారుకుంది. 2018, నవంబరులో వీటిని మళ్లీ రివ్యూ చేపట్టనుంది. ఈ వార్తలతో డా.రెడ్డీస్ 7శాతానికిపైగా శాతం పతనమైంది.