బిగ్‌బాస్ 10: ఆమెని ఎలిమినేట్ చేసేశారు!
లెక్కప్రకారం గతవారం షాలిని ఎలిమినేట్ అయింది. కానీ ఆమెని సీక్రెట్ గదికి పంపిన బిగ్‌బాస్.. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత తిరిగి హౌస్‌లోకి తీసుకొచ్చాడు. దీంతో ఈవారం ఈమె సేవ్ అయిపోయింది. మరి షాలిని గతవారం ఔట్ కాలేదు కాబట్టి ఈసారి డబుల్ ఎలిమినేషన్ పక్కా అని తెలుస్తోంది. అందులో భాగంగానే తొలి వికెట్ పడినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: 'ఫౌజీ'లో సుభాస్ చంద్రబోస్ పాత్ర చేసింది ఎవరంటే?)ఈ వారం రోహిత్, త్రిగుణ్, రామకృష్ణ, అమన్, శ్వేత నాయుడు, వర్షిణి, వంశీ, సుధీర్, ఝాన్సీ, శివ, దక్షి, నీతూ మాస్టర్ నామినేషన్లలో ఉన్నారు. వీళ్లలో గోట్ టాస్క్‌లో గెలిచిన అమన్, త్రిగుణ్, ముకేశ్, దేబ్జానీ, నీతూ.. ఈవారంతో పాటు వచ్చేవారం కూడా నామినేషన్ల నుంచి సేవ్ అయిపోయారు. మిగిలిన వాళ్లలో రోహిత్ ఓటింగ్ పరంగా టాప్‌లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఓటింగ్ పరంగా రోహిత్ తర్వాత త్రిగుణ్, రామకృష్ణ, అమన్, ఝాన్సీ, వర్షిణి, సుధీర్, వంశీ వరస స్థానాల్లో ఉన్నారట. చివరి స్థానాల్లో మాత్రం శ్వేత, నీతూ, దక్షి, శివ్ ఉన్నారు. నీతూ ఇప్పటికే సేవ్ అయిపోయింది. దీంతో శివ్, దక్షి, శ్వేత ప్రస్తుతానికి డేంజర్ జోన్లో ఉండగా వీళ్లలో దక్షి తొలి ఎలిమినేషన్‌గా బయటకొచ్చేసినట్లు సమాచారం. ఈమెతో ఈ వీకెండ్ ముగిస్తారా? లేదంటే మరో ఎలిమినేషన్ కూడా ఉందా అనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: త్యాగం చేసిన శివ్.. త్రిగుణ్ మామూలోడు కాదు)