breaking news
Crishan Kalugamage
-
పిజ్జాలు తయారు చేసే షెఫ్.. టీ20 వరల్డ్‌కప్ ’హీరో’
టీ20 ప్రపంచకప్-2026లో ఇటలీ సంచలన విజయం సాధించింది. నేపాల్‌తో గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో అంచనాలను తలకిందులు చేస్తూ ఇటలీ అదరగొట్టింది. ముంబైలో గురువారం జరిగిన ఈ పోరులో ఇటలీ ఏకంగా 10 వికెట్ల తేడాతో నేపాల్‌పై జయభేరి మోగించడం విశేషం.క్రిషాన్.. మోస్కా బ్రదర్స్ అదుర్స్ఈ గెలుపులో అన్మదమ్ములు జస్టిన్ మోస్కా (44 బంతుల్లో 60 నాటౌట్), ఆంటోని మోస్కా (32 బంతుల్లో 62 నాటౌట్)లతో పాటు లెగ్ స్పిన్నర్ క్రిషాన్ కలుగమగేది కీలక పాత్ర. నేపాల్‌ను స్వల్ప స్కోరుకు పరిమితం చేయడంలో కలుగమగే ప్రధాన భూమిక పోషించగా.. లక్ష్య ఛేదనలో మోస్కా బ్రదర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇటలీకి తొలి విజయం అందించిన ఈ ముగ్గురు.. ఇటలీ వెలుపల జన్మించిన వారే కావడం గమనార్హం.మోస్కా బ్రదర్స్ తల్లిదండ్రులు ఇటలీ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లగా.. వీరిద్దరు సిడ్నీలో జన్మించారు. అయితే, ఆ తర్వాత క్లబ్ స్థాయి క్రికెట్లో మెళకువలు నేర్చుకుని ఇటలీకి తిరిగి వచ్చి తమ జాతీయ జట్టులో చోటు సంపాదించారు.శ్రీలంకలో పుట్టి పెరిగిఇక క్రిషాన్ కలుగమగేది మరో స్టోరీ. అతడు శ్రీలంకలో జన్మించాడు. క్రికెట్ అంటే అతడికి పిచ్చి అని చెప్పవచ్చు. చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకున్న కలుగమగే అండర్–15 స్థాయి వరకు శ్రీలంకకే ఆడాడు.అయితే అదే సమయంలో కలుగమగే కుటుంబం ఇటలీ వలస వెళ్లేందుకు సిద్ధమైంది. ఇటలీలో ఈ ఆట ఉండదు కాబట్టి తన క్రికెట్ కెరీర్ కోల్పోతానని భయంతో అతను వెళ్లడానికి ఇష్టపడలేదు. అయినా కుటుంబ అవసరాల దృష్ట్యా చివరకు తప్పలేదు. అయితే అక్కడికి వెళ్లాక క్రికెట్ అవకాశాలు రావడంతో పాటు... పరిస్థితి మారి ఏకంగా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.పిజ్జాలు చేసే షెఫ్.. టీ20 వరల్డ్‌కప్ ’హీరో’నిజానికి కలుగమగే ప్రొఫెషనల్ షెఫ్. ఇటాలియన్ స్పెషల్ పిజ్జాలు తయారు చేసే ‘లా విటా పిజారియా’ అనే హోటల్లో సోమవారం నుంచి శనివారం వరకు ‘షెఫ్’గా అతడు పని చేస్తాడు. కాబట్టి కేవలం ఆదివారాల్లో మాత్రమే అతడికి క్రికెట్ ప్రాక్టీస్ చేసే అవకాశం లభిస్తుంది. ఇలా వారానికి కేవలం ఒక్క రోజు మాత్రమే సాధన చేసే కలుగమగే ఏకంగా వరల్డ్‌కప్ హీరోగా నిలవడం విశేషం.ఇక నేపాల్‌తో మ్యాచ్‌లో 34 ఏళ్ల ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్.. కెప్టెన్ రోహిత్ పౌడేల్ (23), దీపేంద్ర సింగ్ ఐరీ (17), గుల్షాన్ ఝా (3) రూపంలో మూడు వికెట్లు తీశాడు. ఇటలీ విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్ల కోటాలో కలుగమగే కేవలం 18 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టడం విశేషం.123 పరుగులకేమ్యాచ్ విషయానికొస్తే... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటైంది. ఆరిఫ్ షేక్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్రోహిత్ పౌడేల్ (23), ఆసిఫ్ షేక్ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఇతర ప్రధాన బ్యాటర్లు కుశాల్ భుర్తేల్ (5), దీపేంద్ర సింగ్ ఐరీ (17) ప్రభావం చూపించలేకపోవడంతో నేపాల్ తక్కువ స్కోరుకే పరిమితమైంది.ఇంగ్లండ్‌పై గత మ్యాచ్‌లో 17 ఫోర్లు, 7 సిక్స్‌లు బాదిన నేపాల్ బ్యాటర్లు ఈసారి.. 7 ఫోర్లు, 3 సిక్స్‌లు మాత్రమే నమోదు చేశారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లెగ్ స్పిన్నర్ క్రిషాన్ కలుగమగే (3/18) మూడు కీలక వికెట్లతో జట్టును దెబ్బ తీశాడు.మరో 44 బంతులు మిగిలి ఉండగానేఅనంతరం ఛేదనలో ఇటలీ ఎక్కడా తడబడకుండా అలవోకగా దూసుకుపోయింది. ఇటలీ 12.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన అన్నదమ్ములు ఆంటోనీ మోస్కా (32 బంతుల్లో 62 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు), జస్టిన్ మోస్కా (44 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కలిసి అభేద్యంగా మరో 44 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు. The Mosca brothers finish it in style! 🇮🇹🔥A dominant 10-wicket triumph over Nepal as Italy register their first-ever ICC Men’s T20 World Cup win 👏Statement made. History created.Next on ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/lKwkG3OSxX— Star Sports (@StarSportsIndia) February 12, 2026చదవండి: IND vs NAM: అంపైర్‌తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది? -
టీ20 ప్రపంచకప్‌లో సంచలనం
ఇటలీ క్రికెట్ చరిత్రలో ఈ రోజు (ఫిబ్రవరి 12) చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఇవాళ ఈ యూరప్ జట్టు ప్రపంచకప్‌లో తమ తొట్టతొలి విజయాన్ని నమోదు చేసింది. ఇటలీ ఏదైనా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై కావడం ఇదే తొలిసారి. యూరోపియన్ క్వాలిఫయర్స్ ద్వారా ఇటలీ టీ20 ప్రపంచకప్ 2026 బెర్త్ దక్కించుకుంది.తొలి ప్రపంచకప్‌లో ఆడిన రెండో మ్యాచ్‌లోనే విజయం సాధించడం ఇటలీని మరింత ప్రత్యేకంగా నిలబెడుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఇటలీ తమకంటే చాలా రెట్లు మెరుగైన, మూడోసారి ప్రపంచకప్ ఆడుతున్న నేపాల్‌పై సంచలన విజయం సాధించింది. రెండు రోజుల కిందట ఇదే నేపాల్ జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్‌ను ఓడించినంత పని చేసింది. అలాంటి నేపాల్ జట్టును ఇవాళ ఇటలీ సునాయాసంగా మట్టికరిపించింది.మట్టికరిపించడం అంటే ఏదో సాదాసీదాగా కాదు. ఏకంగా 10 వికెట్ల తేడాతో. ఈ గెలుపుతో ఇటలీ గ్రూప్-సిలో మిగతా జట్లకు (వెస్టిండీస్, ఇంగ్లండ్) వణుకు పుట్టిస్తుంది. ఈ మ్యాచ్‌లో ఇటలీ తమ రెగ్యులర్ కెప్టెన్ వేన్ మ్యాడ్సన్ లేకుండా బరిలోకి దిగి సంచలన విజయం సాధించింది. మ్యాడ్సన్ స్కాట్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్‌లో తీవ్రంగా గాయపడ్డాడు.తొలి మ్యాచ్‌లో ఇటలీకి స్కాట్లాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. ఆ మ్యాచ్‌లో ఇటలీ అన్ని విభాగాల్లో దారుణంగా విఫలమైంది. తొలి మ్యాచ్ నుంచి నేర్చుకున్న గుణపాఠాలతో ఇటలీ రెండో మ్యాచ్‌లో తిరుగులేని విజయం సాధించి, క్రికెట్ ప్రపంచాన్నంతా తమ వైపు తిప్పుకుంది.తిప్పేసిన స్పిన్నర్లుటాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఇటలీ నేపాల్‌ను 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ చేసింది. స్పిన్నర్లు క్రిషన్ కలుగమగే (4-0-18-3), బెన్ మనెన్టి (4-0-9-2), స్మట్స్ (4-0-22-1) నేపాల్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పేసర్లు అలీ హసన్, జస్ప్రీత్ సింగ్ తలో వికెట్ తీసి నేపాల్‌ను దెబ్బేశారు.నేపాల్ ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసిన ఆరిఫ్ షేక్ టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆసిఫ్ షేక్ (20), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (23), దీపేంద్ర సింగ్ ఎయిరీ (17), కరణ్ కేసి (18 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో కుషాల్ భుర్టెల్, సందీప్ లామిచ్చేన్ చెరో 5, లోకేశ్ బామ్, గుల్షన్ ఝా తలో 3, నందన్ యాదవ్ మరియు లలిత్ రాజ్‌బంశీ డకౌట్లయ్యారు.మోస్కా బ్రదర్స్ అదుర్స్124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్లు మోస్కా బ్రదర్స్ జూలు విదిల్చారు. ఈ ఇద్దరు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి, కేవలం 12.4 ఓవర్లలోనే తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. జస్టిన్ మోస్కా 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 60 పరుగులు.. ఆంథొని మోస్కా 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 62 పరుగులు చేశారు. జస్టిన్, ఆంథొని ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇటలీ జట్టులో మరో అన్నదమ్ముల జోడీ ఉంది. ఈ మ్యాచ్‌లో ఇటలీకి తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన హ్యారీ మనెంటి, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బెన్ మనెంటి ఇద్దరు అన్నదమ్ములు.చరిత్ర సృష్టించిన మోస్కా బ్రదర్స్‌ఈ మ్యాచ్‌లో మోస్కా బ్రదర్స్ చరిత్ర సృష్టించారు. తొలి వికెట్‌కు అజేయమైన 124 పరుగులు జోడించిన ఈ అన్నదమ్ములు.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన తొలి అన్నదమ్ముల జోడీగా చరిత్ర సృష్టించారు.


