నాన్న అలాంటివి చాలా చూశారు
తన తండ్రి వివాదాంశ సంఘటనలను చాలా ఎదుర్కొన్నారని విశ్వనటుడు కమలహాసన్ రెండవ కూతురు అక్షరహాసన్ పేర్కొన్నారు. నిజమే కమలహాసన్ పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు వివాదాంశంగా మారాయి. ఇటీవల ఒక చానల్‌కిచ్చిన భేటీలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి అడిగిన ప్రశ్నకు కమల్ మహాభారతంలోని ఒక అంశాన్ని ఉదాహరణగా చూపారు. ఇందుకు హిందు మక్కల్ కట్చి తీవ్రంగా ఖండించింది. కమలహాసన్ వ్యాఖ్యలు పురాణాలు కించపరచేవిగా ఉన్నాయంటూ ఆరోపించారు. అదే ఇదే అంశంపై వళ్లియూర్, కుంభకోణం ప్రాంతాల్లో కమల్‌పై కోర్టులో పిటిషన్లు నమోదయ్యాయి.
బెంగళూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.ఈ అంశంపై కమలహాసన్ రెండవ కూతురు అక్షరహాసన్ స్పందిస్తూ ఇలాంటి వివాదాస్పదమైన సంఘటనలను తన తండ్రి చాలా ఎదుర్కొన్నారన్నారు. ఏదైనా విషయం గురించి చెప్పేటప్పుడు తన తండ్రి చాలా ఆలోచిస్తారని అన్నారు. అది చాలా అర్ధవంతంగా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం నాన్న శభాష్‌నాయుడు చిత్రంలో నటిస్తున్నారని, అందులో తన అక్క కూడా ప్రధాన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు.ఈ చిత్రంలో నటించాలని తనకూ ఆశగా ఉందని, అలా కథలో అవకాశం ఉంటే తప్పకుండా నటిస్తానని అక్షరహాసన్ అన్నారు. అదే విధంగా హిందీలో ఒక చిత్రం చేస్తున్నానని, ఈ చిత్రంలో మంచి సందేశం ఉంటుందని అక్షరహాసన్ చెప్పారు.