Cole McConchie
-
T20 WC: వార్ వన్‌సైడ్ అనుకుంటే.. ఆఖర్లో దంచికొట్టేశాడే!
న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా మెరుగైన స్కోరు సాధించింది. ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సఫారీ జట్టును ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ మెరుపు అర్ధ శతకంతో ఆదుకున్నాడు. ఫలితంగా ప్రొటిస్ జట్టు గౌరవప్రదంగా ఇన్నింగ్స్ ముగించగలిగింది.టీ20 ప్రపంచకప్-2026 తొలి సెమీస్ మ్యాచ్‌లో భాగంగా కోల్‌కతాలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ సౌతాఫ్రికాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆది నుంచే కివీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో వరుస విరామాల్లో ప్రొటిస్ జట్టు వికెట్లు కోల్పోయింది. టాపార్డర్ కుదేలుఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (18), క్వింటన్ డికాక్ (10), ర్యాన్ రికెల్టన్ (0) పూర్తిగా విఫలమయ్యారు. డెవాల్డ్ బ్రెవిస్ (34) కాసేపు నిలబడగా... డేవిడ్ మిల్లర్ (6) పూర్తిగా నిరాశపరిచాడు. ఫలితంగా డెబ్బై ఏడు పరుగులకే సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి తరుణంలో ట్రిస్టన్ స్టబ్స్ (29)తో కలిసి మార్కో యాన్సెన్ భాగస్వామ్యం నిర్మించాడు. వీరిద్దరు కలిసి ఆరో వికెట్‌కు 47 బంతుల్లో 73 పరుగులు జోడించారు. 27 బంతుల్లో అర్ధ శతకంఇక ఈ మ్యాచ్‌లో యాన్సెన్ 27 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఈ టోర్నీలో అతడికి ఇదే తొలి హాఫ్ సెంచరీ. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో సిక్స్ బాది యాభై పరుగుల మార్కు అందుకున్నాడు యాన్సెన్. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 55 పరుగులతో అజేయంగా నిలిచాడు.Marco 𝗖𝗟𝗨𝗧𝗖𝗛 Jansen 🔥Entered at 77/5 & played an innings of a lifetime to guide South Africa a fighting total! 🙌ICC Men’s #T20WorldCup | Semi-final 1 #SAvNZ | LIVE NOW 👉 https://t.co/LMBOn54jDE pic.twitter.com/CCD0QTflth— Star Sports (@StarSportsIndia) March 4, 2026మిగిలిన వారిలో కార్బిన్ బాష్ రెండు పరుగులు చేయగా.. కగిసో రబడ డకౌట్ అయ్యాడు. కేశవ్ మహరాజ్ ఒక పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది. హెన్రీ పొదుపుగా బౌలింగ్ చేయడంతోకివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, కోల్ మెకాంచీ, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు తీయగా.. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ పడగొట్టారు. ఆఖరి ఓవర్లో హెన్రీ కేవలం ఆరు పరుగులే ఇచ్చి ప్రొటిస్ జట్టును నామమాత్రపు స్కోరుకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: T20 WC 2026: బాబర్ ఎందుకు?.. పాక్ బోర్డులో తొలి రాజీనామా -
షాకులిచ్చిన శ్రీలంక.. సాంట్నర్ ధనాధన్ దంచికొట్టగా..
శ్రీలంకతో మ్యాచ్‌లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. మిడిలార్డర్ కకావికలమైనా లోయర్ ఆర్డర్ రాణించడంతో గౌరవప్రదంగా ఇన్నింగ్స్ ముగించింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ సూపర్-8 మ్యాచ్‌లో భాగంగా కొలంబో వేదికగా.. టాస్ గెలిచిన శ్రీలంక.. కివీస్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.ఈ క్రమంలో కివీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (8)ను దుష్మంత చమీర త్వరగానే పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (13 బంతుల్లో 23)ను మహీశ్ తీక్షణ వెనక్కి పంపగా.. రచిన్ రవీంద్ర (22 బంతుల్లో 32) తీక్షణ బౌలింగ్‌లో హేమంతకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.పెవిలియన్‌కు క్యూఅయితే, టాపార్డర్ ఓ మాదిరిగా ఆడగా.. మిడిలార్డర్ బ్యాటర్లు మాత్రం పెవిలియన్‌కు క్యూ కట్టారు. గ్లెన్ ఫిలిఫ్స్ (18), డారిల్ మిచెల్ (3) ఇలా వచ్చి అలా వెళ్లగా.. మార్క్ చాప్మన్ డకౌట్ అయ్యాడు.సాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మిచెల్ సాంట్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మొత్తంగా 26 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాదిన ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్.. 47 పరుగులు సాధించాడు. Captain to the rescue! 💪Mitchell Santner's power-hitting pushes New Zealand's fightback. ICC Men’s #T20WorldCup | SUPER 8, #SLvNZ ➡️ LIVE NOW 👉 https://t.co/g4wqt4U8vL pic.twitter.com/p0KW8AcuLA— Star Sports (@StarSportsIndia) February 25, 2026రాణించిన మెకాంచీఇక జేమ్స్ నీషమ్ స్థానంలో తుదిజట్టులోకి వచ్చిన మరో బౌలింగ్ ఆల్‌రౌండర్ కోల్ మెకాంచీ సాంట్నర్‌కు తోడుగా రాణించాడు. మెకాంచీ 23 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరు కలిసి ఏడో వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించారు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 168 పరుగులు సాధించింది. శ్రీలంక బౌలర్లలో మహీశ్ తీక్షణ, దుష్మంత చమీర చెరో మూడు వికెట్లు తీయగా.. దునిత్ వెల్లలగే ఒక వికెట్ దక్కించుకున్నాడు. తుదిజట్లుశ్రీలంకపాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంకన్యూజిలాండ్‌టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), కోల్ మెకాంచీ, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.చదవండి: అతడి గురించి బాధ లేదు.. సంజూ రావొచ్చు: టీమిండియా కోచ్


