breaking news
Australia Vs Oman
-
T20 WC: ఘోర పరాభవం.. స్పందించిన ఆసీస్ కెప్టెన్
మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో చేదు అనుభవం ఎదురైంది. గ్రూప్ దశలోనే ‘పటిష్ట’ ఆసీస్ ఇంటిబాట పట్టింది. తొలుత ఐర్లాండ్‌పై గెలిచినా.. అదే జోరు కొనసాగించలేకపోయిన కంగారూలు.. జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిపోయారు. ఫలితంగా సూపర్-8 చేరకుండానే నిష్క్రమించిన ఆసీస్.. లీగ్ దశలో చివరగా పసికూన ఒమన్‌ను ఓడించి విజయంతో ముగించింది.ఇదొక చేదు అనుభవంఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించాడు. ఈసారి తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని.. భారమైన హృదయాలతో ఇంటిబాట పడుతున్నట్లు వెల్లడించాడు. ‘‘సూపర్-8 చేరే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాం. మా డ్రెసింగ్‌రూంలో నిరాశపూరిత వాతావరణం నెలకొంది. ఇదొక చేదు అనుభవం.దురదృష్టవశాత్తూ మేము గత రెండు మ్యాచ్‌లలో ఓడిపోయాము. అత్యుత్తమ క్రికెట్ ఆడలేకపోయాము. అదే సమయంలో ప్రత్యర్థులు.. ముఖ్యంగా జింబాబ్వే అద్భుతంగా ఆడింది. ఆ జట్టు చేతిలో ఓడిపోగానే మాపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ విషయంలో వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే.గుణపాఠం నేర్చుకుంటాముఇక్కడి పిచ్ పరిస్థితులను ఎంతమాత్రం నిందించలేము. అన్నింటికీ మేము సన్నద్ధమయ్యే ఇక్కడికి వచ్చాము. మిగతా జట్ల మాదిరే రెండేళ్లుగా మా జట్టు నిర్మాణం జరుగుతోంది. కానీ కీలక సమయంలో మేము వెనకపడ్డాము. ఈ చేదు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకుంటాము.క్రికెట్ ఆస్ట్రేలియా యాజమాన్యం ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేస్తుంది. విఫలమైనపుడు నిరాశ సహజం. అయితే, స్వదేశానికి వెళ్లిన తర్వాత అంతా కూర్చుని లోపాల గురించి చర్చించుకుంటాము. నిజాయితిగా మా తప్పులను విశ్లేషించుకుంటాము. చాలా బాధగా ఉందిఏదేమైనా చాలా బాధగా ఉంది. నిరాశా, నిస్పృహలు కమ్ముకున్నాయి. అయితే, సానుకూల దృక్పథంతో మేము ముందడుగు వేసి తిరిగి పుంజుకుంటాము’’ అని మిచెల్ మార్ష్ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.కాగా పల్లెకెలె వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ 9 వికెట్ల తేడాతో ఒమన్‌పై జయభేరి మోగించింది. ఆడమ్ జంపా (4/21), మ్యాక్స్‌వెల్ (2/13), బార్ట్లెట్ (2/27), స్టొయినిస్ (2/16), ఎలిస్ (1/14) ఇలా... బౌలింగ్ దళమంతా కలిసి ఒమన్ బ్యాటర్లను దెబ్బకొట్టింది.మిచెల్ మార్ష్ ధనాధన్ముందుగా ఒమన్ జట్టు 16.2 ఓవర్లలోనే 104 పరుగులకే కుప్పకూలింది. వసీమ్ అలీ (32; 4 ఫోర్లు) రాణించాడు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఆ్రస్టేలియా 9.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి 108 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (33 బంతుల్లో 64 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), హెడ్ (19 బంతుల్లో 32; 6 ఫోర్లు) చెలరేగి తొలి వికెట్‌కు 8.1 ఓవర్లలో 93 పరుగులు జోడించారు. చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్! -
T20 WC 2026: ఆసీస్‌కు మరో ఘోర అవమానం!
వన్డే ప్రపంచకప్ ఈవెంట్లలో తిరుగులేని జట్టుగా ఆధిపత్యం కొనసాగించిన ఆస్ట్రేలియాకు.. టీ20 ఫార్మాట్లో మాత్రం అవమానాలే మిగులుతున్నాయి. పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్‌లో ఒకే ఒక్కసారి (2021) విజేతగా నిలిచిన కంగారూలు.. తాజా ఎడిషన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేక చతికిలపడ్డారు.టీ20 వరల్డ్‌కప్-2026లో గ్రూప్-బిలో భాగంగా తొలుత ఐర్లాండ్‌పై గెలిచిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత పసికూన జింబాబ్వే చేతిలో అనూహ్య రీతిలో పరాజయం పాలైంది. శ్రీలంక చేతిలోనూ ఓడి లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గ్రూప్ దశలో చివరగా నామమాత్రపు మ్యాచ్‌లో ఒమన్ (AUS vs OMA)తో శుక్రవారం ఆసీస్ తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది. శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియం ఇందుకు వేదిక.అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ఒమన్ కెప్టెన్ జతిందర్ సింగ్ (Jatinder Singh) మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు ఒత్తిడిలో ఉందని.. ఇలాంటి సమయంలో వారిని చిత్తు చేసే సువర్ణావకాశం తమకు ఉందని పేర్కొన్నాడు.ఆసీస్‌ను మేమూ చిత్తుగా ఓడిస్తాం‘‘ఈ మ్యాచ్‌లో మేము గెలిచేందుకు వంద శాతం అవకాశం ఉంది. టీ20 మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. సరైన సమయంలో సరైన విధంగా ఆడిన జట్టునే విజయం వరిస్తుంది.ప్రస్తుతం ఆస్ట్రేలియా గొప్పగా ఏమీ ఆడటం లేదు. వాళ్లు మొమెంటమ్ కోల్పోయారు. ఇలాంటి సమయంలో ఆసీస్‌ను చిత్తు చేయడం సులభం. మా జట్టు ఈ విషయంలో సానుకూల దృక్పథంతో ఉంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో తమదైన ముద్ర వేయాలని మా వాళ్లు ఆతురతగా ఎదురుచూస్తున్నారు’’ అని జతిందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు.ఘోర అవమానంకాగా ఇప్పటికే జింబాబ్వే వంటి పసికూన చేతిలో ఓడిన ఆసీస్‌కు.. మరో పసికూన జట్టు కెప్టెన్ కూడా ఓడిస్తామంటూ సవాలు విసరడం గమనార్హం. దీంతో ఆసీస్ ఫ్యాన్స్.. ‘‘ఇది ఘోర అవమానం.. ఇకనైనా సరిగ్గా ఆడండి’’ అంటూ మార్ష్ బృందానికి సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా గ్రూప్-బిలో జింబాబ్వే, శ్రీలంక, ఐర్లాండ్ చేతిలో ఒమన్ ఓడిపోయింది. ఇక 2024 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఆసీస్ చేతిలోనూ చిత్తైంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటామని ఒమన్ సానుకూల దృక్పథంతో ఉండటం విశేషం.ఒమన్ జట్టుఅమీర్ కలీమ్, జతిందర్ సింగ్ (కెప్టెన్), ఆశిష్ ఒడెదర, హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), మహ్మద్ నదీమ్, జితేన్ రామనంది, నదీమ్ ఖాన్, సుఫ్యాన్ మెహమూద్, షకీల్ అహ్మద్, షా ఫైసల్, షఫీక్ జాన్, కరణ్ సోనావాలే, జే ఒడెడ్రా, వసీం అలీఆస్ట్రేలియా జట్టుమిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, కూపర్ కొన్నోలీ, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, బెన్ డ్వార్షుయిస్, మాట్ రెన్షా, మాథ్యూ కుహ్నెమాన్, స్టీవెన్ స్మిత్.UPDATE: మార్ష్ విధ్వంసం.. పసికూనను చిత్తుచేసిన ఆసీస్చదవండి: T20 WC 2026: అతడిని సెలక్ట్ చేయలేదు.. అనుభవించారు!


