-
బ్యాడ్మింటన్‌కు అరవింద్ భట్ వీడ్కోలు
న్యూఢిల్లీ: జాతీయ మాజీ చాంపియన్, 2014 జర్మన్ ఓపెన్ విజేత అరవింద్ భట్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. త్వరలో కోచ్‌గా మారేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 36 ఏళ్ల అరవింద్ తెలిపాడు. ‘ఇక బ్యాడ్మింటన్ టోర్నీలు ఆడను. గత ఆరు నెలలపాటు ఆలోచించి తీసుకున్న నిర్ణయమిది. హైదరాబాద్‌లోని అకాడమీలో కోచ్‌గా బాధ్యతలు తీసుకునే ఆలోచన ఉంది’ అని 2008, 2011లో జాతీయ చాంపియన్‌గా నిలిచిన అరవింద్ పేర్కొన్నాడు. 2002లో తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అరవింద్ థామస్ కప్‌లో ఏడుసార్లు, 2010 ఆసియా క్రీడల్లో ఒకసారి, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగుసార్లు బరిలోకి దిగాడు. కోచ్‌గా మారాలని అనుకుంటున్న అరవింద్ ఇటీవల డచ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లలో చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి భారత జట్టుతో ఉన్నాడు. -
డచ్ ఓపెన్‌లో అరవింద్ భట్ ముందంజ
అల్మెరె (నెదర్లాండ్స్): భారత షట్లర్ అరవింద్ భట్ డచ్ ఓపెన్‌లో ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో భట్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్లో భట్ 11-7, 11-9, 11-8 స్కోరుతో స్కాట్లాండ్ షట్లర్ కీరన్ మెరీలెస్పై విజయం సాధించాడు. భట్ 28 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు. రెండో రౌండ్లో హాంకాంగ్ ఆటగాడు యన్ కిట్ చన్తో ఆడనున్నాడు. -
క్వార్టర్ ఫైనల్లో అరవింద్
జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ న్యూఢిల్లీ : జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఆటగాడు అరవింద్ భట్ జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో అరవింద్ 21-14, 21-12తో డారెన్ ల్యూ (మలేసియా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. ఇక అరవింద్ క్వార్టర్స్‌లో విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్)తో తలపడనున్నాడు. సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆనంద్ పవార్ (భారత్) 14-21, 11-21తో తిన్ చెన్ (చైనీస్ తైపీ) చేతిలో, హెచ్.ఎస్. ప్రణయ్ (భారత్) 14-21, 15-21తో వాన్ హో సన్ (కొరియా) చేతిలో చిత్తయ్యారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో అరుంధతి 18-21, 16-21తో ఏడో సీడ్ ఎరికో హిరోస్ (జపాన్) చేతిలో పోరాడి ఓడింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరికి గాయాలు
వరుస చోరీలతో భయాందోళన
ఎన్నికల విధుల సమస్యల పరిష్కారంపై హామీ
గంజాయితో ముగ్గురు యువకుల అరెస్ట్
సుభలయలో కార్డన్‌సెర్చ్
● జూన్ 4 కోసం అందరి ఎదురుచూపులు ● కాళింగ కార్పొరేషన్ చైర్మన్ దుంపల లక్ష్మణరావు
వైభవంగా అశ్వవాహన సేవ
‘ప్రతి బోటుకు జీపీఎస్ తప్పనిసరి’
కౌంటింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి
మనదేపెత్తనం
తప్పక చదవండి
- రాష్ట్రీయ గీతం.. రెండు వెర్షన్లలో
- వారణాసిలో వార్ వన్ సైడే
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సన్న వడ్లపై సర్కార్ సన్నాయి నొక్కులు
- ‘పట్టభద్రులపై’ పట్టు కోసం!
- ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
- మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
- ఇక సులభంగా సేంద్రీయ ధ్రువీకరణ
- సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
Advertisement