చీరలో సొగసులొలికిన సోనం! | Sonam Kapoor at Cannes | Sakshi
Sakshi News home page

చీరలో సొగసులొలికిన సోనం!

May 21 2017 11:49 AM | Updated on Sep 5 2017 11:40 AM

చీరలో సొగసులొలికిన సోనం!

చీరలో సొగసులొలికిన సోనం!

ప్రతిష్టాత్మక కాన్స్‌ చిత్రోత్సవంలో బాలీవుడ్‌ భామ సోనం కపూర్‌ మరోసారి అదరగొట్టింది.

ప్రతిష్టాత్మక కాన్స్‌ చిత్రోత్సవంలో బాలీవుడ్‌ భామ సోనం కపూర్‌ మరోసారి అదరగొట్టింది. ఈ అంతర్జాతీయ వేడుకలో సొగసులొలికేరీతిలో చీర కట్టుకొని భారతీయత ఉట్టిపడేలా అందంగా దర్శనమిచ్చింది.

ఇప్పటికే దీపికా పదుకొనే, ఐశ్యర్యరాయ్‌ తమదైన స్టైల్‌లో కేన్స్‌ రెడ్‌కార్పెట్‌నే వేడెక్కించగా.. తాజాగా సోనం సైతం తన ఫస్ట్‌ లుక్‌తో జిగేల్‌మని మెరిసింది. సౌందర్య ఉత్పత్తుల కంపెనీ లారియల్‌ అంబాసిడర్‌గా 2011 నుంచి ఫ్రెంచ్‌ రివీరాలో జరుగుతున్న కాన్స్‌ వేడుకలో ఈ లావణ్యరాశి తళుకులొలుకుతున్న సంగతి తెలిసిందే.
 

Advertisement
 
Advertisement
Advertisement