బ్రిటన్లో సిక్కు యువకుడిపై జాత్యహంకార దాడి | Sikh man brutally assaulted in Birmingham | Sakshi
Sakshi News home page

బ్రిటన్లో సిక్కు యువకుడిపై జాత్యహంకార దాడి

Mar 31 2015 8:38 PM | Updated on Sep 2 2017 11:38 PM

బ్రిటన్ లో జాత్యహంకారం మరోసారి పేట్రేగింది. బర్మింగ్హోమ్లోని బోర్డ్ స్ట్రీట్లో ఒంటరిగా తనదారిన తాను వెళుతోన్న ఓ సిక్కు యువకుణ్ని కొందరు దుండగులు అటకాయించి తీవ్రంగా గాయపరిచిన ఘటన స్థానిక సిక్కులను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది.

 'డైలీ సిఖ్ అప్డేట్స్' అనే ఫేస్బుక్ సైట్లో ఉంచిన దాడి తాలుకూ వీడియోల ఆధారంగా బ్రిటన్ పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేశారు. ఆదివారం రాత్రి  జరిగినట్లుగా భావిస్తున్న ఈ దుశ్చర్యను  జాత్యహంకార దాడిగానే భావిస్తున్నామని, అయితే బాధితుడు ఎవరనేది తెలియరాలేదని, ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తే అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని మంగళవారం బర్మింగ్ హోమ్ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement