ఇక గంటల్లోనే పీఎఫ్ విత్ డ్రా | Sakshi
Sakshi News home page

ఇక గంటల్లోనే పీఎఫ్ విత్ డ్రా

Published Mon, Feb 20 2017 10:41 AM

ఇక గంటల్లోనే పీఎఫ్ విత్ డ్రా

న్యూఢిల్లీ : ఉద్యోగుల పీఎఫ్ విత్ డ్రాయల్ ప్రక్రియ ఇక నుంచి గంటల వ్యవధిలోనే ముగియనుంది. క్లైయిమ్స్ సెటిల్మెంట్ కోసం ఆన్ లైన్ ప్రక్రియను ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) త్వరలోనే  లాంచ్ చేయనుంది. ఈ ఆన్లైన్ సౌకర్యం ద్వారా ఈపీఎఫ్‌ విత్ డ్రాయల్, పెన్షన్ స్థిరీకరణ వంటి అన్ని సదుపాయాలను కల్పించనుంది. పేపర్ వర్క్కు స్వస్తి పలికి ఈపీఎఫ్లను కూడా ఆన్లైన్ చేయాలని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. ప్రస్తుతం ఈపీఎఫ్ విత్ డ్రాయల్ క్లైయిమ్ కోసం దాదాపు కోటి దరఖాస్తులు ఈపీఎఫ్ఓ ఆఫీసుకు వచ్చాయి. పీఎఫ్ విత్ డ్రా, పెన్షన్ స్థిరీకరణ,మరణించిన వారి ఇన్సూరెన్స్ లబ్ది వంటి దరఖాస్తులు దీనిలో ఉన్నాయి. 
 
మొత్తం కార్యక్షేత్రాలను, సెంట్రల్ సర్వర్తో అనుసంధించే ప్రక్రియ నడుస్తుందని,  మే చివరి వరకు అన్ని దరఖాస్తులను, క్లైయిమ్స్ను ఆన్ లైన్లోనే  నమోదు చేసుకోవచ్చని ఈపీఎఫ్ఓ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ తెలిపారు. దరఖాస్తు నమోదుచేసిన కొన్ని గంటల్లోనే క్లైయిమ్స్ను సెటిల్ చేసేలా ఈపీఎఫ్ఓ ఈ ఆన్ లైన్ ప్రక్రియను ప్రారంభిస్తుందని అధికారులు చెప్పారు. దీంతో ఇక ఈపీఎఫ్‌ విత్ డ్రాయల్ క్లైయిమ్ ప్రక్రియ మూడు గంటల్లోనే ముగియనుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియకు 20 రోజుల వ్యవధి పడుతోంది.  ఈ ఆన్ లైన్ ప్రక్రియ కోసం పెన్షనర్లు, సబ్ స్క్రైబర్లందరూ తప్పనిసరి ఈపీఎఫ్ఓ వద్ద తమ ఆధార్ నెంబర్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ సౌకర్యాన్ని వాడుకోవడానికి ఇది ఖాతాదారులకు ఎంతో సహకరించనుంది. 

Advertisement
Advertisement