'మహిళలపై ధృక్పథాన్ని మార్చుకోండి' | Change of mind set required to check crimes against women,Maneka Gandhi | Sakshi
Sakshi News home page

'మహిళలపై ధృక్పథాన్ని మార్చుకోండి'

Jul 11 2014 7:02 PM | Updated on Mar 29 2019 9:24 PM

దేశంలో మహిళలపై యధేచ్చగా జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే సమాజంలోనే మార్పు రావాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు.

న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై యధేచ్చగా జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే సమాజంలోనే మార్పు రావాలని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలకు సంబంధించి ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రాకపోతే నిర్మూలించడం అనేది కష్టతరమని ఆమె పేర్కొన్నారు. ఇందుకు గాను మహిళల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు వివిధ రకాలైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు మేనకా గాంధీ తెలిపారు.

 

మహిళా రక్షణ అనేది దేశ ప్రాథమిక కర్తవ్యమని ఆమె పేర్కొన్నారు. మహిళలు నివసించే చోట, ఉద్యోగాలు చేసే చోట అనువైన వాతావరణాన్ని కల్పించటమే ప్రభుత్వ లక్ష్యమని మేనక స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement