సూరత్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం | BJP wins by 70000 votes in Surat West assembly seat by-poll | Sakshi
Sakshi News home page

సూరత్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం

Dec 8 2013 11:56 AM | Updated on Mar 29 2019 9:18 PM

గుజరాత్లోని సూరత్ పశ్చిమ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది.

గుజరాత్లోని సూరత్ పశ్చిమ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి పూర్ణేష్ మోడీ కాంగ్రెస్ అభ్యర్థి డిఎల్ పటేల్ పై దాదాపు 70 వేల ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. పూర్ణేష్ మోడీ విజయం పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హార్షం వ్యక్తం చేశారు. నరేంద్రమోడీ ఈసందర్బంగా పూర్ణేష్ మోడీ కి శుభాకాంక్షలు తెలిపారు. సూరత్ పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ ఎమ్మెల్యే కిషోర్ వంకవాలా ఆకస్మికంగా మరణించారు. దాంతో సూరత్ పశ్చిమ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
 

Advertisement
 
Advertisement
Advertisement