ఢిల్లీ సీఎం అభ్యర్థిపై బీజేపీలో సందిగ్థత | BJP confusion on Delhi CM candidate | Sakshi
Sakshi News home page

ఢిల్లీ సీఎం అభ్యర్థిపై బీజేపీలో సందిగ్థత

Jan 18 2015 11:41 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఢిల్లీ సీఎం అభ్యర్థిపై బీజేపీలో సందిగ్థత - Sakshi

ఢిల్లీ సీఎం అభ్యర్థిపై బీజేపీలో సందిగ్థత

బీజేపీలో ఢిల్లీ సీఎం అభ్యర్థిపై సందిగ్థత నెలకొంది.

న్యూఢిల్లీ: బీజేపీలో ఢిల్లీ సీఎం అభ్యర్థిపై సందిగ్థత నెలకొంది. ఎన్నికల ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించాలని పార్టీలోని కొందరు నేతలు చేసిన విజ్ఞప్తిని సీనియర్లు తోసిపుచ్చారు. పార్టీలో కొత్త సంప్రదాయాలకు తెరతీయొద్దని వారికి సూచించారు. ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని సీనియర్లు స్పష్టం చేశారు. అయితే నిన్న కాక మొన్న వచ్చిన కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని సీనియర్లు ఆలోచనలో పడ్డారు.  

హస్తిన ప్రజల్లో కిరణ్ బేడీకి మంచి పేరు ఉందని వారు బీజేపీ సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై కిరణ్ బేడీని పోటీకి నిలపాలని వారు నిర్ణయించినట్లు సమాచారం. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన న్యూఢిల్లీ పార్టీ అధ్యక్షుడు మూడో స్థానంలో నిలిచారు. దాంతో కిరణ్ బేడీనే బరిలో నిలపాలని  సీనియర్లు సమాలోచనలు చేస్తున్నారని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement