తుపాకుల మోతలేని రాష్ట్రంగా తెలంగాణ | Sakshi
Sakshi News home page

తుపాకుల మోతలేని రాష్ట్రంగా తెలంగాణ

Published Sun, Oct 4 2015 2:39 AM

తుపాకుల మోతలేని రాష్ట్రంగా తెలంగాణ - Sakshi

ఎన్‌కౌంటర్‌తో బాధపడ్డాం: కేటీఆర్

 హన్మకొండ: తుపాకుల మోత లేని తెలంగాణగా ఉండాలని ఉద్యమ సమయంలో భావించామని, ఇప్పుడు కూడా తుపాకులు ఉండొద్దనే కోరుకుంటున్నామని, సీఎం కేసీఆర్ నాడు ఇదే చెప్పారని, ఇప్పుడు ఇదే కోరుకుంటున్నామని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం హన్మకొండలో విలేకరుల సమావేశంలో, అనంతరం జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్‌కౌంటర్ జరిగినందుకు బాధపడ్డామన్నారు. నక్సలైట్ల సామాజిక, అర్థిక ఎజెండానే తమ ఎజెండా అన్నారు.  తెలంగాణలో తుపాకీ మోతలుండవన్నారు.

తెలంగాణలో ఎక్కడ నెత్తురు చిందిని పోలీసులైనా, నక్సలెటైై్లనా ఎవరు చనిపోయిన తెలంగాణ బిడ్డేనని గతంలో బాధపడ్డాం, ఇప్పుడు బాధపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి ఏం అడిగిన మొండి చేయి చూపిందని విమర్శించారు. గల్లీ నాయుడు, ఢిల్లీ నాయుడు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని చెప్పిన కేంద్రం నుంచి స్పందన లేదని విమర్శించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యేలు దాస్యం వినయభాస్కర్, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, శంకర్‌నాయక్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement